తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చిన దీక్షాదివస్‌ ‌మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌

తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చేసిన దినం దీక్షా దివస్‌ అని కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. నాడు తెలంగాణ సాధన కోసం గాంధేయ మార్గంలో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు అని గుర్తు చేశారు. ఆ రోజు తనను అరెస్టు చేసి వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలుకు తరలించారని పేర్కొన్నారు. నాటి నుంచి తెలంగాణ ఉద్యమం అనేక మలుపు తిరిగింది. ఆందోళనల నుంచి పరిపాలన వరకు ఉద్యమం కొనసాగింది. దీక్షా దివస్‌ ‌సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. తెలంగాణ ఉద్యమ గతిని ’దీక్షా దివస్‌’ ‌మార్చిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు.

పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో యావత్తు తెలంగాణ సమాజాన్ని ఏకతాటి వి•దకు తీసుకువచ్చిన కేసీఆర్‌ ‌చేసిన నిరాహార దీక్ష చరిత్రపుటల్లో నిలిచిందన్నారు. వంబర్‌ 29 ‌దీక్షా దీవస్‌ ‌స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షా తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు దారితీసిందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం చావుదాకా వెళ్లిన కేసీఆర్‌ ‌త్యాగం మరువరానిదని గుర్తుచేశారు. తెలంగాణ గతిని మార్చిన ఈ దినాన్ని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Deekshadivasminister ktrtelangana movement
Comments (0)
Add Comment