దళిత బంధు దళితులకు ఆపద్బాంధువా ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మొదటి సారిగా దళిత బంధువు పథకం అమలు చేసి సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడుతున్న దళితుల సాధికారతకు  పథకం అమలు దళితుల అభ్యున్నతికి పాటుపడే విధంగా  కార్యక్రమాన్ని  రాష్ట్రంలో చేపట్టిన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. , రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని  ఒక్క  దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం   పథకాన్ని విస్తరించాలని యోచనలో దశలవారీగా పంపిణీ చేస్తున్నది.

ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఇలాంటి పథకాన్ని పూర్తిస్థాయిలో  దళితులకు ప్రయోజనం  కలిగించే విధంగా జరగలేదని   దళిత సామాజిక వర్గానికి సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చే పథకంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పథకాన్ని పూర్తిస్థాయిలో దళితులకు అమలులోకి తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అధికార పార్టీ భారత రాష్ట్ర సమితికి చెందుతుందని అనుకుంటున్నారు.పథకం అమలు విధివిధానాలు అనుసరించ వలసిన తీరును ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసి  దళిత సామాజిక వర్గానికి అందజేస్తున్న విషయం విదితమే.

 అన్ని రాష్ట్రాల్లో పథకం అమలుకు డిమాండ్‌…
‌ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ  తెలంగాణ రాష్ట్ర సమితి  జాతీయ పార్టీగా రూపాంతరం చెంది  భారత రాష్్ర‌  ‌సమితిగా మారడం భారత రాష్్ర‌ ‌సమితి దళిత బంధు పథకం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని దేశంలోని దళిత సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం  .కేంద్ర ప్రభుత్వం  కూడా దళిత బంధువు అన్ని రాష్ట్రాల్లో అమాలు చేయాలని భారత రాష్్ర‌ ‌సమితి వర్గాలు అంటున్నాయి .పార్లమెంట్‌ ఎలక్షన్‌ ‌లో బి. ఆర్‌.ఎస్‌. ‌పార్టీ అధికారంలోకి వస్తే దళిత బంధు పథకాన్ని దేశ మొత్తం దళితుల సామాజిక వర్గానికి అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆదర్శంగా దేశమంతా అమలు చేస్తామని భారత రాష్్ర‌ ‌సమితి పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నది.

 ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో దళితులకు ప్రాధాన్యత…
దళిత బంధు పథకం కింద మంజూరయ్యే పది లక్షల రూపాయలు కుటుంబ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి లావాదేవీలు నడిపించేందుకు వీలుగా ప్రభుత్వం కేటాయించే ఆర్థికపరమైన టెండర్లలో అన్ని రంగాల మార్కెటింగ్‌ ‌విషయాలలో ప్రత్యేక కోట కింద స్థానం కల్పిస్తుంది. తద్వారా పొందిన సహాయం  నిర్మాణాత్మకంగా ఆర్థికంగా నష్టపోకుండా లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందంటున్నారు . ప్రభుత్వం దళిత బంధువు మంజూరైన సొమ్ము  ఆర్ధిక అభివృద్ధి పథంలోకి  తీసుకు రావడామే కాకుండా సమన్వయంగా  దళిత సామాన్య వర్గానికి వివిధ రంగాల్లో  ప్రోత్సాహం  ప్రాధాన్యత నిస్తుండడం దళితులను సామాజిక ఆర్థిక విధానాల్లో ముందంజలో నిలుపుతుంది  అని అనేవారు లేకపోలేదు.

పథకం అమలుగా పార్టీల ఎజెండాగా ఉంటేనే..
ఇప్పటికిప్పుడు  మొత్తం దళిత వ్యవస్థ కు దళిత బంధువు అందించాలంటే ప్రస్తుతం సాధ్యమయ్యే పని కాకపోయినా పూర్తి కాలం పథకాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఉంటుందని కాబట్టి దళిత బంధువు అమలుకు అన్ని పార్టీలు సహకరించాలి అనుకుంటున్నారు .ఈ దశలో ఇప్పటి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే సరే సరి,. లేకుంటే ఒకవేళ ప్రభుత్వం మారితే పథకాన్ని సాగించేందుకు అన్ని పార్టీలు సంసిద్ధులై ఉండాలి. అప్పుడే బంధువు పథకం దళితుల  సాధికారతకు  పార్టీలు పెద్ద పీట వేస్తూన్నట్లు అవుతుంది. పార్టీలు తమదైన శైలిలో దళిత బంధువుపై ఆసక్తి పెంచుకొని దళిత సామాజిక వర్గానికి నిరంతరం కృషి చేసే ఎజెండాగా దళిత బంధువు పథకం తప్పనిసరి ఉంటేనే ప్రభుత్వాలు  మారినా పథకం ముందు కొనసాగుతుంది లేకుంటే పథకం  లక్ష్యం ముందుకు సాగకపోగా పథకం  ఉద్దేశం, ఆశయం మధ్యస్థంగా ఆగిపోవలసి వస్తుంది అనే అనుమానాలు లేకపోలేదు. అందుకే ఈ పథకం రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు మారినా కొనసాగించే ప్రక్రియ ఉండాల్సిందే  అందుకే  దళిత సామాజిక వర్గం పథకం కొనసాగించే పార్టీల వైపే మొగ్గుచూపుతాయని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

దళిత బంధు ఓటు బ్యాంకు కాకూడదు…
రాజకీయ పార్టీల స్వార్థానికో పార్టీల అనుకూలతకో పథకం  ఏ పార్టీకీ కూడా వోటు  బ్యాంకుగా మారకుండా పార్టీలకతీతంగా దళిత బంధువు అమలుకు పార్టీలు తప్పనిసరిగా ఎజెండాలో పొందుపరచుకొని సాగితేనే దళితుల జీవన విధానాల్లో మార్పలు వస్తాయి.వెనుక బడిన వర్గం నుండి ఉన్నత సామాజిక వర్గంగా మారగలుగుతుంది.పథకం  ఆశయం కేవలం సప్రయోజనాలకు ఉపయోగిస్తే అమల్లో అసమానతలు పొడచూపుతాయేమోనని అనుమానాలు విభిన్న వర్గాల్లో లేకపోలేదు.దళిత బంధు పథకమును నిర్దిష్టంగా సమాజంలోని అన్ని దళిత వర్గాల సహకారంతో చేయుత నిచ్చేవిధంగా ఉన్నపుడే ఈ పథకం లక్ష్యం నెరవేరుతుందని అనుకునే వారు లేకపోలేదు.

 విధివిధానాలను నిశితంగా గమనిస్తున్నవిపక్షాలు
రాష్ట్రంలో మొదలైన   దళిత పథకం పారదర్శకంగా కొనసాగించుటకు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నిస్తున్న మునుముందు ఏ ప్రభుత్వాలు అయినా  దళిత సామాజిక వర్గానికి చేయూత అందించాల్సి ఉంది. పార్టీలకతీతంగా ఈ పథకానికి సహకారాలు అందించాలి.దళిత సామాజిక వర్గానికి  సమాజంలో సమానత్వ విలువలతో ఆర్థిక సామాజిక అంశాల లో అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. పథకం కింద మంజూరయ్యే ఆర్థిక మొత్తం వారి  అభివృద్ధికి అభ్యున్నతికి దోహదపడిలి.. అన్ని రంగాల్లో సరైన క్రమంలో అవకాశాన్ని కల్పించడానికి అధికార పక్షం తో పాటు విపక్షాలు కూడా సామరస్య ధోరణితో పథకాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే దళితులకు ఈ పథకం  ఆశయం నెరవేరుతుంది లేకుంటే కేవలం  పార్టీ లను నిలబెట్టే వోటు  బ్యాంకు గానే మిగిలిపోతుంది అని అనుమానం వ్యక్తం చేసేవారు లేకపోలేదు.
– దాడిశెట్టి శ్యామ్‌ ‌కుమార్‌, ‌వరంగల్‌ ‌జిల్లా
9492097974

Comments (0)
Add Comment