గణేష్‌ ‌మండపాల అనుమతులు ఆన్‌ ‌లైన్‌ ‌లోనే: డిఐజి రంగనాధ్‌

  • ‌మండపాల నిర్వాహకుల వివరాలు సంబందిత పోలీస్‌ ‌స్టేషన్లో సమర్పించాలి
  • పోలీసుల సూచనలు పాటిస్తూ నవరాత్రులు డి.జె.లకు అనుమతి లేదు

నల్లగొండ : గణేష్‌ ‌విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్‌ ‌శాఖ ద్వారా తీసుకోవాల్సిన అనుమతులను ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారానే ఇవ్వనున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్‌ ‌తెలిపారు. తెలంగాణ పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న http://policeportal.tspolice.gov.in ద్వారా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండపాల నిర్వాహకులు వెబ్‌ ‌సైట్‌ ‌ద్వారా వివరాలను రిజిస్ట్రేషన్‌ ‌చేసుకోవాలని సంబందిత పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని అధికారులు వాటిని పరిశీలించి గణేష్‌ ‌మండపాల ఏర్పాటుతో పాటు నిమజ్జన అనుమతులు ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా ఇస్తారని ఆయన తెలిపారు. గణేష్‌ ‌నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

మండపాల నిర్వాహకులు పోలీస్‌ ‌శాఖ సూచనలు పాటిస్తూ కోవిడ్‌ ‌నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. గణేష్‌ ‌మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటి వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్‌ ‌నెంబర్లు సంబందిత పోలీస్‌ ‌స్టేషన్లలో సమర్పించాలని ఆయన తెలిపారు. గణేష్‌ ‌మండపాల వద్ద, నిమజ్జన శోభాయాత్రలో డి.జె.లకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని సీజ్‌ ‌చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. గణేష్‌ ‌నవరాత్రులను నిర్వహించే సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

DIG Ranganath
Comments (0)
Add Comment