ఛత్తీస్‌ఘడ్‌ ‌ప్రభుత్వం చారిత్రక నిర్ణయం

రిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన సిఎం

రాయ్‌పూర్‌,‌డిసెంబర్‌3 : ‌ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి పెంచింది. ఈ మేరకు శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించింది. స్పీకర్‌ ‌నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యేలంతా ప్రధానిని కలిసి… ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరాలని విజ్ఞప్తి చేశారు.ఈ బిల్లుల ప్రకారం షెడ్యూల్‌ ‌తెగలకు 32 శాతం, ఇతర వెనకబడిన కులాలకు 27 శాతం, షెడ్యూల్‌ ‌కులాలకు 13 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. మరో 4 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. ఇంత భారీ ఎత్తున రిజర్వేషన్లను పెంచడం దేశచరిత్రలోనే ఇదే తొలిసారి. ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున సాహసం చేయలేదు. జనభా ప్రతిపాదికన రిజర్వేషన్లను పెంచినట్లుగా సీఎం భూపేశ్‌ ‌బఘేల్‌ ‌వెల్లడించారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment