‘‘దర్వాజలు తెరిషిండ్రు’’!…

“పంట ఉత్పత్తి నుంచి అమ్మెటందుకు తోల్క బోవుడు,మద్దతు దర తేల్సుడు,కొనుడు, అమ్ముడు తీరంత మారి కార్పొరేటాసముల పాల్జేషే  కత మోపయింది. కార్పొరేట్‌ ‌దొరలతోని మిలాకతై సర్కారు జేషే తేనెబూషిన సట్టాలు రైతు సావు గోర్తాండె!.బలమున్నోనిదే రాజ్జెంతీరుగ సర్కార్‌ ‌మున్నెల్ల కిందనే గీ మూడు యవుసం బిల్లులు తెచ్చింది.రైతును బూమికి దూరం జేసుడేగాదు జనానికి ముందు ముందు తిండిగింజలు దొరుక కుంట జేషే కుట్ర బాజి కతలువడ్తాంది.”

‘‘దో ఆలూ సమోసా!’’  
 ‘‘తమ్మీ! ఉల్లి దోశె రోస్టెయ్‌!’’
‌ఛలో!బండి కాడ ఆలూ పూరీ తిందాం!’’

గి సొంటి తిండి తిప్పల్లింక మర్శిపోవాలె! గా కాయిషులింక బందు వెట్టుండ్రి! గిప్పుడు గవన్నీ బగ్గ పిరమైతానయి. అరె! గిదేం ఇచ్ఛంత్రం! గియి పిరమవుడేందను కుంటాండ్లా యేంది!? గరీబోళ్ళ తిండి తిప్పలరుసుకునే గిసోంటియన్ని దూరం గానున్నయంటె ఎవలికైనా అయ్యో!అని మాగనిపిత్తది! రైళ్ళు ,రైల్వే టేషన్లు,గాలిమోటర్లు, వున్నయి లేనియన్ని ఉప్పు పుట్నాల తీర్గ కార్పొరేట్‌ ‌పెట్టుబడోళ్ళకు ఛాయ్‌ అమ్మినంత బిందాస్‌ ‌గ అమ్మజూపినంక మిగిలిందేమున్నది.!? ముల్లెలు గట్టుకునే షేతులు ములముల బెట్టవట్టె! అటిటు వోయి కార్పొరేటాసాముల కండ్లు దేశంలున్న పంట పొలాలమీద వడ్డది. రైతుకింత బతుకు నిచ్చే బూమి మీద,రైతు జేషే యవుసం మీద గాళ్ళ కన్నుపడ్డది,బూమికి రైతుకు మద్దెనడ్డువడ్డ దొరీర్కాలూ,గఢీలు గూలి, వూరవు తల సమాదులు గట్టుకున్నయి.గీ ఇగురం కాషాయముసుగులున్న కార్పొరేట్‌ ‌శక్తులు యెరుకలేకేం  గాదుగని, సోపతి గట్టిదాయె!గద్దెక్కినంక జేషేటి పనులేమైన పజలను కాపాయం జేయాలెగని గాయి బట్టిచ్చుడే  కాషాయం సేనకు రివాజైంది. గద్దెనెక్కెటానికి ముందున్న సర్కార్‌ ‌మాట అటెంక యెటమటమై జనాన్ని గాయి గాయి జేయ్యబట్టె!

నిత్తెవసరాల చట్టం,ఒప్పంద చట్టం,మార్కిట్ల చట్టం, ఇత్తన చట్టం గివన్ని రైతును రాజుగా జేసేపియన్న మాట ఒల్లెక్కాలే! కార్పొరేట్‌ ‌దందాలు జేషే టోళ్ళందరు సర్కార్‌ ‌ల పెద్ద మనుషులూ,వాళ్ళ సుట్టాలేనాయె!దేశం పచ్చగుండాలంటె పంటపొలాలు పచ్చగుండాలె! గాటిని పండించే రైతు పచ్చగుండాలె! రైతు గుడిశెలగుమ్ములు సల్లంగుండాలె!లేకుంటె దేశంల కరువు మామ్మారి శివాలెత్తుతది. దుక్కిటెడ్లు దుక్కపడకుంట సూసుకోవాలంటరు ముసలోళ్ళు.దేశంల రైతును బజాట్న బడేషి,బూమిని కార్పోరేట్‌ ‌కంపిన్లతోని సాగు జేయించే ఇకమత్‌ ‌కు దేశబక్తులు కంకనం గట్టుకున్నరు. గా దేశబక్తికోసమే యవుసం బాద్దెతల నుంచి సర్కార్‌ ‌పక్కకుబోవాలని సూత్తాంది గాబట్టే రైతును సాగుబడికి దూరం జేయవట్టింది. పంట ఉత్పత్తి నుంచి అమ్మెటందుకు తోల్క బోవుడు,మద్దతు దర తేల్సుడు,కొనుడు, అమ్ముడు తీరంత మారి కార్పొరేటాసముల పాల్జేషే  కత మోపయింది. కార్పొరేట్‌ ‌దొరలతోని మిలాకతై సర్కారు జేషే తేనెబూషిన సట్టాలు రైతు సావు గోర్తాండె!.బలమున్నోనిదే రాజ్జెంతీరుగ సర్కార్‌ ‌మున్నెల్ల కిందనే గీ మూడు యవుసం బిల్లులు తెచ్చింది.రైతును బూమికి దూరం జేసుడేగాదు జనానికి ముందు ముందు తిండిగింజలు దొరుక కుంట జేషే కుట్ర బాజి కతలువడ్తాంది.

ల్లిగడ్డ, అలుగడ్డ, జొన్నలు, బియ్యం, గోదుమలు, రాగులు, పప్పులు గిసొంటి తిండి సామాన్లన్ని నిత్తెవసరాలు కాదని డిల్లీ సర్కార్‌ ‌కొత్త కానూను జేషింది. యవుసం ఉత్పత్తులన్ని ఎవలెంత దాసుకున్న సుత ఏమనం,దాసుకోని పిరమైనప్పుడు అమ్ముకోవాలె! అని జేషిన కానూన్‌ ఎవలి కోసమో సమజయితలేదు.షిన్న,సన్న రైతుదాసుకునె హౌషతుంటదా!ఎంతన్న గాని దాసుకోనుడంటె కార్పొరేట్‌ ‌దందా కు దర్వాజాల తెరిషినట్టేనాయె! మార్కిట్ల కొనుడమ్ముడు లేదనంటె కళ్ళాల కాన్నే  రైతు నోట్లె మన్ను గొట్టి అగ్గువసగ్గువకు కొనే బోకర్‌ ‌గాండ్ల దోపిడి మొదలైతది. బడాదందా దోపిడోళ్ళు పెద్ద లెక్కన లారీలల్ల మాల్‌  ‌దాషేందుకు గోదాంలు గడ్తయి.మద్దతు దర మాటేందోగని అసలు దరలకే అర్ధం పర్ధం వుండదింక. లచ్చల కోట్ల రూపాల మాల్‌ ‌కు మన దేశంల దర రాకుంటె ఇంకో దేశం తొవ్వ బడ్తరు.ఎగుమతులు, దిగుమతుల దందా గుత్తా దారులషేతుల ల్లుంటది. దిక్కులు జూసుడు రైతు వంతయితది.కళ్ళాల కాన్నించి దేశాలు దాటిచ్చి కార్పొరేటాసాములు లాబాలు కండ్ల జూత్తరు. మన దేశంల తిండి గింజలు కరువై ఎండు డొక్కల మొకం మనం జూత్తం.యవుసం మార్కిట్ల కమిటీల నుంచి రైతును దూరం గుంజుడు తోని దేశం తిండిగింజల కతంత కార్పొరేట్ల షేతులల్ల బడ్డది.లాటినమెరికా దేశాలల్ల జరిగిందే మన తాన మళ్ళకనత్తాంది. దరలు సర్కార్‌ ‌షేతులల్ల లేకుంట కార్పొరేట్‌ ‌సేట్లు జెప్పినట్టు తలకాయలూపుతయి.

మట్టిని నమ్ముకున్న రైతిప్పుడు గా మట్టి మీద హక్కు లేకుంట బోయేటట్టున్నదా! సర్కార్‌ ‌దెచ్చిన ఒప్పంద సాగు కానూన్‌ ‌పకారం రైతు యేం పంటేయాలె!యెంతేయాలె! ఐనేది కార్పొరేట్‌ ‌గుత్తదారుల చేతులల్లకు బోయింది. గాళ్ళ తోని మాటముచ్చట అయితెనే ఉత్పత్తి జేయాలె! గుత్తదారులు కంపిన్ల తోని జేసుకున్న ఒప్పందంల యేమన్నఅటిటయితె రైతు పనొట్టిదే అయితది! గుత్తదారులే మిషిన్ల తోని యవుసం జేషే కాడికచ్చి రైతు బజాట్న నిల్సుండే రైతు సేవే చాయ్‌ ‌వాలా ‘‘మన్సుల మాట’’యినంక రైతుకు దిక్కెవలు!? ఒకటే దేశం,ఒకటే బాష,ఒకటే పన్ను, దారిన్నే గిప్పుడు ఒకటే మార్కిట్‌ అనేది రాష్టాల హక్కుల మీద దాడి లాగ కొడ్తాందని కొత్త లొల్లి షురువయితాంది.గీ యవుసం బిల్లుల కొత్త పరెషాన్‌ ‌తోని రైతుకు రాష్ట్రంల దొరికే అన్ని సౌలతులు బందయితయి.       గీ చాయివాలా రైతును రాజును జేసుడేందోగని గరీ బోళ్ళ నుంచి మద్దె తరగతి  కుటుంబాల దాంక అన్ని వర్గాల జనాలను ముందుముందు ఆగమాగం జేయనున్నడు.మన దేశంల సాగయ్యేటి నలభైనాల్గు కోట్లెకురాల బూమి కార్పొరేటాసాముల షేతులల్ల బడే కానూన్లు జేషి  మన కడుపుగొట్టే దినాలు మోపు జేషిండు.మన మట్టిల  పండిన పంటలకే షిత్రమైన పేర్లు బెట్టి దేశదేశాల సరుకని కార్పొరేట్‌ ‌కంపిన్లు అమ్ముకదొబ్బుతరు.మనం ‘‘బారతమాతా కి జై!అనుకుంట రామునికి బజన జేయాలె!.

సూడ్రా బయ్‌! ‘‘ఇ‌క్రమార్క్’’!‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! రైతును రాజును జేషేందుకే గీ కానూన్లు బుద్దిజీవులెందుకు వంకరటింకర జూసుకుంట కతలు వడుతాండ్లో సమజైతలేదు,జరంత సమ్జాయించు! లేకుంటె పలానా కేసుల లోపటికైన సారువాళ్ళ అల్లుని సుట్టమని పుకార్‌ ‌లేపుత! నువు సుత ఇచారణ, ఇప్పకాయల్లేకుంట యేండ్లకేండ్లు లోపటికైతవ్‌..‌పైలం!మరని బెదిరిచ్చేటి భేతాళుని ఎప్పటి తీర్గనే భుజం మీదేసుకొని ‘‘విను!భేతాళ్‌! ‌స్వదేశీ పాట పాడేటి దేశబక్తుల మాస్కులు మెల్లమెల్లంగా జారుతానయి. గాళ్ళ మొకాల మీద కార్పొరేట్‌ ‌కంపిన్ల ముద్రల బిల్కుల్‌ ‌కానత్తానయి.దేశంల వున్నయన్ని పయవేట్‌ ‌కంపిన్ల కాళ్ళ కాడ బోసుడైంది.ఆయింత యవుసం ఉత్పత్తులు సుత గాళ్ళకప్పజెప్పుడైతె కార్పొరేట్ల కుషీ అయితరని చాయివాలా గాటిని సుత ఒడజేషిండ్లు. బరతమాత రేపురేపు తిండి గింజలకు గతిలేక బిచ్చమడుక్కునుడే తిప్పలైతదని బుద్దిజీవులు గీ కానూన్లు వంకరున్నయనంటాండ్లు. దేశబక్తులకు గీ కానూన్లు సక్కంగ కానత్తె తప్పెవలిదో గాళ్ళకే తెల్వాలె!’’అని జెప్పుకుంట నడ్వబ ట్టిండు.. నడ్వబట్టిండు…
–  ఎలమంద.తెలంగాణ

Comments (0)
Add Comment