తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర…!

తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరు చిరంజీవి మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసమే తన జీవితాన్ని కోనసాగించారు. ఆయన జీవితం ఆదర్శనియమని , తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.

తొలి తరం ఉద్యమకారునిగా 1969 లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నారన్నారు, సీఎం కేసీఆర్ నాయకత్వం లో మలి దశ ఉద్యమం లో ఆయన సేవలు మరువ లేనివన్నారు.. చిరంజీవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Dr kolluru chiranjeevi
Comments (0)
Add Comment