ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో డ్రామాలు

  • టిడిపి తీరుపై ఘాటుగా స్పందించిన మంత్రి బొత్స
  • చంద్రబాబువి దొంగ ఏడుపులంటూ ఘాటు విమర్శలు

అనంతపురం, నవంబర్‌ 27 : ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని మంత్రి బొత్స ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బొత్స స్పష్టం చేశారు. లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు క్రియేట్‌ ‌చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే సంస్క•తి టీడీపీ నేతలకే ఉందన్నారు. ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ఏడుపుపై స్పందించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము సహించబోమన్నారు.

ఏపీలో మహిళలందరికీ సీఎం జగన్‌ ‌పెద్దపీట వేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లు ఫ్రీగా రిజిస్టేష్రన్‌ ‌చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యా స్పదంగా ఉన్నాయని బొత్స ఎద్దేవా చేశారు. ప్రజలపై చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయలేదని నిలదీశారు. మరోవైపు ఏపీలో పలు ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని? వరద ద కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని బొత్స కితాబిచ్చారు. అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు, రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ శనివారం అనంతపురం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్‌ ‌పివివిఎస్‌ ‌మూర్తి మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు.

Adapadachula Self-RespectBotsa satyanarayanaDramaself-respecttdpysrcp party
Comments (0)
Add Comment