లాక్‌డౌన్‌ ఎత్తేశాక .. ఎలా కంట్రోల్‌ చేద్దాం?

  • రాష్ట్రాల సిఎంలను ప్రశ్నించిన ప్రధాని మోదీ
  • కలసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని సూచన
  • వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన ప్రధాని
  • రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై కెసిఆర్‌ ‌వివరణ

లాక్‌డౌన్‌ ‌ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే జరిగితే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించేందుకు రాష్టాల్రు, కేంద్రం సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించు కోవాలని సూచించారు. అన్ని రాష్టాల్ర సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ‌సందర్భంగా ఈ అనుమానం వ్యక్తంచేశారు. దేశంలో కోవిడ్‌-19 ‌పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చించారు. కేంద్ర •ంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ‌భేటీలో పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా రాష్టాల్ర సీఎంలు స్పందిస్తూ… క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారన్నారు. ఢిల్లీ మర్కజ్‌ ‌వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు ప్రధానికి తెలిపారు.

కరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరగకుండా తీసుకున్న చర్యలను ఆయా రాష్టాల్ర సిఎంలు ప్రధానికి వివరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ… కరోనా కట్టడికి రాష్టాల్రు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ ‌ముగియనున్న నేపథ్యంలో ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. కావునా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన వ్యూహాలు ఆలోచించుకుని చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడికి స్వచ్చంద, సంక్షేమ సంస్థల, సామాజిక నేతల సహకారం తీసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణకు సహకరిస్తున్న అందరికీ ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్‌ ‌కేసుల్లో 111 కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయినవారేనని సీఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాలు అనుసరిస్తోందని,13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కరోనా వైరస్‌ ‌సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ఆస్పత్రులను కేటాయించామన్నారు. 10,933 నాన్‌ ఐసీయూ బెడ్స్, 622 ఐసీయూ బెడ్స్ ఈ ఆస్పత్రుల్లో సిద్ధం చేశాం.

మొత్తంగా 1000 ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచాం. దీనికి తోడుగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్‌ ‌కోసం మరో 20వేల బెడ్లను రెడీ చేశాం. అంతేకాక క్షేత్రస్థాయిలో నిరంతరం గట్టి పర్యవేక్షణ చేస్తున్నాం. రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి కుటుంబాల వారీగా సర్వే చేస్తున్నాం. ఢిల్లీలో తబ్లిగీ జమాతే సదస్సుకు హాజరైన వారిని క్వారంటైన్‌కు తరలించాం. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించి.. పరీక్షలు నిర్వహించి, మంచి వైద్యం అందిస్తున్నామని వివరించారు. వైద్యపరంగా ఇప్పుడున్న యంత్రాంగాన్ని, పరికరాలను పూర్తిస్థాయిలో మోహరిస్తున్నాం. అయితే అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడానికి టెస్టు కిట్లు, పర్సనల్‌ ‌ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ‌మరిన్ని కావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెలలో ఇవ్వాల్సిన జీతాల్లో యాభైశాతం వాయిదా వేశాం. ఆదాయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కరోనా నివారణా చర్యలకోసం అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతోంది. ఇది దృష్టిలో ఉంచుకోవాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రధాని మోదీని కోరారు. కాగా, ప్రధానితో సమావేశంలో సీఎం జగన్‌తో పాటు.. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, •ంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్‌ ‌నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌ ‌పాల్గొన్నారు. హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్‌, ‌మంత్రి ఈటెల రాజేందర్‌, ‌సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌డిజిపిలు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment