విచారణ కమిషన్‌ల నియామకం  

ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలమయి ­ పోయింది.. ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది.

విచారణ కమిషన్ల చట్టం 1956 గురించి జనతా ప్రభుత్వం అందరికీ తెలిసేలా చేసింది. కాని ఇప్పుడు ఆ విచారణ కమిషన్ల నియామకం ప్రజలను మోసపుచ్చడానికి, ఏదో ఒకటి జరుగుతుందని నమ్మి ప్రజలు మౌనంగా ఉండడానికి ఒక సాధనంగా ఉపయోగపడతోంది. అందువల్లనే జస్టిస్‌ ఠక్కర్‌, జస్టిస్‌ నటరాజన్‌ కమిషన్‌ విచారణ కమిషన్ల చట్టం ఎంత అసమర్థంగా మారిపోయిందో వాపోయారు. ఈ నిష్పల కసరత్తుల  వల్ల ఎంత సమయం శక్తి, వనరులు వ్యర్థిమైపోతున్నాయో ఆ న్యాయమూర్తు  లిద్దరూ వివాదం ప్రకటించారు. ఈ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఒక విచారణ కమిషన్‌ నియమించిన చరిత్ర తెలుసుకోవలసినది.
కొన్ని వ్యాపార సంస్థలు జరిపిన లావాదేవీలలో జరిగిన ఆర్థిక నేరాల గురించిన ఆరోపణలను విచారించడానికి ఫేర్‌ ఫాక్స్‌ గ్రూప్‌ ఇన్‌ కార్పోరేటెడ్‌ అనే విదేశీ పరిశోధనా సంస్థను నియమించడంలో అక్రమాలు జరిగాయని పార్లమెంటులో చర్చ జరిగింది. దానితో1987లో ఆ ఇద్దరు న్యాయమూర్తులతో ఒక విచారణ కమిషన్‌ను నియమించారు. జస్టిస్‌ ఠక్కర్‌, జస్టిస్‌ నటరాజన్‌లు తమ నివేదికలో 1956 విచారణ కమిషన్ల చట్టం ‘‘అసమర్థమైనదని, కోరలు లేనిదని’’ అభివర్ణించారు. ఆ చట్టంలోని అసమగ్రతలను వివరించడానికి వారి నివేదికలో ఒక పూర్తి  అధ్యాయం కేటాయించారు.. వారి విచారణ క్రమంలో వారి మీద కొన్ని వార్తాపత్రికలు అన్యాయమైన దాడి, దుష్ప్రచారం సాగించాయి ­. ఆ కమిషన్‌ ఇచ్చిన సమన్లను కొందరు వ్యక్తులు ఖాతరు చేయలేదు. అప్పటికి ఇంకా పదవిలోనే ఉన్న న్యాయమూర్తులుగా వారికి ఈ విచారణ సందర్భంలో కూడా కోర్టు ధిక్కరణ నేరం కింద తమ ఆదేశాలను బేఖాతరు చేసిన వారిని విచారించేందుకు అధికారం ఉంటుందని వారు వాదించారు. తమ ఆదేశాలను ధిక్కరించిన వారిని శిక్షాస్మృతి ప్రకారం విచారించి శిక్షలు విధించే అధికారం కూడా తమకు ఉండాలని వారు వాదించారు. ఇటువంటి ప్రజా అధికారి ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించే వారిపై హెచ్చరికగా నిలిచే శిక్షలు అమలు చేయాలని వారు వాదించారు.
వారి ఈ నిరాశాభరితమైన వాదనలలో గుర్తించవలసిన విషయమేమంటే అప్పుడప్పుడే  తలెత్తుతున్న ధోరణుల పట్ల వారిలో వ్యక్తమైన నిరాశ. అంటే ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలమయి ­ పోయింది . ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్తు కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది.
అయినా విచారణ కమిషన్‌ను నియమించమని అడగడం ఒక రాజకీయ ఆకాంక్షగా అలవాటుగా మారిపోయింది . అది దాదాపు యాంత్రికంగా వచ్చేస్తుంది. ఇక మానవ హక్కుల, పౌరహక్కుల బృందాలకయితే ఈ విచారణ కమిషన్లనేవే హక్కుల ఉల్లంఘనలను బయటపెట్టే, ప్రభుత్వం చేత జవాబుదారీ బాధ్యత వహించేలా చేసే సాధనాలుగా ఉన్నాయి . కాని మానవ హక్కులను గౌరవించడమేనేది ప్రభుత్వాధికారులకు సాధారణ ప్రవర్తనగా మారాలంటే మొ­త్తం సమాజమే పెద్దఎత్తున చాలా లోతుగా పునర్నిర్మాణం జరగవలసి ఉంటుంది.కాని రోజులన్నీ ఒక్క రాత్రిలో జరిగిపోవు గనుక చిన్నచిన్న పనులకే మనం సంతృప్తి పడవలసి ఉంటుంది. సమాజాన్ని మెరుగైన ప్రపంచంగా మార్చడానికి జరుగుతున్న చిన్న ప్రయత్నాలతోనే సంతృప్తి పడవలసి ఉంటుంది. ఆ మెరుగైన ప్రపంచం వచ్చే లోపల ప్రజా జీవితం మరీ దుర్భరంగా మారకుండా ఉండేలా, జీవనయోగ్యమైనదిగా ఉండేలా చిన్నచిన్న పనులు చేయడమే మన కర్తవ్యం.
అటువంటి పనులలో భాగమే పౌర హక్కుల కృషి. ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘానికి నా కన్నా ముందు  మహాకవి శ్రీశ్రీ అధ్యక్షుడిగా ఉండేవారు. హైకోర్టు న్యాయవాది పత్తిపాటి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. వారిద్దరూ నిజనిర్ధారణ బృందంగా ఏర్పడి రాష్ట్రంలో పోలీసు అత్యాచారాలు జరిగిన ప్రాంతాలెన్నో తిరిగారు. ఎక్కడ ఎన్‌కౌంటర్‌ పేరిట హత్య జరిగితే అక్కడికి వెళ్లి వాస్తవాలు సేకరించి పత్రికలకు, ప్రజలకు తెలియజేశారు.
శ్రీశ్రీ, పత్తిపాటి వెంకటేశ్వర్లు చేసిన పని అంతా ఒక దోపిడీ  సామాజిక వ్యవస్థ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి మౌలిక మానవ హక్కుల గురించి ఎలుగెత్తడమే. కాని వారు చేసిన ఈ పనికి వారిని  చాలా తప్పుడు పద్ధతిలో నక్సలైట్ల మద్దతుదారులుగా రాజ్యం ముద్రవేసింది. మొ­దట నక్సలైట్ల హక్కుల అణచివేతగా ప్రారంభమైనది క్రమక్రమంగా ఇతర వర్గాల ప్రజల హక్కుల అణచివేతగా మారడంతో పౌర హక్కుల అణచివేతగా మారడంతో పౌరహక్కుల సంఘం ఆయా వర్గాల ప్రజల హక్కుల కోసం కూడా మాట్లాడవలసి వచ్చింది. భూస్వాములు కూడా గ్రామసీమలలో రాజ్యంతో సమానమైన అధికారబలం కలిగి ఉన్నందువల్ల వారు చేసిన హక్కుల అణచివేతను కూడా పౌరహక్కుల కృషిలో భాగం చేయవలసి వచ్చింది. ఈ అత్యాచారాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులకు కూడా విస్తరించడంతో పౌరహక్కుల కృషి ఆయా రంగాలకు కూడా వ్యాపించింది. నిజానికి ఈ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు భారత ప్రభుత్వం సంతకం చేసిన అంతర్జాతీయ ఒడంబడికలు హామీ ఇచ్చాయి ­. రాజ్యాంగంలోని 17, 23, 24 అధికరణాలు హామీ ఇచ్చాంయి .  అధికరణం 17 అస్పృశ్యత గురించి మాట్లాడితే దాన్నే 1956 పౌరహక్కుల చట్టం, 1986 షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల అత్యాచారాల నిరోధ చట్టం విస్తరించాయి ­. అధికరణం 23 నిర్బంధ, వెట్టిచాకిరీ గురించి, అధికరణం 24 బాలల హక్కుల గురించి మాట్లాడాయి ­. రాజకీయంగా అమలులో పెట్టదగిన రాజ్యాంగంలోని నాలుగో భాగం మొత్తం ఈ మానవ హక్కుల గురించే ప్రస్తావించింది. అధికరణం 51 ఎ లో పొందుపరిచిన ప్రాథమిక బాధ్యతలు మానవ హక్కుల ఉద్యమం ఎంతగా విస్తరించవచ్చునో స్పష్టం చేశాయి

.-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్
enquiry commission act 1956fair faxjanata governmentJustice natarajanjustice Thakkar
Comments (0)
Add Comment