మిటింగ్‌లకు రాకుంటే పథకాలు కట్‌

  • ‌హుజూరాబాద్‌లో బెదిరింపు రాజకీయాలు
  • అంగట్లో వస్తువుల్లాగా మనుషులకు బేరాలు
  • గడ్డిపోచలా తీసేస్తే గడ్డపారైన వొస్తున్నానన్న ఈటల

హుజూరాబాద్‌లో వ్యాన్ల కొద్దీ మద్యాన్ని పంచుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. హరీష్‌ ‌రావు మార్కెట్‌లో వస్తువుల బదులు మనుషులను కొంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌మిటింగ్‌కు రాకపోతే పథకాలు రావని బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్‌, ‌రోషయ్య, కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిల మిద పోరాడింది తానే అని చెప్పుకొచ్చారు. తాను సీఎం పదవి కోసం పోటీ పడలేదన్నారు. రెండు గుంటల భూమి ఉన్నోడు రెండు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ అ‌క్రమ సంపాదనకు, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని ఈటల తెలిపారు. కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ‌ప్రజలను కొనే శక్తి లేదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌హుజూరాబాద్‌లో విందు రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌ ‌జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్‌ ‌నాయకులు ఈటల ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. డప్పు చప్పుళ్ల మధ్య ఈటలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘కేసీఆర్‌ అ‌క్రమ సంపాదనకు, అహంకారానికి.. హుజూరాబాద్‌ ‌ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది.

పావలావడ్డి రుణాలు రావాలంటే టీఆర్‌ఎస్‌ ‌మిటింగ్‌కు రావాలని మహిళలపై టీఆర్‌ఎస్‌ ‌నేతలు వొత్తిడి తెస్తున్నారు. హుజూరాబాద్‌ ఆడబిడ్డలకు ఇచ్చినట్లుగానే..తెలంగాణలోని మహిళలందరికీ రుణాలు ఇవ్వాలి. నేను రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వొస్తున్నాయంటే..మరి గెలిస్తే ఇంకెన్ని పథకాలు తెస్తానో ఆలోచించాలి. హరీష్‌ ‌రావు మార్కెట్లో వస్తువులు కొనకుండా.. కేవలం ఆత్మగౌరవాన్ని కొంటున్నారు. వారితో చేరే వారందరూ అమ్ముడుపోవడం లేదు. వాళ్ల దగ్గర నటిస్తున్నారంతే. హుజూరాబాద్‌ ‌గడ్డమిద ప్రజలను కొనగలిగే శక్తి కేసీఆర్‌కు, హరీష్‌ ‌రావుకు కాదు కదా.. వాళ్ల జేజెమ్మకు కూడా లేదు.

నీ పార్టీ చరిత్ర 20 ఏళ్లదైతే.. నేను 18 ఏళ్లు మి పార్టీలో ఉన్నా. నన్ను మధ్యలో వొచ్చి మధ్యలో పోయానంటారా.. మి భరతం పడుతా బిడ్డా. నేను ఎదిగితే… వాళ్లకు ఏకుమేకవుతానని వెళ్లగొట్టారు. గడ్డిపోచలా తీసేస్తే పోతానని అనుకున్నారు. కానీ, గడ్డపార అవుతానని వాళ్లు అనుకోలేదు. కేసీఆర్‌ అ‌క్రమ సంపాదనకు, అహంకారానికి, దొరతనానికి.. ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమిది. ఈ ధర్మపోరాటంలో నాకు అండగా నిలవండి. వాళ్లు నా గురించి విమర్శలు చేస్తుంటే టీవీ పగులగొట్టాలనిపిస్తుందని ఓ మహిళ చెప్పింది. ఎన్ని డబ్బులిచ్చినా ధర్మాన్ని, నన్ను మర్చిపోకండి. టీఆర్‌ఎస్‌ ‌వాళ్లకు డిపాజిట్‌ ‌రాకుండా.. మి తీర్పునిస్తారని నమ్ముతున్నా’ అని ఈటల అన్నారు.

బీజేపీలో చేరికలు
హుజురాబాద్ నియోజకవర్గం , వీణవంక మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికీ చెందిన వివిధ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు సుమారు 100 మందికి పైగా బిజెపి పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి కండువా కప్పి ఆహ్వానించి .. గ్రామంలోని ప్రతి వాడలో ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.

etele rajendra prasadprajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment