ఢిల్లీలో రైతుల నిరసన, ఆగ్రహ ప్రదర్శన, దిగ్బంధం

  • షరతులను నిరాకరించిన రైతాంగం
  •  రైతు వ్యతిరేక చట్టాలు విరమించుకోవాలని చలో ఢిల్లీ

ఒకనాడు అసంఘటిత రంగం గా పేదవారి కోపం పెదవికి చేటు అనే విధంగా చూడబడిన రైతాంగం యొక్క అగ్రహావేశం. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను దిక్కరించి స్థాయికి భారత రైతాంగ జనం ఎదగడం హర్షనీయం అభినందనీయం. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు ఇటీవలనే దేశ వ్యాప్తంగా నవంబర్‌ 26‌వ తేదీన సార్వత్రిక సమ్మె జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. నేడు భారత దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పిట్టలను కొట్టి రాబందుల కడుపు నింపే, కార్పొరేట్ల కొమ్ముకాసే విధానానికి చరమగీతం పాడడానికి భారతదేశంలోని అన్ని వర్గాలు ఒక తాటి పైకి రావడం శుభసూచకం. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ధిక్కరిస్తూ గత అనేక సంవత్సరాలుగా సార్వత్రిక సమ్మె కార్మికులు. వామపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. గత ఆరు సంవత్సరాలుగా బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా కార్పొరేట్ల విషకౌగిలి కెచేర్చడాన్ని భారత దేశ ప్రజానీకం తో పాటు ప్రపంచం యావత్తూ ఒక కంట కనిపెడుతూనే ఉన్నది. చమురు సంస్థలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇన్సూరెన్స్ ‌కంపెనీలు, బొగ్గు గనులు, రైల్వేలు, రక్షణ రంగం అంతరిక్ష రంగం తోపాటు అన్ని రంగాలలో కూడా క్రమంగా నేటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు ధారాదత్తం చేసి సామాన్యులు పొట్టి కొట్టే విషమ పరిస్థితుల నుండి ఛాలెంజ్గా సవాల్‌ ‌విసిరిన టువంటి సార్వత్రిక సమ్మె మొదటిది అయితే, రైతు వ్యతిరేక చర్యల పై అమీతుమీ తేల్చుకోవడానికి, రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకునేలా ఒత్తిడి చేయడానికి 32 రైతు సంఘాలు ఏకమై నిర్వహిస్తున్న ప్రజా పోరాటం రెండవ మహాసంగ్రామం గా చెప్పుకోవచ్చు.

చలో ఢిల్లీ రైతాంగ పోరాటం ఎందుకు:-
గతంలో గిట్టుబాటు ధర కోసం రైతు సాయం పెట్టుబడి వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ ‌చేస్తూ ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని గతంలో కొనసాగించిన చరిత్ర భారత రైతు సంఘాలకు ఉన్నది. ఈసారి ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా 3 బిల్లులను ఆమోదించిన విషయంలో విరమించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ ఏకైక డిమాండ్‌ ‌తో గత గురువారం నుండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా హర్యానా పంజాబ్‌ ‌మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్‌ ‌తదితర రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన రైతులు ఢిల్లీ శివార్లలోని సింగ్‌ , ‌టిక్రీ సరిహద్దుల్లో బైఠాయించి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు కదిలే ప్రసక్తి లేదని సవాల్‌ ‌విసరడం దేశమంతా గమనిస్తున్న విషయం. ఢిల్లీలోని సంత్‌ ‌నిరంకారీ మైదానానికి వెళ్లి నిరసన వ్యక్తం చేసినట్లు అయితే చర్చలు జరపడానికి కేంద్ర మంత్రివర్గం సిద్ధమని హోం శాఖ మంత్రి తో పాటు హోం శాఖ కార్యదర్శి అజయ్‌ ‌కుమార్‌ ‌బల్ల నిరసన లో పాల్గొంటున్న 32 రైతు సంఘాల ను ఉద్దేశించి లేఖన పంపించగా నిరంకారీ మైదానం ఒక జైలు తలపిస్తుందని ఇక్కడే నిరసన వ్యక్తం చేయడం ద్వారా కేంద్రం దిగివచ్చి బిల్లులను ఉపసంహరించుకోవాలని భేషరతుగా అంగీకరించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. పిల్ల జిల్లా ముసలి వాళ్ళ తో సహా ట్రాక్టర్లు ఇతరత్రా వాహనాలలో తినుబండారాల తో సహా వచ్చిన మని ఎన్ని రోజులైనా నిరసనకు సిద్ధమని చెప్పడం రైతు లోని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా భావించాలి. ఈ రైతాంగ సమ్మెకు మద్దతుగా ఉత్తరప్రదేశ్‌ ‌రైతులు కూడా సంఘీభావం ప్రకటించారు. నిరంకారీ మైదానం కాదని జంతర్మంతర్‌ ‌వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని మైండ్‌ ‌చేయడంతోపాటు ఒకవైపు అఱతీ•అ••తీఱ గ్రౌండ్లో రైతులు నిరసన కొనసాగుతుండగా మరోవైపు రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 3‌వ తేదీన రైతు సంఘాలు చర్చలకు ఆహ్వానించింది.

మరొకవైపు సార్వత్రిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో హర్యానా లోని పలు కుల సంఘాలు రైతుల నిరసన కు మద్దతు ప్రకటించడంతో పాటు ఢిల్లీ సిల్క్ ‌గురుద్వారా మేనేజ్మెంట్‌ ‌కమిటీ ఆహారము అందజేసి రైతుల నిరసన లకు మద్దతు తెలుపుతున్నది. మరొక వైపు పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ ‌నేత అమరేందర్‌ ‌సింగ్‌ ‌రైతులకు దగ్గరుండి అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుకున్న గా రైతుల ఆందోళనకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట కూడా మద్దతు తెలపడం రోజురోజుకు రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వెన్నులో చలి పుట్టింది. ఒకవైపు ప్రధానమంత్రి సాగు చట్టాలతో రైతులకు లాభం ఉంటుందని, దశాబ్దాల సమస్యలకు కొద్ది సమయంలోనే పరిష్కారం చూపిన ఘనత తమ బీజేపీ ప్రభుత్వానిదేనని, గత ఎన్నో ఏళ్లుగా రైతులు చేస్తున్న డిమాండ్లు, సమస్యలను ఈ చట్టంతో ప్రభుత్వం నెరవేర్చి నట్లు అయిందని ప్రధానమంత్రి అనడం రైతాంగాన్ని తప్పుదోవ పట్టించడమే నని పలు రైతు సంఘం నాయకులు విమర్శిస్తున్నారు.ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఢిల్లీలోనే ఉంటామని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ట్రాక్టర్లు ట్రాలీలు వాహనాల్లోనే నిదురిస్తున్నట్లు చెబుతున్న రైతు సంఘం నాయకులు పోలీసులు హెచ్చరిస్తునప్పటికీ వారిని ఖాతరు చేయడం లేదు సరికదా ఆదివారం సమావేశమైన రైతు సంఘం నాయకులు తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత బల్‌ ‌జిత్‌ ‌సింగ్‌ ‌మహల్‌ ఉద్యమ విజయం పట్ల ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆమోదించిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పేదలు రైతుల మెడలకు ఉరితాళ్లు గా మారనున్న వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ ‌సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

– రైతు ఖర్చులు అన్నింటికీ 50 శాతంగా అదనంగా కలిపి దేశవ్యాప్తంగా ఒకే మద్దతు ధర ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించాలని ఆదర్శ రైతుకు అందేలా చూడాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. – కార్పొరేట్‌ ‌రాబందులు వ్యవసాయ రంగం లోకి వచ్చినట్లయితే తమ భూమి లో రైతులు కూలీలుగా మారవలసి ఉంటుందని కార్పొరేట్‌ ‌వ్యవసాయం రాకుండా రైతు చేతుల్లోనే ఉండేవిధంగా రక్షించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకమా ఎలా?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టాలు గా మార్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు రైతుల పాలిట గుదిబండలా మారిన నేపథ్యంలో రాబోయే ప్రమాదాలను అడ్డుకోవడానికి ముఖ్యంగా ఈ చలో ఢిల్లీ రైతాంగ పోరాట కార్యక్రమం రూపుదిద్దుకున్నది.

చట్టం నెంబరు 1:-
ఈ చట్టం ప్రకారం గా రైతులు కార్పొరేట్‌ ‌కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఉంటుంది ఏటా ఒప్పందాన్ని పొడిగించుకుంటూ ఐదు సంవత్సరాలు కొనసాగించే దీని ప్రకారం బయటి మార్కెట్లో ఒప్పందానికి మించిన ధరలు ఉన్నాకూడా బయట అమ్ముకోవడానికి వీలు లేదు కార్పొరేట్‌ ‌లకే వాళ్ళు పెట్టిన ధరకే అమ్మాయి ఉంటుంది అనేక సాకులతో మన్యం ధరను తగ్గించుకున్న రైతులు నష్టపోవాల్సి ఉందే కానీ ప్రభుత్వం, అధికారులను అడిగే అవకాశం ఉండదు. ప్రజల రైతుల సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం తన పాత్ర కోల్పోయి నందున కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రైతులకు దాపురించే వచ్చు. అప్పులు కూడా కార్పొరేట్‌ ‌సంస్థలే ఇస్తాయి తాకట్టు పెట్టిన ఆస్తులు ఆ సంస్థ తీసుకొని అప్పులు తీర్చలేక పోతే భూములను కోల్పోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఏ పంట వేయాలో కార్పొరేట్‌ ‌సంస్థ నిర్ణయించే దుస్థితి దాపురించ డంతో అనివార్యంగా ఒక రైతు తన పొలంలో తానే కూలీగా పని చేయవలసిన దౌర్భాగ్యం దాపురిస్తుంది. దీని ప్రకారం రైతుల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా దిగజారుతాయి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ పోరాటం.

చట్టం నెంబర్‌ 2:-
‌రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేటు రంగంలో దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అని చెబుతున్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ఈ చట్టం చెప్పడం ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి పూర్తిగా ప్రైవేటుకె తాకట్టు పెట్టడమే. ఇక ప్రభుత్వం మార్కెట్లు పక్కదారి పట్టి ప్రైవేటు రంగం మార్కెట్‌ ‌యాడ్‌ ‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా చేసే కొనుగోళ్లపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు. కొనుగోలు అమ్మకం విషయంలో ప్రైవేటు రంగం పాత్ర పోషిస్తుంది కనుక రైతులకు ప్రభుత్వం ద్వారా పొందే మద్దతు ధర, రక్షణలు, ప్రయోజనాలు రైతులు కోల్పోవలసి ఉంటుంది. అంతేకాకుండా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినందుకు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం నుండి రాయితీలు వస్తాయి. మార్కెట్‌ ‌యార్డ్ ‌ల తో పని లేని కారణంగా హమాలీలు, ఉద్యోగులు తమ పదవులను కోల్పోయి నిరుద్యోగులుగా మారుతారు ఇది ఈ రెండవ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తానన్న మేలు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమేనా? 2006లోనే బీహార్‌ ‌రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని వ్యవసాయ మార్కెట్‌ ‌లను రద్దు చేయడం ద్వారా అనేక మంది ఉపాధి కోల్పోవడంతో పాటు అక్కడి రైతులు కార్పొరేట్ల వలలో చిక్కి శల్యమై పోతున్నారు. ఈ దుస్థితిని మనం గమనించే పోరాడవలసిన అవసరం అనివార్యంగా రైతులకు ఏర్పడింది.

చట్టం నెంబర్‌ 3:-
‌ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ధరల నియంత్రణకు సంబంధించిన 1955 చట్టానికి చేసిన సవరణ చట్టం ఇది. ఈ చట్టం ప్రకారం బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఆలుగడ్డలు, ఉల్లిగడ్డ నిత్యావసర సరుకులు ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించబడినవి. అంటే వీటి ధరలను ప్రభుత్వం ఇక ఏ మాత్రం నియంత్రించలేదు. కార్పొరేట్‌ ‌కంపెనీలు కాంట్రాక్టర్లు వీటి ధరలను ఇష్టమున్నట్టు గా పెంచి ఎక్కువ ధరలకు అమ్ముకొని వినియోగదారులను మోసం చేసే ప్రమాదం ఉండగా తక్కువ ధరలకు ఉత్పత్తులను కొని రైతులను కూడా మోసం చేసే ప్రమాదం ఉన్నది.

ఇంతవరకు వెబ్సైట్‌ ‌గోదాములలో కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉంచే అవకాశం ఆ బాధ్యతను ప్రభుత్వం నిర్వహిస్తున్నది . ఈ చట్టం ప్రకారం ఎఫ్సీఐ సంస్థను ఎత్తివేసే ఆలోచన ఉండడంతో ఇప్పటికే కోట్ల మంది అర్ధాకలితో మాడి పోతుండగా ఇక నిల్వ చేసే సామర్థ్యం లేక ఎఫ్సీఐ మూతపడి ప్రభుత్వం దగ్గర నిలబడి ఉండగా ప్రైవేటు రంగం ప్రజల గురించి పట్టించుకోని కారణంగా క్రమంగా ప్రజాపంపిణీ వ్యవస్థ రేషన్‌ ‌షాపులు కనుమరుగై పూర్తిగా ప్రైవేటు రంగంలో కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించే అవచ్చు అప్పుడు రైతులకు వినియోగదారులకు ఇరువర్గాలకు ఇబ్బందే.

ఇంత బాధ్యతారాహిత్యంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజలను, రైతులను, కొనుగోలుదారులను కార్పొరేట్లకు అప్పజెప్పి దుష్ట సంప్రదాయానికి నిర్ణయానికి ఒడి కట్టడంతో, ప్రభుత్వ రంగంలో ప్రపంచంలోనే అత్యున్నత సంస్థ గా పేరుగాంచిన జీవిత బీమా సంస్థలు కూడా ప్రైవేటు అమ్మడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న ఈ వేళ ఈ దేశము లోని ప్రజల సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉండటంతో నేడు రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అన్ని వర్గాల ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ పోరాటంలో విజయం సాధిస్తేనే రైతు చట్టాలను ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని ఒప్పిస్తే భవిష్యత్తు ప్రజలది. ఈ పోరాటంలో ఓడిపోయి మామా ప్రతి రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే రాబోయే పరిణామాలకు ప్రజలందరూ కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. కనుక పాలకులు ప్రజలకు సేవకులుగా ప్రజలను ప్రభువులుగా చూసే ప్రభుత్వాలకే మద్దతు ఇద్దాం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడే ప్రభుత్వాలను వ్యతిరేకిద్దాం.ఈ సందర్భంగా అంబేద్కర్‌ ‌రాజ్యాంగం గూర్చి అన్న మాటలు శిరోధార్యం. ‘‘రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పాలకుడైన ప్రజలైనా దేశద్రోహు లే’’. ఈరోజు ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సొంత ఎజెండాను అమలు చేయడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవేళ దేశ ప్రజానీకం జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలను న్యాయస్థానాల్లో, ఉద్యమాల ద్వారా తిప్పి కొట్టడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనివార్యంగా ఏర్పడింది.

‘‘రైతు కార్మిక ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇద్దాం’’ ‘‘ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించు కుందాం’’.‘‘ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏర్పడిన ప్రమాదాన్ని తిప్పికొడదాం’’.

వడ్డేపల్లి మల్లేశము, 9014206412
(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు అధ్యక్షులు జాగృతి కళాసమితి కవి రచయిత సీనియర్‌ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్‌ ‌జిల్లా సిద్దిపేట తెలంగాణ)

blockade in DelhiFarmers protestprotest
Comments (0)
Add Comment