‘‘‌దేని కోసం’’!?..

కొత్త సచివాలయం  కట్టేందుకు ఐదువందల కోట్లయితయని అప్పుడెప్పుడో లెక్కలేషిండ్లు.ఆమ్దాని లేకనే అప్పులెక్కువైనయి. కరోనాదెబ్బకు వున్న గాసం ఊడ్సుక పాయె!ఆర్బీ ఐ బ్యాంకోళ్ళ తాన కొత్త అప్పు జేషె! కరోనా తిప్పలెక్కువై  ఉద్దోగులకు,పింఛనోళ్ళకు సుత సగం జీతాలచ్చె!ఆరేండ్ల సంది కొత్త నౌకర్లిచ్చిందే లేదు.నౌకరోళ్ళకు జీతాలు పెంచే పి.ఆర్సీ లేదు. డి.ఏ.లను ఎగ్గొట్టె! వేలల్ల రైతు బందులు,కళ్యాణలక్ష్మీ బాకీలున్నయి.ఇసొంటి కరోనా కాలంల ఉన్నట్టుండి ‘‘తెలంగాణ ధనిక రాజ్జెం!అని ప్రకటించి అందర్నిఆగం జేత్తిరి.అప్పుడే జనం ధిమాక్ల లైటెలిగింది.దాని వెలుతురు ఇప్పుడు కానత్తాంది. మూడు లక్షల కోట్ల అప్పున్నదని అధికారిక లెక్కలే జెప్పబట్టె! గీ ఆర్ధికానికి కటకటుండే కాలంల ఐదొందల కోట్లుదాటే కొత్తసచివాలయం ఎందుకని అడిగేటి తెలంగాణ జనానికి జవాబెవలియ్యాలె!

 

రాజ్జెంల దినాం పెరుగబట్టిన కరోనా సావుల లెక్కలిడిషి, సచివాలయం జప్పున  కట్టుడెట్లనేది తెలంగాణ సర్కార్‌ ‌తండ్లాట.కరోనాకు జిక్కకుంట బతుకుడెట్లనేది తెలంగాణ జనం తండ్లాట!?కొట్లాడితెచ్చుకున్న రాజ్జెంల జనం తండ్లాటనే సర్కార్‌ ‌తండ్లాట కావాలె గద!గట్లెందుకైత లేదనేది అందరి ముందున్న అసలు తండ్లాట!లచ్చల కోట్ల అప్పులతోని ‘‘అభివృద్ది’’ పేరిట రాజ్జెం ఆగమైతాంటె సచివాలయం కట్టేందుకు ‘‘ధనిక రాజ్జెం’’ పడేటి తాకట్ల తండ్లాట సంగతేందో జనానికి సమజ్‌ ‌గాకుంటుంటదా!?
         కరోనాకు జిక్కకుంట బతుకుడెట్లని జనం తిప్పలైతె,జనాలకు జిక్కకుంట సచివాలయం కూల్సుడెట్లనేది సర్కార్‌ ‌తిప్పలైతాంది.దొంగరాత్రి కూల్షేపని మొదలేషిన సర్కార్‌ ‌వేలమంది పోలీసుల సుట్టు కావలి బెట్టింది.పోలీసు పెద్దసారు,ముఖె? కార్యదర్శి సారు నిలబడి కూలగొట్టిచ్చుడే జూషెటోళ్ళను,ఇనెటోళ్ళను పరెషాన్‌ ‌జేయబట్టె!
అందరనుకునేటి కొత్త సచివాలయం కట్టుడేనా! దానెనుకేమన్న మతలబున్నదా!? అందుకే గిట్ల బందోబస్తు మద్దెన తవ్వుతాండ్లా!అన్న అడ్డగోలు అనుమానం మోపయితాంది.ఇక్కడ పోలీసోల్లేసర్కారైనంక, సర్కార్‌ ‌పని జేత్తలేదంటె తప్పుల బడ్తరు!
వాస్తు బాగలేదని పని మొదలుకు ముందు జేసిన యాగాలు, పూజలాసొంటి  విశ్వాసాలు జేషేటి పనికి అడ్డుగున్న గుడి,మసీదులు గిట్ల కూల గొట్టే కాడ లెక్కకు రాక పోవచ్చు!
కూలిపోయినయి మళ్ళ కట్టిస్తమనే హామీ తోని జరంత సల్లబడచ్చేమో గని  రాజకీయాల జోరైతె తామరతంపరోలిగె సాగుతది.అదే గనుక కూలగొట్టె శిధిలాల ఫోటోలు బయటికి కానత్తె జనంగుండెలు కెలుక్కుమన్నయని,విశ్వాసాలు  దెబ్బతిన్నయని విపక్షం మోకాలడ్డం బెట్టేటి తిప్పలుంటది.తవ్వకాల ఫోట్వోలు సుత తీయనీయకుంట సుట్టుపట్లున్న ల బంగ్లాల మీద పోలీసుల కావలుంచుడు లచ్చల అనుమానాలకు ముగ్గు బోత్తాంది గదా! ప్రజల ఆస్తి తవ్వకాలను ప్రజలు జూసుడు తప్పెట్లయితది!? అన్నింటి సంగతేందో గని నిజాం కాలం నాటి ‘‘జి’’బ్లాక్‌ ‌చారిత్రక వారసత్వం భవనం తవ్వకాలన్న ప్రజలకు లైవ్‌ ‌ల జూపాలని జనం కోరుకుంటె తప్పేంది!?
సర్కార్‌ ‌విధాన నిర్ణయాలల్ల ఏలు బెట్టనీకి లేదని కోర్టు దాని పరిధిని కుల్లంకుల్ల జెప్పుకున్నది.గట్లయితె సచివాలయం కూల్చివేతల మీద ఏడాది కిందటేశిన దావాను యేం జెప్పకుంట ఎందుకు దగ్గరుంచుకున్నది? ఇప్పుడేం సందయిందని నోరిప్పింది! కరోనా కాలంల చారిత్రక వారసత్వ సంపదను కూలగొట్టేందుకు అనుమతులిచ్చుడు యెట్ల అర్ధం జేసుకోవాలె!?
ఇసొంటి జవాబు దొరుకని ప్రశ్నలు అడుగుతె తలమాషినోళ్ళయితరు!సర్కార్‌ ‌విధాన నిర్ణయాలను సమీక్షించి,ప్రజలకు నష్టం కలిగించేటియని భావించినప్పుడు వాటిని ఆపకుంటె న్యాయ వ్యవస్థ పనితీరు ప్రజాస్వామ్యంల ప్రశ్నార్ధకమైతది కదా?అనేటి అనుమానాలు గిట్ల మోపయినోళ్ళు తెలంగాణ ఉద్దెమ ద్రోహులయితరు.అసలు నిలేషి నిలదీషి అడిగేటి ఉత్తములే మొక్కుబడిగ మైకులందుకోని పేపర్ల వార్తలై సల్లబడుతాండ్లు. పతిపక్షాలు,విపక్షాలు ఆరేండ్ల సంది నోటికి మాస్కులు కట్టుకునే వుండబట్టె!జనం తరుపున సర్కారును నిలేషేటి బాధ్యతలు మరిషిండ్లని మళ్ళోపాలి కాన్రాబట్టె!
సర్కార్‌  ‌లౌకికత ప్రమాణంగ పని జేత్తది గదా!గీ వాస్తు, యజ్ఞాలు,యాగాలు,పూజలు జేసుడేంది!’’సచివాలయం’’అనేది మొత్తం తెలంగాణ సమాజానికి చెందిన వారసత్వపు ఆస్తి.ఎన్నో సర్కార్లు వచ్చిపొయినయి.వాస్తు అనేది వ్యక్తి నమ్మకమే గని సర్కార్‌ ‌తీర్మానం కాదు గదా!గీ సర్కార్‌‘‌వాస్తు నమ్మకాని’కి కోర్టు తీర్పిచ్చుడేంది?దాన్ని బట్టుకోని సర్కార్‌ ‌దొంగరాత్రి  కూల్చుడేందనే ప్రశ్న కు జవాబు దొరుకుతలేదు.కూల్చేదాంక సరేగని కూల్చినంక అది మాట తప్పి దుబాయ్‌ ‌కార్పొరేట్‌ ‌దోస్త్ ‌షాపింగ్‌ ‌మాల్‌ ‌పాలై తదా!? మాట ప్రకారం సచివాలయం కడ్తరా!? అనేటి అనుమానం జనంల మోపయితె తప్పేందుల్లా!
కొత్త సచివాలయం  కట్టేందుకు ఐదువందల కోట్లయితయని అప్పుడెప్పుడో లెక్కలేషిండ్లు.ఆమ్దాని లేకనే అప్పులెక్కువైనయి. కరోనాదెబ్బకు వున్న గాసం ఊడ్సుక పాయె!ఆర్బీ ఐ బ్యాంకోళ్ళ తాన కొత్త అప్పు జేషె! కరోనా తిప్పలెక్కువై ఉద్దోగులకు,పింఛనోళ్ళకు సుత సగం జీతాలచ్చె!ఆరేండ్ల సంది కొత్త నౌకర్లిచ్చిందే లేదు.నౌకరోళ్ళకు జీతాలు పెంచే పి.ఆర్సీ లేదు. డి.ఏ.లను ఎగ్గొట్టె! వేలల్ల రైతు బందులు,కళ్యాణలక్ష్మీ బాకీలున్నయి.ఇసొంటి కరోనా కాలంల ఉన్నట్టుండి ‘‘తెలంగాణ ధనిక రాజ్జెం!అని ప్రకటించి అందర్నిఆగం జేత్తిరి.అప్పుడే జనం ధిమాక్ల లైటెలిగింది.దాని వెలుతురు ఇప్పుడు కానత్తాంది. మూడు లక్షల కోట్ల అప్పున్నదని అధికారిక లెక్కలే జెప్పబట్టె! గీ ఆర్ధికానికి కటకటుండే కాలంల ఐదొందల కోట్లుదాటే కొత్తసచివాలయం ఎందుకని అడిగేటి తెలంగాణ జనానికి జవాబెవలియ్యాలె!
పోనీ రాజ్జెం సుకంగున్నదా! అంటె అట్లసుత లేదు. కరోనచ్చి రాజ్జెం ఆగమాగం గున్నది. మన తాన టెస్టింగ్‌ ‌లు లచ్చ ముప్పావు సుత దాటలేదనేలెక్క  తెలిషిందే!సర్కార్‌ ‌దావకాన్లల్ల సౌలతులు సాలుత లేవని అందరనబట్టె! గచ్చిబౌలి ల కొత్త దావకాన పెద్దధికారులత్తె సూపెట్టే ‘‘నుమాషి’’ తీరుంగనే వుండె! కరోనా కేసులు వేలల్ల పెరుగబట్టినయి.సర్కార్‌ ‌దావకానల మంచాలు సాలక పాయె!పి.పి.టి.కిట్లు సాలుతలేవని వైద్దెం జేషేటోళ్ళనబట్టె! సర్కార్‌ ‌దావకాన్ల బోతె పీనుగ సుత దొరుకదాయె! ప్రయివేట్‌ ‌దావకాన్ల లచ్చలు గుంజితె తప్ప పీనుగ నిత్తలేరాయె!ఢిల్లీల ఆమాద్మి ముఖె?మంత్రి సారు కాలేజీలు,పెద్దపెద్ద స్టార్‌ ‌హోటల్లు కరోనా దావకాన్లుగ మార్చి అక్కడి జనాలకు పెద్ద  దేవుడైండు.మనతాన సచివాలయం కూలగొట్టకుంట కరోనా దావకాన జేషి మీరు సుత దేవుడైతె మస్తుండని అందరనబట్టె!
ఎవలి తండ్లాట వాళ్ళకున్నట్టే,సర్కార్‌ ‌తండ్లాట సర్కార్‌ ‌కున్నది గావచ్చు! రాజ్జెం కరోనా కు అప్పజెప్పి,సర్కార్‌ ‌సాటుమాటు యవారాలు జేసుడైతె తప్పని జనం బరాబరి నిలేషి అడుగబట్టె!పాత సచివాలయం కూలగొట్టె యవారమెనుక కతాకమామీషు యేందో లైవ్‌ ‌లజూపాలని జనం అడుగుడుకు సర్కారన్న జవాబియ్యాలె!సర్కార్‌ ‌మనుసులున్న మాటలు ఇయాల్రేపు కోర్టు నోటిపొంటనే ఇనత్తానయి కాబట్టి కోర్టు నుంచైన జెప్పియ్యాలె!
సూడ్రా!బయ్‌!ఇ‌క్రమార్క్!    ఇం‌టివి కద! బుద్దిజీవులందరు, అఖరికి  ధైర్నం లేని విపక్షాలు సుత వద్దు,వద్దన్నంక పోలీసు కావలి బెట్టి సచివాలయం కూలగొట్టుడెనుక సర్కార్‌ ‌మనుసుల అసలు మతలబేంది కావచ్చు!? నా ప్రశ్నకు జవాబు చెప్పకుంటె నేనయితె ఊకోనని బెదిరిచ్చేటి భేతాళున్ని యెప్పటి తీర్గనే భుజాన మోసుకుంట’’ఇను!భేతాళ్‌! ‘‘‌వానుంటె కరువు లేదు,పెనిమిటుంటే పేదరికం లేదు’అన్నట్టు సర్కార్‌ ‌సక్కంగుంటె  జనానికి తిప్పలేడిది!?జనానికి నమ్మకం ఇయ్యాల్షిన పెద్దరికమే నమ్మకాలు,విశ్వాసాల పేరుమీద పాతది కూల్చండి!కొత్తది కట్టండి! అంటె’’కూట్లె రాయేరనోడు యేట్ల రాయేరిండట!‘తీర్గున్నది. కరోనా కాలంల అప్పులై రాజ్జెం ఆర్థికంగ దెబ్బతిన్నదన్నంక ఇప్పుడు కోట్లరూపాల తోని సచివాలయం కట్టుడంటె దానెనుక ఎవలి కర్థం కాని మతలబున్న దని అనుకోవాలె! ‘‘అని నవ్వుకుంట నడ్వబట్టిండు…నడ్వబట్టిండు…
-ఎలమంద,తెలంగాణ
buggetCorona virussecretariate demolitiontelangana gocernment
Comments (0)
Add Comment