స్వతంత్ర భారతావనిలో రాష్ట్రాల ఏర్పాటు

స్వతంత్ర భారతంలో  రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ ఒక ప్రధాన ఘట్టం, ముఖ్యమైన అంశం.  దీని కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించగా, అవి పలు సిఫార్సులు చేశాయి. 1955 సెప్టెంబర్‌ 30‌న  ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల పునర్‌ ‌విభజన కమిటీల గురించి పూర్వా పరాల గురించి తెలిపే ప్రయత్నం.

ఖాన్‌ ‌బహదూర్‌ ‌సయ్యద్‌ ‌సర్‌ ‌ఫజల్‌ అలీ  (19 సెప్టెంబర్‌ 1886 – 22 ఆగస్టు 1959)… 15 అక్టోబర్‌ 1951‌నుండి 30 మే 1952 సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా,  1952 నుండి 1956 వరకు ఒడిశా గవర్నర్‌గా మరియు 1956 నుండి 1959 వరకు అస్సాం గవర్నర్‌గా ఉన్నారు. భారతదేశ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి సిఫార్సులు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌కు ఫజల్‌ అలీ నాయకత్వం వహించారు.

బ్రిటీష్‌ ‌సామ్రాజ్యం నుంచి 1947లో స్వాతంత్య్రం పొందాకా భారతదేశం  వేర్వేరు కేటగిరీలుగా విభజించి వుంది. అవి ఇలా ఉన్నాయి.(1).పార్ట్ ఎ ‌రాష్ట్రాలు (పాత బ్రిటీష్‌ ఇం‌డియా ప్రావిన్సులు)…9 రాష్ట్రాలు: అస్సాం, బీహార్‌, ‌బొంబాయి, తూర్పు పంజాబ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మద్రాస్‌, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ (2).‌పార్ట్ ‌బి రాష్ట్రాలు (గత సంస్థానాలు లేదా ఒప్పంద రాష్ట్రాల సమూహాలు)…9 రాష్ట్రాలు: హైదరాబాద్‌, ‌జమ్ము అండ్‌ ‌కాశ్మీర్‌, ‌మధ్యభారత్‌, ‌మైసూర్‌, ‌పాటియాలా, తూర్పు పంజాబ్‌, ‌రాష్ట్రాల యూనియన్‌ (‌పిఈపిఎస్‌యు), రాజస్థాన్‌, ‌సౌరాష్ట్ర, ట్రావె న్కోర్‌-‌కొచ్చిన్‌, ‌వింధ్య ప్రదేశ్‌(3).‌పార్ట్ ‌సి రాష్ట్రాలు (గత సంస్థానాలు లేదా ప్రావిన్సులు)..10 రాష్ట్రాలు: అజ్మీర్‌, ‌కూర్గ్, ‌కూచ్‌ – ‌బీహార్‌, ‌భోపాల్‌, ‌బిలాస్‌ ‌పూర్‌, ‌ఢిల్లీ, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌కచ్‌, ‌మణిపూర్‌, ‌త్రిపుర(4).పార్ట్ ‌డి (కేంద్రపాలిత  ప్రాంతం)..అండమాన్‌ అం‌డ్‌ ‌నికోబార్‌ ‌దీవులు…..

ఇవన్నీ బ్రిటీష్‌ ‌వారి రాజకీయ, సైనిక, వ్యూ హాత్మక ప్రణాళికకు అనుకూలంగా ఏర్పడుతూ వచ్చాయి. స్వతంత్య్ర భారతంలో రాష్ట్రాల సరిహద్దులు పునర్వి భజనకు ఒక ప్రాతిపదిక కావాల్సి వచ్చింది. భాషల ప్రాతిపదికన పునర్విభజన జరగాలన్నది ప్రతిపాదనల్లో ఒకటి. 1920 నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ ‌ప్రావిన్సు లను భాష ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి కట్టుబడి వుంది.స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్విభజిస్తా మన్నది కాంగ్రెస్‌ ‌లక్ష్యాల్లో ఒకటి. ఇది 1945-46 ఎన్నికల మ్యాని ఫెస్టోలోని హామీల్లో కూడా చేరింది. విభజన సమయంలో మత వైషమ్యాలతో విపరీతమైన రక్తపాతం, హింస చోటు చేసు కోవడం వంటివి భారతదేశపు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, తొలి ఉపప్రధాని, గృహమంత్రి వల్లభ్‌ ‌భాయి పటేల్‌ ‌మొదలైన వారిలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుపై వైఖరిలో మార్పు తీసుకు వచ్చింది.

1948లో రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ ఎస్‌.‌కె.దార్‌ (అలహాబాద్‌ ‌హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి), జె.ఎన్‌.‌లాల్‌ (‌న్యాయవాది), పన్నాలాల్‌ (‌విశ్రాంత భారత సివిల్‌ ‌సర్వీసెస్‌ అధికారి)లతో దార్‌ ‌కమిషన్‌ ఏర్పాటు చేశారు. కమిషన్‌ ‌తన నివేదికను సమర్పిస్తూ పూర్తిగా కానీ, ప్రధానంగా కానీ భాషా ప్రాతి పదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం దేశ విస్తృత ప్రయోజ నాలకు అనుగుణమైనది కాదన్నారు. దార్‌ ‌కమిషన్‌ ‌సూచనలను అధ్యయనం చేయ డానికి జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌, ‌పట్టాభి సీతారామయ్యలతో జేవీపీ కమిటీ వేశారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటుకు ప్రస్తుతం సరైన సమయం కాదనీ, ఆ కమిటీ తేల్చి చెప్పింది.డా. అంబేద్కర్‌ ‌ధార్‌ ‌కమిషన్‌కు ఒక మెమోరాండం సమర్పించారు (తేదీ 14 అక్టోబర్‌ 1948), ‌భాషా ప్రావిన్సుల ఏర్పాటుకు మద్దతుగా, ప్రత్యేకంగా మరాఠీ -మహారాష్ట్ర మహారాష్ట్ర రాష్ట్రం బొంబాయి రాజధానిగా ఏర్పడింది.

1952 నాటికి, మద్రాస్‌ ‌రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగు-మెజారిటీ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ ‌చాలా శక్తిమంతంగా మారింది. తెలుగు మెజారిటీ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ ‌చేస్తున్న కార్యకర్తలలో ఒకరైన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 16 డిసెంబర్‌ 1952 ‌న మరణించారు.రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్సార్సీ) లేదా ఫజల్‌ అలీ కమిషన్‌ ‌డిసెంబర్‌ 29, 1953‌లో భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులను పున: సమీక్షిం చడంలో సలహా ఇచ్చేందుకు ఏర్పరిచింది. కమీషన్‌ ‌లో ఫజల్‌ అలీ, కె.ఎం.పణిక్కర్‌, ‌హెచ్‌.ఎం.‌కుంజ్రూలు ఉన్నారు.తెలుగు-మెజారిటీ ఆంధ్ర రాష్ట్రం 1953 లో ఏర్పడింది. ఇది దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించింది, భాషా సంఘాలు ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్‌ ‌చేశాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ ‌నివేదిక ప్రభుత్వం 30-సెప్టెంబర్‌ -1955 ‌మధ్యాహ్నం అందుకుంది.

ఈ కమిషన్‌ ‌తన నివేదికలో….మూడు అంచెల (పార్ట్-ఎ/‌బి/సి) రాష్ట్ర వ్యవస్థను రద్దు చేయాలని, రాజప్ర ముఖ సంస్థ మరియు పూర్వ సంస్థానాలతో ప్రత్యేక ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఆర్టికల్‌ 371 ‌ద్వారా భారత ప్రభుత్వంలో ఉన్న సాధారణ నియంత్రణను రద్దు చేయాలని, అండమాన్‌ ‌నికోబార్‌, ‌ఢిల్లీ మరియు మణిపూర్‌ 3 ‌రాష్ట్రాలు మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండాలని,  ఇతర పార్ట్-‌సి/డి భూభాగాలను పక్క రాష్ట్రాలతో విలీనం చేయాలని నివేదించింది. ఈ నివేదిక 14 డిసెంబర్‌ 1955 ‌న లోక్‌ ‌సభలో పెట్టబడింది.
కమిషన్‌ ‌చేసిన సలహాల్లో కొన్నిటిని కేంద్ర ప్రభుత్వం 1956 నాటి రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1956లో పరిగణనలోకి తీసుకుంది.
దీనికి అనుగుణంగా 1956లో పార్లమెంట్‌ ‌రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ చట్టం, ఏడో రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా పార్ట్ -ఎ,‌పార్ట్ -‌బి, పార్ట్-‌సి అనే వ్యత్యాసాలను రద్దు చేసి రాష్ట్రాలను పునర్‌ ‌వ్యవస్థీ కరించింది. ఫలితంగా 14 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలతో నూతన వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్‌గా రాష్ట్రాన్ని పునర్‌ ‌వ్యవస్థీక రిం చారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణతో కలిపి 1956 నవంబర్‌ 1‌న ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది.1956 తర్వాత…గుజరాత్‌ (1 ‌మే, 1960) 15వ రాష్ట్రంగా,  నాగాలాండ్‌ (1 ‌డిసెంబర్‌, 1963) 16‌వ రాష్ట్రంగా ఏర్పాటైంది. హర్యానా(1 నవంబర్‌, 1966)17‌వ రాష్ట్రంగా,  18వ రాష్ట్రంగా,  మణిపూర్‌ (21 ‌జనవరి, 1972) 19వ రాష్ట్రంగా, త్రిపుర (21 జనవరి, 1972) 20వ రాష్ట్రంగా, మేఘాలయ (21 జనవరి, 1972) రాష్ట్రంగా, సిక్కిం(16 మే, 1975) 22వ రాష్ట్రంగా, మిజోరాం (20 ఫిబ్రవరి, 1987) 23వ రాష్ట్రంగా,  అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ (20 ‌ఫిబ్రవరి, 1987)24వ రాష్ట్రంగా, గోవా (30 మే, 1987) 25వ, ఛత్తీస్‌గఢ్‌(1 ‌నవంబర్‌, 2000) 26‌వ రాష్ట్రంగా, ఉత్తరాఖండ్‌ (9 ‌నవంబర్‌, 2000) 27‌వ రాష్ట్రంగా, ••తీ•ష్ట్ర•అ•   (15 నవంబర్‌, 2000) 28‌వ రాష్ట్రంగా •••తీ•ష్ట్ర•అ•ను ఏర్పాటు చేశారు.

తెలంగాణ (2 జూన్‌, 2014): ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని పునర్‌ ‌వ్యవస్థీకరించి 29వ రాష్ట్రంగా 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టికల్‌ 370 ‌రద్దుతో జమ్మూ కాశ్మీర్‌ ‌రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది.  భారత దేశంలో ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
 – రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Comments (0)
Add Comment