గోదావరి, కృష్ణ బోర్డు ల ఏర్పాటు ..!

  • ఆరు ప్రాజెక్టులకు డీపీఆర్వో సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం
  • ఎటువంటి డీపీఆర్వో సమర్పించని ఆంద్ర ప్రదేశ్ కేంద్రం వెల్లడి 
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 87, సబ్-సెక్షన్ 1 ప్రకారం గోదావరి, కృష్ణ బోర్డు లు ఏర్పాటయ్యాయి. తెలంగాణ రాష్ట్రం 6 ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు ఎలాంటి డీపీఆర్‌లను సమర్పించలేదు. 2021 జులై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాం అని తెలిపిన కేంద్రం. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లు అమలవుతున్న తీరుపై సమాచారం కోరుతూ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇందుకు గాను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సమాధానంలోని కీలకాంశాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై తమ విధులను నిర్వహించటంలో భాగంగా  కె ఆర్ ఎం బీ   మరియు జీఆర్ఎంబీ  లకు రెండు రాష్ట్రాలు తమవంతుగా ఇవ్వాల్సిన రూ.200 కోట్ల సీడ్ మనీ ఇంకా జమ చేయలేదు అని కేంద్రం తెలిపింది. రెండు రాష్ట్రాలు ఈ డబ్బును 60 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. 135 రోజులు అయినా కూడా ఇంకా రెండు తెలుగు  రాష్ట్రాలు సీడ్ మనీ జమ చేయలేదు అని కేంద్రం తెలిపింది.  రెండు రాష్ట్రాలు అన్ని కార్యాచరణ ప్రాజెక్టులు, కెనాల్ నెట్‌వర్క్ మరియు ట్రాన్స్‌మిషన్ లైన్‌ల అధికార పరిధిని అప్పగించాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14.10.2021 నాటికి ప్రాజెక్టులను అప్పగించేందుకు గెజిట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి జీవోను ఇంకా జారీ చేయలేదు అని కేంద్రం తెలిపింది. పైన పేర్కొన్న ప్రాజెక్టులకు రెండు తెలుగు రాష్ట్రాలు ఫార్మాలిటీస్ పూర్తి చేసి కేంద్రానికి పంపే వరకు రెండు రాష్ట్రాల ఆమోదం పొందని ప్రాజెక్టులపై కొనసాగుతున్న అన్ని పనులను నిలిపివేయవలసి ఉంటుంది అని కేంద్రం తెలిపింది.
ఆరు నెలల్లోగా రెండు తెలుగు రాష్ట్రాలు ఫార్మాలిటీస్ పూర్తి చేయకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న ఆమోదించబడని ప్రాజెక్ట్‌ల పూర్తి లేదా పాక్షిక ఆపరేషన్స్ ఆగిపోతుంది అని కేంద్రం తెలిపింది. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై ఏర్పాటు అయిన బోర్డులో ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల ప్రతినిధులుంటారు అని, నోటిఫికేషన్ తేదీ నాటికి ఆపరేషన్ లో ఉన్న ప్రాజెక్టులు బోర్డు ఆధీనంలోకి వస్తాయి అని, ఇంకా ఆపరేషన్ లో  లేని ప్రాజెక్టులు, ఎప్పుడైతే ఆపరేషన్ ప్రారంభిస్తాయో అప్పటి నుంచి బోర్డు పరిధిలోకి వస్తాయి  అని, నోటిఫికేషన్‌ను అమలు చేసే పనిని గోదావరి, కృష్ణ బోర్డులు ఇప్పటికే ప్రారంభించాయి అని, గెజిట్ నోటిఫికేషన్ అమలవుతోంది అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇలా సమాధానం ఇస్తున్నప్పుడు సభలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ధాన్యం సేకరణపై చర్చకు పట్టుబట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. ఆందోళనల నడుమ కొనసాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం సాగింది.
godavariKrishna boardsPrajatantraWater war between telugu states
Comments (0)
Add Comment