డబుల్ ఇంజన్ సర్కార్‌తో ట్రబుల్స్
అభివృద్ధ్దిలో తెలంగాణ దేశంలో ఆదర్శం
పిట్లంలో 30 పడకల దవాఖానాకు మంత్రి హరీష్ శంకుస్థాపన
కామారెడ్డి,ప్రజాతంత్ర,డిసెంబర్
మహారాష్ట్ర, కర్ణాటకలో కరెంట్ కోతలున్నాయని ఇచ్చే 8, 9 గంటలకు ముక్కుపిండి వసూలు చేస్తారని ఆరోపించారు.దేశంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులది మాటలు ఎక్కువ చేతలు తక్కువని విమర్శించారు. ’ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా పేదలు, నిరుద్యోగుల ఉసురు తీశారని’ హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మొత్తం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తున్నారని వెల్లడించారు.మోటార్లకు టర్లు పెడితే రూ.6 వేలు ఇస్తామని కేంద్రం చెబుతున్నాకేసీఆర్ ససేమిరా అంటూ గొంతులో ప్రాణం ఉండగా టర్లు పెట్టను అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.
ధరణిపై అడ్డగోలుగా మాట్లాడడం సరికాదు
భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం..పోర్టల్ గురించి
తెలియకుండా వాగుతున్నారుమండిపడ్డ మంత్రి…
మంత్రి హరీష్ రావుకు జిల్లాలో నిరసన సెగ
కామారెడ్డి,ప్రజాతంత్ర: భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అడ్డగోలు మాట్లాడటం సరికాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ పోర్టల్ గురించి తెలుసుకోకుండా కొంత మంది మూర్ఖులు ఏదేదో వాగుతున్నారని మండిపడ్డారు. రూపాయి లంచం లేకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇంటికి వస్తున్నాయి. త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలను పరిష్కారిస్తామన్నారు. ధరణితో అవినీతి తగ్గింది. పారదర్శకత పెరిగింది. వేగవంతమైన పాలన అందుతుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇతర రాష్టాల్ర అధికారులు కూడా ధరణి పోర్టల్‌ను చూసి చాలా నేర్చుకున్నారని తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన డోంగ్లి మండలాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మండల కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. డోంగ్లి మండలం ఏర్పాటు ఎన్నో ఏళ్ల కల. ఆ కలను నిజం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 466 మండలాలను 612 కుపెంచామన్నారు.
టీడీపీ పోయి, కాంగ్రెస్ వచ్చింది. నీళ్ళ బాధ పోలేదు. టీఆర్ఎస్ వచ్చాకే నీళ్ళ బాధలు పోయాయని మంత్రి గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. హర్ ఘర్ కో జల్ పేరిట దేశం మొత్తం అమలు చేస్తున్నారు. చెరువులు బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నారు. రైతు బంధు కాపీ కొట్టి, కిసాన్ సమ్మన్ యోజన ద్వార ఇస్తున్నారు. నాందేడ్ నుండి సర్పంచులు వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలపాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇదిలావుంటే కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ బీజేపీ యువ మోర్చా నాయకులు పిట్లం మండలంలో ఆందోళన చేపట్టారు. మంత్రి హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. హరీష్ రావును అడ్డుకునేందుకు బీజేపీ యువమోర్చా నేతలు ప్రయత్నించారు. కాన్వాయ్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.