ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగండి

  • కాపీ కొట్టేవారు ఎప్పటికీ జీవితంలో నెగ్గలేరు
  • తల్లిదండ్రుల ఆశలు ఎలాగూ ఉంటాయి
  • పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ
  • బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలి : రంగారెడ్డి జిల్లా ప్రశ్నకు ప్రధాని సోదాహరణంగా జవాబు
  • విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపిన ప్రధాని మోడీ : పరీక్షా పే చర్చలో పాల్గొన్న బండి సంజయ్‌

న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌జనవరి 27 : క్రెకెట్‌లో బ్యాట్స్‌మెన్‌లో తమ దృష్టి బాల్‌ను ఎదుర్కునడంపైనే సారించినట్లు విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తమ దృష్టి చదువుపై సారించాలని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. స్టేడియంలో ప్రేక్షకులు ఫోర్లు, సిక్సర్లు బాదాలని ఆశిస్తారని, కానీ బ్యాట్స్‌మెన్‌ ‌తను ఎదుర్కునబోయే బాల్‌ ‌గురించి మాత్రమే ఆలోచిస్తాడని అన్నారు. శుక్రవారం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి చర్చలో ప్రధాని మాట్లాడుతూ..‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం తనకు కూడా పరీక్షేనని..కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమంలో భాగంగా దిల్లీ తల్కతోరా స్టేడియంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఆశించడం సహజమే..కానీ స్టేటస్‌ ‌కోసం వారిని ఒత్తిడి చేయొద్దని సూచించారు. రాజకీయాల్లో తమక్కూడా ఒత్తిడి ఉంటుందని, కానీ ఆ ఒత్తిడితో వి• సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దని విద్యార్థులకు చెప్పారు. జీవితంలో టైమ్‌ ‌మేనేజ్‌మెంట్‌ అత్యంత ప్రధానమని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తమ తల్లులు ఇంట్లో ఎలా టైమ్‌ ‌మేనేజ్‌ ‌చేస్తూ… పనులు నిర్వర్తిస్తారో గమనించాలని విద్యార్థులకు సూచించారు. ఒత్తిడిలో ఉండకండి.. ఒత్తిడిలో ఆలోచించకండి.. ముందు విశ్లేషించండి, పని చేయండి.. విరు ఆశించిన దాన్ని సాధించేవరకు వివంతు కృషి చేయండని మోడీ సూచించారు.

ఇక పరీక్షల్లో కాపీ కొట్టడంపైనా ప్రధాని మోడీ మాట్లాడారు. కాపీ చేస్తే ఒక్కసారి, లేదా రెండు సార్లు పరీక్షలో నెగ్గొచ్చు, కానీ జీవితాన్ని నెగ్గలేరని చెప్పారు. షార్ట్‌కట్‌ను ఎప్పుడూ తీసుకోవద్దని, విద్యార్థులు కష్టపడి జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఒత్తిడిని మోడీ క్రికెట్‌తో పోల్చారు. క్రికెట్‌ ‌మైదానంలో ఉన్న బ్యాటర్‌ .. ఆడియెన్స్ అరుపులను పట్టించుకోకుండా అతనికి ఎదురుగా వొస్తున్న బంతిపైన్‌ ‌ఫోకస్‌ ‌చేస్తాడన్నారు. అదే విధంగా విద్యార్థులు కూడా ఒత్తిడిని పక్కనబెట్టి, చదువుపై దృష్టి సారించాలని చెప్పారు.

బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలి : రంగారెడ్డి జిల్లా ప్రశ్నకు ప్రధాని సోధాహరణంగా జవాబు
శుక్రవారం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జిల్లా జవహర్‌ ‌నవోదయ విద్యాల విద్యార్థిని అక్షర ప్రధానిని బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ తన అనుభవంలోకి వొచ్చిన ఒక ఉదాహరణను వివరిస్తూ..కార్మికులు నివసించే బస్తీలోని ఒక ఎనిమిదేళ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళం మాట్లాడడం తనను ఆశ్చర్య పరిచిందని, ఆ బాలికకు అన్ని భాషలు మాట్లాడడం ఎలా సాధ్యమైందని ఆరా తీయగా ఆ బాలిక నివసించే ఇంటి పక్కనే వివిధ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వొచ్చిన వారంతా ఒకే దగ్గర నివసించడంతో ఆ బాలిక వారితో నిత్యం మాట్లాడుతున్న క్రమంలో ఆమెకు అన్ని భాషలు వొచాచయని, ఆమె చొరవ మెచ్చుకోదగినదని, ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు అవసరం లేదని, నేర్చుకోలనే తపన ఉంటే అది సాధ్యమవుతుందని సమాధానమిచ్చారు.

సమాజానికి ఉపయోగపడని జ్ఞానం వ్యర్థం : పరీక్షా పే చర్చలో పాల్గొన్న బండి సంజయ్‌
‌సమాజానికి ఉపయోగపడని జ్ఞానం వ్యర్థమని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్ధటంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని బండి సంజయ్‌ ‌కొనియాడారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం నింపటానికే పరీక్షా పే చర్చా కార్యక్రమమని అన్నారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర వ్వయహారాల ఇన్‌ఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌, ‌చింతల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం విడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా 600 పాఠశాల్లో పరీక్ష పే చర్చా కార్యక్రమం జరిగిందన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. కొన్ని కార్పొరేట్‌ ‌పాఠశాలలు ర్యాంకుల కోసం విద్యార్థులను రాచి రంపాన పెడ్తున్నాయని మండిపడ్డారు. కొన్ని కార్పొరేట్‌ ‌స్కూల్స్ ‌ర్యాంకులను కొంటున్నాయని ఆరోపించారు. మెదటి ర్యాంకు వొచ్చినా సామాజిక స్పృహ లేని విద్య అవసరం లేదన్నారు. మక్‌ ‌కీ బాత్‌ ‌కార్యక్రమం స్పూర్తితో సక్సెస్‌ అయిన విద్యార్థులు లక్షల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశానికి ఉపయోగపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. ర్యాంకుల కోసం తల్లిదండ్రులు పిల్లలను చదివించవద్దని…

Comments (0)
Add Comment