సాగునీటి రంగంలో గొప్ప విజయాలు

సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప విజయాలు సాధిస్తున్నదని,ఈ విజయాలు రాష్ట్ర వృద్ధిరేటులో ప్రతిబింబిస్తున్నాయని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 80. 500 కోట్ల వ్యయంతో నిర్మించిన, నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ప్రపంచంలోనే బహుళ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌గా ప్రపంచంలోనే పేరు గడించింది. గత దశాబ్దాలుగా ఏనాడు లేని రీతిలో శ్రీరాంసాగర్‌ ‌కింద మొదటిపంటకు పూర్తిస్థాయిలో సాగు జరిగింది. అదేవిధంగా సాగర్‌ ఎడమకాల్వకింద టైలాండ్స్ ‌వరకు 6లక్షల ఎకరాల వరకు సాగు జరిగింది.ఈ సీజన్‌లో మొదటి పంటకు లభించిన సాగునీరు గత దశాబ్దకాలంలో లభించలేదని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం 22 భారీ ప్రాజెక్ట్‌లు, 13 మధ్యతరహాప్రాజెక్ట్‌లు వరదకాలం ఆధునీకరణ ప్రాజెక్ట్‌లు ప్రగతిపథంలో ఉన్నాయి.కోయిల్‌సాగర్‌, అలీసాగర్‌, ‌గుత్ప, భక్తరామదాసు, సింగూర్‌‌ప్రాజెక్ట్ ‌వంటి భారీ ప్రాజెక్ట్‌లు ఉత్తర దక్షిణ తెలంగాణలను సస్యశ్యామలం చేసేందుకు సిద్ధమయ్యాయి.

అదేవిధంగా రాలివాగు, గొల్లవాగు, మత్తడివాగు, గడ్డెన్న వాగు, చౌటుపల్లి, కిన్నెరసాని నాగార్జునసాగర్‌ ఆధునీకరణ ప్రాజెక్ట్ అతి తక్కువ కాలంలో అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటికీ తోడు నీటినిల్వ అవుతున్న ప్రతీ ప్రాంతంలో చెక్‌డ్యాంలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ఈ చెక్‌డ్యాంలు చిన్ననీటివనరులై సాగువిస్తీర్ణాన్ని పెంచనున్నాయని ఆర్థిక సర్వే పేర్కొన్నది.

Tags: Ralliwagu, Gallowagu, Mudduvagu, Gadunna Vagu, Chautupalli, Kinnarasani Nagarjunasagar Modernization Project

Chautupallifield of irrigationGadunna VaguGallowaguGreat achievementsKinnarasani Nagarjunasagar Modernization ProjectMudduvaguRalliwagu
Comments (0)
Add Comment