ప్రపంచ ఉన్నత విద్యా చరిత్ర కు పునాదులను ఏర్పాటు చేసి విస్తరింప చేసిన ఘనత భారత్ కు ఉంది.అమెరికా ఐరోపా ,తోటి ఆసియా దేశాల కంటే అనేక శతాబ్దాల ముందే భారత్ లో ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి.ఇటలీ లో 1088 సంవత్సరంలో, ప్రాన్స్ లో 1093 లో ఇంగ్లండ్ లోని అక్స్ ఫర్డ్ లో 1167లో,కేంబ్రిడ్జ్ 1209 లో ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి.కానీ భారత్ లో ఆరవశతాబ్దంలో నే నలందా ,విక్రమశిల అనే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి
ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్నత విద్యా సంస్థలకు విశ్వవిద్యాలయాలకు నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ర్యాంకులను నిర్ణయించే లండన్ కు చెందిన ప్రతిష్ఠాత్మక కాక్వరెల్ సైమండ్స్ అనే సంస్థ జూన్ 10 2020 లో ప్రపంచ ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితా 2021ని విడుదల చేసింది .92 దేశాలకు చెందిన మొత్తం 5500 ల విశ్వవిద్యాలయంలను పరిశీలించి మెరుగైన1000 విద్యాసంస్థలతో జాబితాను రూపొందించింది.ఈ జాబితాలోని ర్యాంకింగులలో ఎప్పటిలాగానే భారత్ వెనుకబాటును ప్రదర్శించింది. జాబితాలో చివరి స్థానాల్లో ఉండే భూతం భారత్ ను వెంటాడుతూనే ఉంది. తొలి 100 జాబితాలో ఒక్క భారతీయ విద్యా సంస్థలకు కూడా చోటు లభించలేదు. దేశంలో 993 విశ్వవిద్యాలయాలు 39 వేలు 931 కళాశాలలు పదివేల 721 స్వతంత్ర విద్యాసంస్థలు ఉన్నవి. వీటిలో క్యూ యస్ విడుదల చేసిన టాప్ 1000 జాబితాలో కేవలం ఇరవై ఒక్క భారత విద్యాసంస్థలు మాత్రమే స్థానం సంపాదించుకున్నాయి.ఐఐటి బాంబే 172,ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు 185,ఐఐటి ఢిల్లీ 193 స్థానాలతో చోటును పొందాయి.తోటి ఆసియా దేశాలైన సింగపూర్ లోని నవాంగ్ సంస్థకు 13వ,చైనా లోని శింగువా కు 15వ,జపాన్ లోని టోక్యో విశ్వవిడలయాలకు 24 వ స్థానాలు దక్కాయి.అమెరికాకు చెందిన మాసాచుసెట్స్ ,స్టాన్ఫర్డ్ ,హార్వర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీలు తొలి నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.తర్వాతి స్థానాలలో యు కె విద్యాసంస్థలు ఉన్నాయి.బోధన ప్రమాణాలు,జాబ్ మార్కెట్ కు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం, పరిశోధనలు పేటెంట్లు,అధ్యాపక విద్యార్థుల నిష్పత్తి,విదేశీ బోధనా సిబ్బంది,విద్యార్థులను కలిగివుండే అంతర్జాతీయ దృక్కోణం ఆధారంగా క్యూ యస్ సంస్థ 2004 నుండి ఉత్తమ విద్యా సంస్థల జాబితాను విడుదల చేస్తున్నది. దీనికి అంతర్జాతీయంగా ఆమోదయోగ్యత ఉంది.
ప్రపంచ ఉన్నత విద్యా చరిత్ర కు పునాదులను ఏర్పాటు చేసి విస్తరింప చేసిన ఘనత భారత్ కు ఉంది.అమెరికా ఐరోపా ,తోటి ఆసియా దేశాల కంటే అనేక శతాబ్దాల ముందే భారత్ లో ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి.ఇటలీ లో 1088 సంవత్సరంలో, ప్రాన్స్ లో 1093 లో ఇంగ్లండ్ లోని అక్స్ ఫర్డ్ లో 1167లో,కేంబ్రిడ్జ్ 1209 లో ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి.కానీ భారత్ లో ఆరవశతాబ్దంలో నే నలందా ,విక్రమశిల అనే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి.కరుణ ప్రేమ ప్రజ్ఞ కార్యకారంవాదం వంటి మేలైన తాత్వికత కలిగిన బుద్ధిస్ట్ పునాదులతో ఇవి నడిచాయి.చైనా,జపాన్,ఇండోనేషియా, కొరియా,థాయిలాండ్ వంటి అనేక ఆసియా దేశాల విద్యార్థులతో పాటు టర్కీ వంటి ఐరోపా దేశ విద్యార్థులకు ఆధునిక విద్యను అందించింది.ఒక దశలో పదివేల మంది విద్యార్థులతో నలందా కళ కళ లాడింది.
మతం ,చరిత్ర,ప్రజారోగ్యం,వైద్యం,వా స్తు,శిల్పం,న్యాయము,భాష,అంతరి క్షము,గణితం వంటి శాస్త్రాలు బోధించబడ్డాయి.చైనా లో ఖగోళ అంతరిక్ష శాస్త్ర పితామహుడు జుంగ్ జాంగ్,వైద్య పితామహుడు యి లింగ్ లు నలందా విద్యార్థులే.12 వ శతాబ్దం వరకు అద్భుతంగా నడిచి ప్రపంచ ఉన్నత విద్య కు మూలమైన నలంద వైదిక ప్రతిఘాతక శక్తుల,భక్తియార్ ఖిల్జీ దండయాత్రలలో అపారంగా పొగుపడిన జ్ఞాన సంపద, భవనాలు కాలిపోయాయి.తర్వాత పునరుద్ధరణకు ఎంత ప్రయత్నం చేసినా పూర్వపు ప్రామాణికతను పొందలేకపోయింది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దార్శనికుడు వైజ్ఞానికుడు అయినా తొలి ప్రధాని నెహ్రూ ఉన్నత విద్య ఆవశ్యకతను గుర్తించి 1948 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో భారత విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశారు దేశ ఆర్థిక సుస్థిరత నిర్మాణంలో అభివృద్ధికి ఆనవాలుగా నిలిచే కీలక మానవ వనరుల అభివృద్ధి లో విశ్వవిద్యాలయాలు వెలకట్టలేని పాత్రను పోషిస్తాయని కమిషన్ సూచించింది 1950 నుండి ప్రధాని నెహ్రూ అపారమైన నిధులు కేటాయించి ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలను ఐఐటి లను ఐ ఐ యమ్ లను మరియు అనేక పరిశోధన అభివృద్ధి సంస్థలను స్థాపించాడు.వందలాది ప్రభుత్వ పరిశ్రమలను వీటికి అనుసంధానం చేసాడు. ఇవన్నీ1980 దశాబ్దం వరకు మెరుగైన ప్రమాణాలతో నడిచి ఆర్ధిక స్వయం స్వాలంబన సాధనలో కీలకపాత్ర పోషించాయి.1991 నూతన సరళీకృత ఆర్ధిక విధానాలతో ఉన్నత విద్యా రంగము లో ప్రవేటికరణ ప్రవేశించింది.ప్రభుత్వ నిధులు తగ్గాయి.గత ఆరేళ్ళ మోడీ పాలనలో అవసానదశకు ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు చేరాయి.కేంద్రం నుండి మద్దతు లేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులుఎత్తేసాయి.ఇప్పుడు ఉన్నత విద్య దాదాపు ప్రవేట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గా మారింది.అమానవీయమైన వ్యాపార వనరుగా మారి అసమ సమాజాన్ని మరింత బలోపేతం చేస్తున్నది.
ఉన్నత విద్యకు, పరిశోధనలకు జిడిపి లో ఆరు శాతం నిధులు ఇవ్వాలి అని అనేక కమిషన్ లు ఘోషించిన
రాను రాను తగ్గి గత అరేళ్లలో మరింత క్షిణించి 0.69% నిధులను మాత్రమే ఇస్తున్నారు.నాణ్యమైన విద్యను అందించడంలో ,పరిశోధనలకు ఉన్నత మార్గదర్శనం.ఇవ్వడంలో అధ్యాపకులు విలువైన పాత్ర పోషిస్తారు.విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో తగినంత బోధన సిబ్బందిని భర్తీ చేయడం లేదు.2018 నాటి పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదిక ప్రకారం- విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) పరిధిలోకి వచ్చే కళాశాలల్లో ఐదు లక్షల బోధకుల కొరత ఉంది.ఉద్యోగ భద్రతలేని తక్కువ వేతనాలను ఇస్తూ ఒప్పంద బోధనా సిబ్బందిని నియమిస్తున్నాయి.అనేక ప్రవేట్ సంస్థలు అధిక లాభార్జన కోసం పిసినారితనం ప్రదర్శించి తక్కువ జీతాలతో అరకొరగా బోధనా సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఉద్యోగ అభద్రత మానసిక స్థితిలో ,ఒత్తిడిలో వారు పరిశోధనలపై ఏకాగ్రత పెట్టడము అంత సుళువు కాదు. కాలక్రమంలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో బోధకుల కొరత అంతకంతకూ ఎక్కువవుతోంది. విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2014-15లో 24.3గా ఉండగా, 2018-19 నాటికి 26.3కి పెరిగింది. ఇదే కాలంలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 22 నుంచి 29కి పెరిగింది. అంతర్జాతీయంగా పోల్చినప్పుడు… విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో భారత్- అమెరికా, యూకే, చైనా, బ్రెజిల్, కెనడా, రష్యా, స్వీడన్ తదితర దేశాలకన్నా వెనకంజలో ఉంది. ప్రపంచంలోని కొన్ని అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో ఏక అంకెను కూడా కలిగి ఉన్నాయి.
ప్రపంచ మేదోహక్కుల సంస్థకు 2018 లో భారత్ 50555 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసింది. చైనా 13 లక్షల పేటెంట్ల కోసం ,అమెరికా ఆరు లక్షల పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్ చాలా వెనుకబడి ఉంది.
భారత్ లోని మధ్యతరగతి,కులీన వర్గం నుండి విద్యార్థులు ఆధునికతను సంతరించుకున్న ప్రతిష్టాత్మక ఐఐటి ఐఐఎం కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో చదువుకున్న వారు అనేక అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలకు నేతృత్వం వహిస్తున్నారు.విదేశాలలో గొప్ప సంస్థలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.మంగుళూరు విశ్వ విద్యాలయ విద్యార్థి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సి యి ఓ గా, ఐఐటి ఖరగ్ పూర్ విద్యార్థి సుందర్ పిచయ్ గూగుల్ సి యి ఓ గా,ఐఐటి కాన్పూర్ విద్యార్థి అరవింద్ కృష్ణ ఐబియమ్ సి యి ఓ గా ఇలా పెద్ద జాబితా లో మన వాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర వహిస్తున్న సంస్థలలో పని చేస్తున్నారు. భారత్ లోని అన్ని సాంకేతిక సామాజిక జీవశాస్త్ర వైద్య సంస్థలను ప్రపంవః స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దితే ఇంకా లక్షలాదిగా ఉన్నత మానవ వనరులు రూపొందుతాయి.అలాగే ఉన్నత విద్య కు పటిష్టమైన పునాదులు వేసే పాఠశాల విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే గుణాత్మక నాణ్యతతో నిర్వహించాలి.ప్రజాతంత్ర విద్యకు ప్రజల జీవన ప్రమాణాలు అవినావభావ సంబంధం నడుస్తున్న చరిత్ర నిరూపిస్తున్నది. పాలకులు పౌరసమాజం బలమైన నిబద్ధతతో ఈ దిశలో కృషి చేస్తే అది నూట ముప్పై కోట్ల భారత ప్రజలకు విద్య తద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలు అందుకుని గౌరవప్రదమైన జీవనం గడపటానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. అంతర్జాతీయ యవనిక పై భారత విద్యా పతాకం రెప రెపలాడుతుంది.
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
9652275560