భావోద్వేగాలు?

పొడిచే పొద్దులో
నడిచే నీడలో
తలచే మదిలో నువ్వేనని
నే తపించాను
అది నిజమో భ్రమయో
తెలియక
సతమతమవుతున్నాను.
నేరుగా నా దరి చేరక
ఎందుకీ ఈ దోబూచులాట
నా ప్రమేయం లేకుండానే
నా మది దోచావు..
అది తెలిసాక నన్ను
తన్మయత్వంలో నింపావు.
నా కలల రారాజువు
నువ్వేనని తెలిసేలా చేసావు.
నిగ్రహానికి ప్రతీకగా ఉండే
నా మదిని చలింప చేసావు
నిన్ను చూడాలని
నీ ఎదతో నేరుగా మాట్లాడాలని.
నీ హృదిలో భాగం కావాలని
మాటల కందని
భావోద్వేగాల నడుమ
నన్ను బందీ చేసావు..
ఇన్ని చేసి నువ్వు
కనిపించకుండా
దోబూచులాడుతున్నావు..
నీ రూపం చూడలనుకున్నాను
నీ స్వరం వినాలనుకున్నాను.
ఇప్పుడు నీ హృదయం అందితే
చాలని తపిస్తున్నాను.
నీ మనసున కాసింత చోటు
అందిస్తే నువ్వు
నా మనసు సామ్రాజ్యానికి
అధిపతిని చేసేటట్లుగా నా
మనసును దోచావు నువ్వు.
ఎన్నడూ లేని ప్రేమ తరంగాలను
నాలో రగిలించావు నువ్వు..
నీతో మాట్లాడుతూనే
నీ హృదిని అక్రమించేసాను
చూసుకో ఒక సారి నువ్వు..
– ప్రియ గోలి, 85008 81385
గుంటూరు

andhrapradeshprajatantra newstelanganatelugu articlestelugu facts
Comments (0)
Add Comment