ఎవరి ప్రయోజనాల కోసమో!…

“మొదట ప్రకటించిన వైరస్‌ ‌లక్షణాలు కేవలం నాలుగు. అవి పొడి దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఈ లక్షణాల జాబితాలోకి ఒక్కొక్కటిగా చేరుస్తూ సాధారణ అనారోగ్య లక్షణాలన్నింటినీ వైరస్‌ ‌లక్షణాలుగా  మార్చేశారు.. ఇవాళ తలనొప్పి, ఒళ్లునొప్పులు, కళ్ళుతిరగడం, నీరసం, రుచి వాసన గుర్తించలేకపోవడం, వాంతులు, విరేచనాలు, ఛాతినొప్పి వంటివన్నీ కరోన లక్షణాలుగా ముందుకు తెచ్చారంటే ప్రజలు ఏ చిన్న అనారోగ్య సమస్యనైనా కరోన గానే అనుమానించి హాస్పిటల్స్ ‌కి వెళ్లాల్సిన పరిస్థితి సృష్టించబడింది. 1000 ల మందులతో నయమయ్యే వ్యాధిని, 5 లక్షల రూపాయలకు పెంచేసింది కార్పొరేట్‌ ‌వైద్యం.. పదుల సంఖ్యలో బాధితులు వున్నప్పుడు  ప్రజా వైద్యంను అందించిన ప్రభుత్వాలు , వేలల్లో లక్షల్లో ప్రజలు బాధితులుగా మారే క్రమంలో చేతులెత్తేసి, కార్పొరేట్‌ ‌దోపిడీకి మార్గం సుగమం చేశాయి.. సంపన్నులకు కార్పొరేట్‌ ‌వైద్యం, లేని వాడికి అరకొర వసతుల మధ్య ఉన్న ప్రభుత్వ వైద్యం అందిస్తూ, సామాన్యుడికి అందనంత ఎత్తులో కరోన వైద్యాన్ని ఇప్పటికే నిలబెట్టారు.. మరొక వైపు కరోన మందు, వాక్సిన్‌ ‌ల పేరుతో ఫార్మా కంపెనీల పోటీ,మందులను బ్లాక్‌ ‌మార్కెట్టుకు తరలించే దందా కూడా అప్పుడే మొదలైంది..ఒక సర్వే ప్రకారం గతంలో సంవత్సరానికి దేశంలో 70 లక్షల లీటర్ల శానిటైజర్‌ ఉపయోగించగా , ప్రస్తుతం ఒక్క నెలలోనే అంతకు మించి వినియోగిస్తున్నారంటే ఒక్క శానిటైజర్‌ ‌వల్లే ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో ఊహించవచ్చు.”

వైరస్‌ ‌గురించి డబ్ల్యూహెచ్‌ఓ ‌గాని, వివిధ దేశాధినేతలు గానీ, వైద్య నిపుణులు గానీ మొదట నుంచి చేస్తున్న ప్రకటనలు, సూచనల్లో ఎన్నో వైరుధ్యాలు కనపడుతున్నాయి..అందులో మొదటిది వైరస్‌ ‌సోకిన 80% మందికి అది వారికి సోకిన విషయం తెలియకుండానే తగ్గిపోతుందని ప్రకటించారు. ఇది ఎంతో అసంబద్ధమైనది, సందేహాస్పదమైనది. 80% మందికి తమ శరీరం లోకి వచ్చి ఏ హాని చేయకుండా వెళ్లిన విషయం కూడా గుర్తించలేనప్పుడు ఆ వైరస్‌ ‌ను ప్రపంచ మహమ్మారి అనడం హాస్యాస్పదంగా ఉంది..ఇది జలుబు వైరస్‌ ‌యొక్క లక్షణం.అది కూడా వ్యాప్తిరేటు చాలా ఎక్కువ, రోగనిరోధక శక్తి ఎక్కువ గా ఉన్న వ్యక్తులలో ఈ వైరస్‌ ‌ప్రవేశించిన విషయం గానీ, తగ్గిపోయిన విషయం గానీ గుర్తించడం జరగదు.. తీవ్రమైన నిమోనియాగా మారితే తప్ప ప్రాణాంతకంకాదు..కుటుంబం లో ఒక్కరికీ జలుబు చేస్తే దాదాపుగా మిగతా సభ్యలందరికీ వ్యాపించడం మనందరికీ అనుభవం లో ఉన్న విషయమే..ఇప్పటికీ దీనికి పూర్తి స్థాయిలో ఔషధం లేదా వాక్సిన్‌ ‌లేకపోవడం, ఏ మందులు వాడకుండా ఉన్నప్పటికీ నిర్దిష్ట కాలం తరువాత దానంతట అదే తగ్గుముఖం పట్టడం వంటి పోలికలు చూసినప్పుడు జలుబును కూడా మహమ్మారిగా అయినా ప్రకటించాలి లేదా కొరోనను సాధారణ జలుబు గానో లేక నిమోనియా గానో గుర్తించాలి .

‘‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే వుంటారన్న’’ లెనిన్‌ ‌వాఖ్య కు కనిపించే దర్పణమే వర్తమానన కరోనా సంక్షోభం.దీనిపై ప్రజల కోణంలో కావల్సినంతగా పరిశీలనలు కాక పోవడం చాలా బాధాకరం.డబ్ల్యూహెచ్‌ఓ ‌ప్రకటించినట్లుగా , ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ప్రజలునమ్ముతున్నట్లుగా ఈ వైరస్‌ ‌నిజానికి అంత ప్రమాదకరమేనా!? ప్రచారంలో ఉన్నంత భయంకరమైనదేనా?మానవాళి ఉనికికే ఇది పెను సవాలు విసురుతుందా? ఇది నిజంగానే ప్రపంచ మహమ్మారా! దీని వెనుక ఏమైనా(మానవ)శక్తులు దాగి ఉన్నాయా.?ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవలసి ఉంది.. ఈ పనిని అభ్యుదయవాదులు,ప్రజా సమస్యల విశ్లేషకులు, పరిశీలకులు, మేధావులు మార్స్సిజం కోణంలో పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కొరోన వైరస్‌ ‌గురించి సృష్టించబడ్డ భయాలు, అబద్దాలు , అర్థ సత్యాలు, అపోహలలో కొట్టుకపోయామంటే పెట్టుబడిదారీ విధానం యొక్క లాభాపేక్షను, దోపిడీ కాంక్షను తక్కువగా అంచనా వేశామనే భావించాలి.. కొరోన వైరస్‌ ‌సహజమైనదా లేక సృష్టించబడ్డదా అనే చర్చ అప్రస్తుతం, దాని మూలంగా లేదా దాని పేరుతో సృష్టించబడ్డ భయాల (అతి తీవ్ర భయాలు) మీద అంతకంటే ఎక్కువ తీవ్రమైన చర్చలు, విశ్లేషణలు పెద్ద ఎత్తున లేవనెత్తాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో చూసినప్పుడు కొరోన వైరస్‌ ‌మూలంగా ఏర్పడ్డ భయాలు పెట్టుబడిదారీ విధానం యొక్క సృష్టి మాత్రమే. గతంలో ప్రజలకున్న అవసరాలను, కొన్నిసార్లు అవసరాలను సృష్టించి కూడా (అవసరం లేని వస్తవులను కూడా నిత్యావసర వస్తువులు గా మార్చడం) లాభాలను ఆర్జించడం దాని లక్షణం. ఇంకా ప్రజలలో వుండే సహజ భయాలను( ఉదా: నమ్మకాలు, విశ్వాసాలు, ప్రాణభయం మొ’’) ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడడం జరుగుతూన్నది..కానీ, ప్రస్తుతం భయాలను సృష్టించి , ఆ భయాలను లాభాలుగా మార్చుకునే, ప్రజల శ్రమను చట్టబద్ధంగాదోచుకునే మహదావకాశాన్ని పొందడానికి వాడుకున్న (సృష్టించబడిన) ఆయుధమే ఈ వైరస్‌..అం‌టే సహజ భయాలు తెచ్చే లాభాల కంటే కృత్రిమ భయాలు తెచ్చే లాభాలు అనేక రెట్లు ఎక్కువ మరియు తక్షణమైనవి..ఈ రోజు పెట్టిన పెట్టుబడి రేపటికల్లా, కుదిరితే ఈ రోజు సాయంత్రానికే లాభాలుగా, ఇంకా వీలైతే ముందే పెట్టుబడి మరియు లాభాలు కూడా సమకూరే (అడ్వాన్స్ ‌లు, ఆర్డర్లు ద్వారా) వ్యాపారం ఫార్మా రంగంలో జరుగుతున్న విషయాన్ని గమనించాలి.. కృత్రిమ భయాలు, తక్షణ లాభాలు అనేవి పెట్టుబడిదారీ విధానం యొక్క ఉచ్ఛ స్థితిగా పరిగణించాలి.

సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం యొక్కఅత్యున్నత దశ అనడం కంటే వేల రేట్లు ఎక్కువైన (గతం కంటే) తక్షణ సంపదను తెచ్చిపెడుతున్న ప్రస్తుత పరిస్థితినే అత్యున్నత దశగా మార్చుకోవాల్సి వస్తుంది.. కొరోన వైరస్‌ ‌పేరుతో సృష్టించబడ్డ భయాలు ఇప్పటికే ఆ పనిని పూర్తి చేయడంలో పెట్టుబడిదారుల బొక్కసాలు నింపడంలో నిమగ్నమయ్యాయి. మొట్టమొదట వైరస్‌ ‌ను గుర్తించగానే డబ్ల్యూహెచ్‌ఓ ‌చేసిన పని ప్రపంచ మహమ్మారి గా ప్రకటించడం. ఈ ప్రకటనకు ముందు ప్రపంచ దేశాలతో గానీ, వైద్యరంగంలో నిపుణులతో గానీ, జీవ శాస్త్రవేత్తలతో గానీ, వైరాలజిస్టులతో గానీ సంప్రదించకపోవడమే కాకుండా వైరస్‌పై ప్రాథమిక అధ్యయనం కూడా లేకుండా వ్యాప్తిరేటు,రికవరీ రేటు,వ్యాధి లక్షణాలు, మరణాల రేటు, వైద్య సంసిద్ధత, ఔషధ సంసిద్ధత వంటి ఏ ఒక్క విషయం మీద కూడా స్టడీ చేయకుండా కేవలం వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న ఒకే ఒక్క కారణాన్ని చూపి ఏకంగా ప్రపంచ మహమ్మారి గా ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.గతంలో వచ్చిన సార్స్ (9.6%), ‌హంట (22%), ఎబోలా (70% మరణాలు రేటు) , రొటా వంటి వైరస్‌ ‌లను మాత్రం చాలా తేలికగా తీసుకొని కేవలం 2 నుంచి 3% మరణాల రేటు (ఏ ఒక్క మరణం అయినా బాధకరమే కానీ వైద్య పరిభాషలో ఈ రేటు చాలా స్వల్పం)ఉన్న ఈ వైరస్‌ ‌ను మానవాళి ఉనికినే తుడిచి పెట్టేస్తుంది అన్నంత భయాన్ని వైరస్‌ ‌కంటే వేగంగా ఎక్కువగా వ్యాప్తి చేయడం వెనుక పనిచేసిన శక్తులేవో ప్రపంచానికి తెలియాల్సి ఉంది..అలాగే ప్రపంచంలో సంపన్న దేశాలు, అభివృద్ధి పథం లో ఉన్న దేశాలు అయిన అమెరికా, బ్రిటన్‌, ఇం‌డియా, బ్రెజిల్‌, ‌రష్యా, మెక్సికో, స్పెయిన్‌, ‌చిలీ, ఇరాన్‌, ‌దక్షిణాఫ్రికా లలో మాత్రమే వైరస్‌ ‌దానితో పాటు భయాలు తీవ్రంగా వ్యాపించడానికి గల కారణాలు కూడా ఆలోచించాలి.. పేద దేశాల్లోని ప్రజలు ఆరోగ్యం కోసం లక్షల్లో ధారబోయగల సామర్థ్యం లేకపోవడమే అనే వాదన కొట్టిపారేయాల్సింది ఏం కాదు.

నిజానికి ప్రతీ రోజూ వేర్వేరు వ్యాధులతో ఎంతోమంది మరణిస్తున్నారు.. క్యాన్సర్‌, ‌నిమోనియా వంటి ఇతర వ్యాధుల తో ప్రతీ రోజు జరిగే మరణాలు కరోన మరణాల కంటే ఎక్కువే.. కానీ అవేవి ప్రస్తుత మరణాల లాగా ఏ రోజుకారోజు ప్రకటించబడడం లేదు..ఇది గుర్తించాల్సిన విషయం.. అలాగే వైరస్‌ ‌వల్ల జరుగుతున్న మరణాల్లో 60% కంటే ఎక్కువ గుండె సంబంధిత కారణాలతో జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం భయాందోళనకు గురికావడమే.. మానసిక ఒత్తిడి, భయం అనేవి రోగనిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా హైపర్‌ ‌టెన్షన్‌, ‌గుండె నొప్పి, గుండె పనితీరు దెబ్బనడానికి కారణమవుతాయన్న విషయం తెలిసిందే..అంటే ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించినట్లైతే ప్రస్తుత మరణాలను సగానీకంటే ఎక్కువగా తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుత వైరస్‌ ‌సోకిందన్న భయం కంటే, దాని తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలు మరింత భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. భౌతిక దూరం స్థానంలో ప్రయోగించిన సామాజిక దూరం చాలా దూరం ముందుకెళ్లి సామాజిక వెలిగా మారింది పాలు, నీళ్లు, కూరగాయలకు కూడా ఇబ్బందులుఎదుర్కొంటున్న దుస్థితి దాపురించింది..సాధారణ వ్యాధులకు సైతం చికిత్స చేయడానికి వైద్య సిబ్బంది వెనుకడుగు వేయాల్సి రావడం , కళ్ళముందే ప్రాణం పోతున్నా, నదిరోడ్డు మీదే పడిపోయి చనిపోతున్నా స్పందించలేని అమానవీయత సృష్టిం చబడింది.. కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, మానవ సంబంధాలన్నీ మంట కలిసిన స్థితిలో ప్రపంచం దూసుకుపోతుంది..పెట్టుబడిదారీ విధానానికి కావాల్సిన మానవ సంబంధాల విచ్ఛిన్నతను కరోన వైరస్‌ ‌పేరుతో పరిపూర్ణం చేశారు.. వైరస్‌ ‌గురించి డబ్ల్యూహెచ్‌ఓ ‌గాని, వివిధ దేశాధినేతలు గానీ, వైద్య నిపుణులు గానీ మొదట నుంచి చేస్తున్న ప్రకటనలు, సూచనల్లో ఎన్నో వైరుధ్యాలు కనపడుతున్నాయి..అందులో మొదటిది వైరస్‌ ‌సోకిన 80% మందికి అది వారికి సోకిన విషయం తెలియకుండానే తగ్గిపోతుందని ప్రకటించారు. ఇది ఎంతో అసంబద్ధమైనది, సందేహాస్పదమైనది. 80% మందికి తమ శరీరం లోకి వచ్చి ఏ హాని చేయకుండా వెళ్లిన విషయం కూడా గుర్తించలేనప్పుడు ఆ వైరస్‌ ‌ను ప్రపంచ మహమ్మారి అనడం హాస్యాస్పదంగా ఉంది..ఇది జలుబు వైరస్‌ ‌యొక్క లక్షణం.అది కూడా వ్యాప్తిరేటు చాలా ఎక్కువ, రోగనిరోధక శక్తి ఎక్కువ గా ఉన్న వ్యక్తులలో ఈ వైరస్‌ ‌ప్రవేశించిన విషయం గానీ, తగ్గిపోయిన విషయం గానీ గుర్తించడం జరగదు.. తీవ్రమైన నిమోనియాగా మారితే తప్ప ప్రాణాంతకంకాదు..కుటుంబం లో ఒక్కరికీ జలుబు చేస్తే దాదాపుగా మిగతా సభ్యలందరికీ వ్యాపించడం మనందరికీ అనుభవం లో ఉన్న విషయమే..ఇప్పటికీ దీనికి పూర్తి స్థాయిలో ఔషధం లేదా వాక్సిన్‌ ‌లేకపోవడం, ఏ మందులు వాడకుండా ఉన్నప్పటికీ నిర్దిష్ట కాలం తరువాత దానంతట అదే తగ్గుముఖం పట్టడం వంటి పోలికలు చూసినప్పుడు జలుబును కూడా మహమ్మారిగా అయినా ప్రకటించాలి లేదా కొరోనను సాధారణ జలుబు గానో లేక నిమోనియా గానో గుర్తించాలి .కొరోన వైరస్‌ ‌సోకిన ఒక వ్యక్తికి వైద్యం అందించిన కొన్ని రోజుల తర్వాత అతని శరీరంలో వైరస్‌ ‌లేకుండా (నెగిటివ్‌) ‌పోతుంది.. దానర్థం సాధారణ భాషలో వైరస్‌ ‌చంపబడింది.. అంటే వైరస్‌ ‌మీద వైద్యం కోసం వినియోగించబడ్డ మందులు పనిచేసినట్లే. అయినప్పడు వైరస్‌ ‌కు మందు లేదని చెప్పడం సందేహం కలిగిస్తుంది.. ఒకవేళ మందు లేదనేది నిజం అయితే ఏ మందులు ఇవ్వక పోయినా నిర్దిష్ట కాలం తర్వాత నెగిటివ్‌ ‌గా వచ్చే అవకాశం ఉందనే కదా అర్థం. ఇదొక ముఖ్యమైన వైరుధ్యం.


కరెన్సీ నోట్ల చెలామణి ద్వారా వైరస్‌ ‌వ్యాపిస్తుంది కానీ, వార్తా పత్రికల ద్వారా వ్యాపించదు అని ప్రకటించారు.ఇది మరొక వైరుధ్యం.. దీని వెనుక గల వ్యాపార కోణం కూడా అర్థం చేసుకోవచ్చు.కరెన్సీ నోట్లను నియంత్రించడంద్వారా పెట్టుబడిదారులకు అనుకూలమైన డిజిటల్‌ ‌కరెన్సీ వినియోగం పెంచుకోవడం ఈ వైరుధ్యం వెనుక దాగిన ప్రయోజనం అయి ఉండవచ్చు.. అదే సమయంలో వార్తా పత్రికలు నియంత్రణ వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనం లేకపోగా తాము సృష్టించిన భయాలు , ఆందోళనలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి చేరాలంటే పత్రికల అవసరం ఎంతైనా ఉందనేది వారి అభిప్రాయం.. అలాగే వైరస్‌ ‌సోకిన వ్యక్తి లాలాజలం ద్వారా అంటే దగ్గడం, తుమ్మడం, చీదడం ద్వారా విడుదల అయ్యే తుంపర్లు బయటి వస్తువుల మీద అతుక్కుని వేరొక వ్యక్తి వాటిని తాకడం ద్వారా శరీరం లోకి ప్రవేశించడం జరుగుతుందని ప్రకటించి , ప్రస్తుతం గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ప్రకటిస్తున్నారుఇది మరొక వైరుధ్యం.. గాలి ద్వారా వ్యాప్తి అంటే ఒక వ్యక్తి శ్వాసక్రియలో జరిగే exhalation ( ముక్కు ద్వారా విడుదల అయిన గాలి)ను పీల్చిన వారికి కూడా సోకుతుందనేది దీని సారాంశం. ఇదే కనుక నిజమైతే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 90% మందికి సోకి ఉండాల్సింది..ప్రజల్లో వైరస్‌ ‌పట్ల భయం తగ్గుతుందన్నప్పుడల్లా దానిని పెంచే ఉత్ప్రేరకాలుగానే ఈ పరస్పర వైరుధ్య, హాస్యాస్పదమైన ప్రకటనలు విడుదలవుతున్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఇంకా మొదట ప్రకటించిన వైరస్‌ ‌లక్షణాలు కేవలం నాలుగు. అవి పొడి దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఈ లక్షణాల జాబితాలోకి ఒక్కొక్కటిగా చేరుస్తూ సాధారణ అనారోగ్య లక్షణాలన్నింటినీ వైరస్‌ ‌లక్షణాలుగా మార్చేశారు.. ఇవాళ తలనొప్పి, ఒళ్లునొప్పులు, కళ్ళుతిరగడం, నీరసం, రుచి వాసన గుర్తించలేకపోవడం, వాంతులు, విరేచనాలు, ఛాతినొప్పి వంటివన్నీ కరోన లక్షణాలుగా ముందుకు తెచ్చారంటే ప్రజలు ఏ చిన్న అనారోగ్య సమస్యనైనా కరోన గానే అనుమానించి హాస్పిటల్స్ ‌కి వెళ్లాల్సిన పరిస్థితి సృష్టించబడింది.

జలుబు చేసినప్పుడు వాసన గ్రహణశక్తి, జ్వరం వచ్చినప్పుడు రుచిని గ్రహించే శక్తిని కోల్పోవడం పోషకాహారం లోపం వల్ల నీరసం సర్వ సాధారణం అనే వాస్తవాన్ని కూడా ఆలోచించలేని భయానక స్థితిలోకి మనుషులందరూ కూరుకపోయారు..ఎంతగా అంటే భూమి మీద పుట్టిన ప్రతీ మనిషి, జ్ఞానం తెలిసిన పసిపిల్లలతో సహా, నాగరిక సమాజానికి సుదూరంగా కొండ ప్రాంతాల్లో జీవించే ఆదివాసుల తో సహా కరోన పేరును ఉచ్చారణ చేసిన వాళ్లే. ప్రపంచ వ్యాప్తంగా ఇంత వేగంగా, సూటిగా ఖచ్చితంగా ప్రజల్లోకి వైరస్‌ ‌భయాన్ని చొప్పించడానికీ ఉపయోగించిన ఆయుధమే లాక్‌ ‌డౌన్‌.. ‌లాభాల వేటలో సృష్టించబడ్డ భయాలు వ్యాపారాలుగా మారి తక్షణ లాభాలను ఆర్జించడంలో బహుళజాతి కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కార్పొరేట్‌ ‌వైద్య రంగం, రసాయన పరిశ్రమలు పోటి పడుతూ శరవేగంగా దూసుకుపోతున్నాయి..గతంలో దేశాల మధ్య లాభాలవేటలో సాగిన ఆయుధ పోటీ స్థానంలో ఇప్పుడు ఔషధాలు వచ్చి చేరాయి.. ? 1000 ల మందులతో నయమయ్యే వ్యాధిని, 5 లక్షల రూపాయలకు పెంచేసింది కార్పొరేట్‌ ‌వైద్యం.. పదుల సంఖ్యలో బాధితులు వున్నప్పుడు ప్రజా వైద్యంను అందించిన ప్రభుత్వాలు , వేలల్లో లక్షల్లో ప్రజలు బాధితులుగా మారే క్రమంలో చేతులెత్తేసి, కార్పొరేట్‌ ‌దోపిడీకి మార్గం సుగమం చేశాయి.. సంపన్నులకు కార్పొరేట్‌ ‌వైద్యం, లేని వాడికి అరకొర వసతుల మధ్య ఉన్న ప్రభుత్వ వైద్యం అందిస్తూ, సామాన్యుడికి అందనంత ఎత్తులో కరోన వైద్యాన్ని ఇప్పటికే నిలబెట్టారు.. మరొక వైపు కరోన మందు, వాక్సిన్‌ ‌ల పేరుతో ఫార్మా కంపెనీల పోటీ,మందులను బ్లాక్‌ ‌మార్కెట్టుకు తరలించే దందా కూడా అప్పుడే మొదలైంది..ఒక సర్వే ప్రకారం గతంలో సంవత్సరానికి దేశంలో 70 లక్షల లీటర్ల శానిటైజర్‌ ఉపయోగించగా , ప్రస్తుతం ఒక్క నెలలోనే అంతకు మించి వినియోగిస్తున్నారంటే ఒక్క శానిటైజర్‌ ‌వల్లే ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో ఊహించవచ్చు.గతంలో కంటే అనేక రెట్లు వినియోగం పెరిగిన సబ్బులు, హాండ్‌ ‌వాష్‌ ‌లు, మాస్కులు , మందుల వల్ల జరుగుతున్న వ్యాపారం దీనికి అదనం..రాబోయే కొద్దిరోజుల్లోనే కరోన షాపింగ్‌ ‌మాల్స్ ‌రూపొంది ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చడం కూడా జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా కరోన పేరుతో విద్యా రంగంలో డిజిటల్‌, ఆన్లైన్‌ ‌తరగతుల నిర్వహణ పేరుతో మొబైల్‌ ‌ఫోన్ల పరిశ్రమలు, టెలికాం కంపెనీలు లాభాలు పొందే ప్రయత్నాలు ముమ్మరం చేయడం, దీనికి ప్రభుత్వాలు సహకరించడం మూలంగా ప్రభుత్వ. విద్యారంగ వినాశానానికి బాటలు పరుస్తున్నారు ఇప్పటి కైనా వైరస్‌ ‌పట్ల ప్రజల్లోకి చేర్చబడ్డ అనవసర భయాలను పోగేట్టేలా ప్రభుత్వాలు, మీడియా, రచయితలు, మేధావులు,విశ్లేషకులు కృషి చేయాల్సిన అవసరంఎంతైనా ఉంది.
– చుంచు శ్రీశైలం, ఉపాధ్యాయులు, TJAC జిల్లా చైర్మన్‌, TPTF జిల్లా కౌన్సెలర్‌, ‌మహబూబాబాద్‌ ‌జిల్లా,shailushailubashi @gmail.com

వాక్సిన్‌కి డిమాండ్‌ ఉం‌టుందా…?
హెర్డ్ ఇమ్మ్యూనిటి వచ్చే లోపల వాక్సిన్‌ అమ్మేసుకోవాలి ఇది వాక్సిన్‌ ‌సంస్థల తాపత్రయం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా కోవిడ్‌ 19 ‌వాక్సిన్‌ ‌తయారు చేసే పనిలో నిమగ్నమయిన 150కి పైగా సంస్థలకు కొత్త సమస్య వచ్చిపడ్డది. వీటిలో ఒక 15 సంస్థలు బాగా ముందంజలో ఉన్నాయి. కానీ ఈ సంస్థల కన్నా కొరోన వైరస్‌ ‌చాలా స్పీడ్‌ ‌గా ఉంది. ఇప్పటికే అనేకమందికి సోకి వారిలో రోగ నిరోధక వ్యవస్థని ఉత్తేజితం చేసింది. వారిలో antibodies సెల్స్ ఉత్పత్తి అయ్యేలా చేసింది. వాక్సిన్‌ ‌చేయాల్సిన పని వైరస్‌ ‌చేసేస్తోంది. దీనిని సహజ రోగ నిరోధకత అంటారు. వాక్సిన్‌ ఇచ్చినపుడు కూడా జరిగేది ఇదే. మరి రెండింటికి తేడా ఏమిటంటే సహజ రోగనిరోధకత ప్రక్రియలో మనిషిలో కొంత నష్టం జరుగుతుంది. కృత్రిమ రోగ నిరోధకత (వాక్సిన్‌) ‌లో అటువంటి నష్టం ఉండదు. రెండిటి గమ్యం ఒకటే, ఫలితం ఒక్కటే. నిజం చెప్పాలంటే కృత్రిమ రోగ నిరోధకత కంటే సహజ రోగ నిరోధకత ఎక్కువకాలం ఉంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎక్కడ వైరస్‌ ‌వ్యాప్తి బాగా ఉందొ అక్కడ ఇప్పటికే 25% మందిలో రోగ నిరోధకత ఉంది. కొందరిలో antibodies సంఖ్య తగ్గిపోయినా రోగనిరోధకత ఉంది. అంటే మెమరీ సెల్స్ ఉత్పత్తి అయిందన్నమాట. ఇంకొంత మందిలో అంతర్గత రోగ నిరోధకత ఉంది. మరికొంత మందిలో త్వరలో వచ్చేస్తుంది.ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ వైరస్‌ ఇన్ఫెక్టీన్‌ ‌వేగం ఎక్కువ. ఇంత త్వరగా ఏ వైరస్‌ ‌వ్యాప్తి చెందలేదు గతంలో వాక్సిన్‌ ‌protocols అన్ని పాటిస్తే వచ్చే మార్చి వరకు కూడా విడుదల కావు. కానీ వైరస్‌ ‌వ్యాప్తి ఇలాగే కొనసాగితే డిసెంబర్‌ ‌వరకు ప్రపంచ వ్యాప్తంగా అందరికి హెర్డ్ ఇమ్మ్యూనిటి వస్తుంది. ఇక వాక్సిన్‌తో పనే ఉండదు. అందుకే, అన్నిprotocols ప్రక్కకి పెట్టి vaccineవలను వివిధ దేశాలు ముందుకు తెస్తున్నాయి. లేదంటే పెట్టిన పెట్టుబడి ఖలాస్‌.‌మరి ఇలా హడావుడిగా వాక్సిన్‌ ‌తెస్తే ఆరోగ్య సమస్యలు ఉండవా!ఉండకపోవచ్చు, ఇది ఒక మాములు వైరస్‌. 10‌వేల మందిలో ఒక్కరికి ప్రమాదకర వైరస్‌. ‌వాక్సిన్‌ ‌తయారు చేసేపుడు దీనిలో ఉండే ప్రమాదకర లక్షణాలు తొలిగిస్తున్నారు అందువల్ల భారీ ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. ఇది మామూలు వైరస్‌ ‌కాబట్టే ఇంత త్వరగా, ఇన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎయిడ్స్ ‌లాంటి వాటికి ఇప్పటికి వాక్సిన్‌ ఇస్తామని ఏ సంస్థ గట్టిగా చెప్పడం లేదు. డిసెంబర్‌ ‌తరువాత వస్తే వాక్సిన్‌ ‌కు పెద్దగా డిమాండ్‌ ఉం‌డకపోవచ్చు…అందుకే ఈ హడావుడి వడ్డన.. చూద్దాం….
డా. ఎ వేణుగోపాల్‌ ‌రెడ్డి, మైక్రోబయాలజిస్ట్, 9948106198

shailushailubashiTJAC జిల్లా చైర్మన్‌TPTF జిల్లా కౌన్సెలర్‌‌మహబూబాబాద్‌ ‌జిల్లా
Comments (0)
Add Comment