‌ప్రజాస్వామ్యం చెట్టుకింద

ఇది గడ్డు కాలం
బహు విషమ స్థితులు
ఆవరిస్తున్న వెర్రి కాలం
దేశం చెతులూ కాళ్ళూ నరుకుతూ
కేవలం నోటిని ఊటగా చేసుకుని
ఎర్రలని జుర్రుకుంటున్న విపరీత కాలం
మనం మనం తిట్టుకుందాం కాసేపు
వాళ్ళ బతుకుల్లో ఎమైనా పడనీ
సరిగ్గా ఆ టయానికి బుజ్జగిస్తే చాలు
ఆశజూపితే చాలు… పిచ్చి ప్రజా!
ఆ పూటకి వేషం వేసుకుని
మాటల గారడి చేస్తే చాలు
పల్టీలు కొట్టిస్తే చాలు
అందులో అణగారిన వారికి
గారెలు వండితే చాలు
ఇక మన జోలె నింపుకోవచ్చు
పుణ్యానికొచ్చారు కదా!
మంచిగ ముద్దుగ దువ్వుదాం కాసేపు
పోయేదేముంది.. మళ్ళా ఎప్పుడో కదా
అప్పటివరకు మనమేమన్నా
వొస్తామా చస్తామా
అక్కణ్ణించే మాట్లాడతాం
ఎప్పణ్ణించో ఇది అందరూ
అడుతున్న ఆటేకదా
కొంచెం అటూ ఇటుగా
ఎముంది మనం పోతే
మన వారసులున్నారు
వాళ్ళు పోతే వాళ్ళ వారసులొస్తారు
తరతరాలుగా ఇక మనదే రాజ్యం
ప్రజాస్వామ్యం చెట్టు నీడన
ఇష్టం వచ్చినట్టు మలిపి మలిపి
తిప్పి తిప్పి తందాం నడ్డి విరిగే వరకు
అప్పుడుగాని మన ఆటలు సాగవ్‌!

– ‌రఘు వగ్గు

Comments (0)
Add Comment