మనిషితనాన్ని రాయి చేసుకున్నడు
రాయిని దేవునిగా పూజిస్తున్నడు
రాక్షసత్వాన్ని లోన నింపుకున్నడు
నెపం రాతిపై నెడుతున్నడు!
అంతరంగంలో శూన్యం ఏర్పడితే
దానవత్వం దండయాత్ర చేస్తుంది
ఎలా బతకాలో తెలిసేలోపు
ఈర్ష్యాసూయ ద్వేషాలు గాండ్రిస్తున్నవి
మానవత్వం ఆపద బోనులో
దోషిగా నిలుచుంటుంది!
మనిషిలోని దానవ త్వాన్ని దహిద్దాం
మానవత్వాన్ని మనిషిలో మేల్కొల్పుదాం
మానవత్వాన్ని వారసత్వంగా పంచుదాం
మనిషి అంటే మానవత్వమని చాటుదాం
యుగయుగాల నీతి బోధలు
భౌతిక భావాల అంపశయ్య బాధలు
కురుక్షేత్ర సంగ్రామ కుతంత్రాలు!
పునరావృత్తం అవుతున్న యుద్ధ గాథలు
వంకర బుద్ధులే మానవత్వానికి మరకలు!
భూమి ఇంకా గుండ్రంగానే తిరుగుతున్నది
సమయం ఇంకా మించిపోలేదు మిత్రమా!
మానవత్వాన్ని రిపేరు చెయ్యు!
దానవత్వం నీ దరిదాపులకు రాదు!
– పి.బక్కారెడ్డి, 9705315250