దళిత ధిక్కార స్వరం పి.వి.రావు

పి.వి.రావు గారంటే దళిత ఉద్య మాలలో తెలియని వారె వరూ ఉండరు. ఆయనొక మేధో సంప న్నుడు. అంబేద్కర్‌, ‌పూలే భావజాలాన్ని ముందుకు తీసుక పోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ప్రతీ మాల పల్లె తిరిగారు. కులాల విభజనతో మనువాదులు మన బ్రతుకులలో అశాంతిని ఎలా పెంచుతారో తెలిపి ఎంతో మందిని చైతన్యం చేశారు. పి.వి. రావు పూర్తి పేరు పోతుల విఘ్నేశ్వర్‌ ‌రావు.ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలో దేవగుప్తం గ్రామంలో 10 మే 1949 న జన్మించారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు సాంప్రదాయక ఓటు బ్యాంక్‌ ‌లా ఉన్న పరిస్థితుల్లో, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులను విభజిస్తూ ఆర్డినెన్స్ ‌జారీ చేయడం జరిగింది. అప్పటికే హైదరాబాద్‌ ‌సచివా లయంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న పి.వి. రావు తన ఉన్నతోద్యాగాన్ని వదిలి, ఆర్డినెన్స్ ‌వెనుక గల రాజకీయ కుట్రను ప్రశ్నించారు. అంబేద్కర్‌-‌పూలే సిద్ధాంత పునాదుల మీద జాతిని, నీతిని నిలబెట్టడానికి దళిత ధిక్కార స్వరమై అభినవ అంబేద్కర్‌ ‌గా మారాడు. దళితుల ఐక్యత కోసం, రాజ్యాధికార సాధన కోసం 1997లో మాలమహానాడు ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించాడు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా దళితుల ఐక్యతకు అలుపెరగని పోరాటాలు నిర్వహించాడు.

రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలపై సమర శంఖం పూరించి రాజ్యానికి ఎదురు నిలిచాడు. అవిశ్రాంత శ్రమతో ఆంద్రప్రదేశ్‌ అం‌తటా వేల కొద్ది సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. తన పదునైన వాగ్దాటితో దళిత చైతన్యాన్ని వ్యాప్తి చేశారు. ఆనాడు అసమానతలను, అంట రానితనాన్ని ప్రశ్ని ంచి, విచ్ఛిన్న మవుతున్న జాతిని ఐక్యం చేసిన అంబే ద్కర్‌ ‌స్పూర్తితో పి.వి.రావు ఉద్యమాలకు అంకితమై 80 లక్షల మంది మాలల ప్రతినిధిగా నాయకత్వం వహించారు. అనైక్యత వల్ల జరిగే నష్టాలను లెక్కలతో సహా వివరిస్తూ విభజనను తిప్పికొట్టడమే కాకుండా, కులాల మధ్య చిచ్చుపెట్టిన పచ్చ పార్టీని గద్దె దింపే వరకు వదల్లేదు. రాజకీయ కుట్రలను ఒకవైపు ఉద్యమాల ద్వారా ఎదిరిస్తూనే ఇంకోవైపు న్యాయస్థానాల్లోనూ పోరాడారు. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో జు•చిన్నయ్య ద్వారా కేసు వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ‌లో జరిగిన •• వర్గీకరణ రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15, 16 ‌లకు విఘాతమని, సూక్ష్మ వర్గీకరణ చెల్లదని 11 నవంబర్‌ 2004 ‌న అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పునిచ్చింది.

ఈ తీర్పు వెనుక పి.వి. రావు గారి కఠోర శ్రమ దాగి ఉంది. దీనికోసం ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు. దళితుల విభజన కుట్రలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సంధర్భంగా చీమలదండులా లక్షలాదిమంది తరలివచ్చారు. పోలీసుల దాడుల్లో నలుగురు కార్యకర్తలు చనిపోగా పి.వి.రావు గారు తీవ్రంగా గాయపడి, అంబేద్కర్‌ ‌విగ్రహం సాక్షిగా దళితుల ఐక్యత కోసం రక్తం చిందించారు. అయినా మొక్కవోని ధైర్యంతో చివరి శ్వాస వరకు వర్గీకరణ పేరుతో జరిగే రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కూడా జరుగుతున్న వర్గీకరణ కుట్రలను తిప్పికొట్టడానికి ఢిల్లీలో ఉండగా 22 డిసెంబర్‌ 2005 ‌న గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణం దళిత లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. హక్కుల సూరీడుని కోల్పోయిన అనాథలుగా మిగిలిపోయింది. తదనంతరం మాలమహానాడు చీలికలు పేలికలుగా తయారైంది.

నాయకత్వాల మధ్య విభేదాలతో మాలమహానాడు ఆంధ్ర, తెలంగాణ లుగా విడిపోయింది. అంతమాత్రమే కాకుండా వ్యక్తుల పేర్లతో గల్లీకొక సంఘం పుట్టుకొచ్చాయి. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఎంత విచ్ఛిన్నం ఐపోతుందో పి.వి.రావు గారి మరణంతో మాలమహానాడు పరిస్థితి అలా తయారైంది. నాయకత్వాల మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది. ఉద్యమాలకు నాడు ఒక్కరికి సమాచారమిస్తే పదుల సంఖ్యలో వచ్చేవారు కానీ, నేడు పది మందిని పిలిచినా ఒక్కరు అయినా వస్తారనే నమ్మకం లేకుండా పోతుంది. ఎన్నికలొచ్చినప్పుడు పుట్టుకొచ్చే సంఘాలు కొన్నైతే , జాతి ప్రయోజనాలను విస్మరించి ప్రభుత్వాలకు భజన చేసేవి మరికొన్ని. దళిత ఉద్యమాలను స్వలాభాలకు వాడుకొని వ్యాపారంగా మర్చినవి ఇంకొన్ని. నిజాయితీ గా కొన్ని సంఘాలు పనిచేస్తున్నప్పటికీ వాటికి మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. ఈ సంధర్భంలో పి.వి.రావు ఆదర్శాల వెలుగులో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జాతి ఐక్యతను కాపాడిన ఆయన త్యాగాల పునాదుల మీద సంఘాన్ని ఎందుకు నిర్వహించలేము? చెంచాలుగా కాకుండా ఆత్మగౌరవంతో బ్రతుకుదామన్న మాన్య శ్రీ కాన్షిరాం గారి మాటలను ఎందుకు విస్మరిస్తున్నాం? సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ అందరికీ ఉన్నప్పటికీ వాటిని నిజాయితీగా నడిపిస్తూ జాతి ఉన్నతికి కృషి చేయవలసి ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దళిత వ్యతిరేక విధానాలే అమలవుతున్న విషయాన్ని గుర్తించాలి. దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్న నేపధ్యంలో ఐక్యత అనివార్యం అన్న వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ పరిరక్షణ తద్వారా దళిత హక్కుల రక్షణ సాధ్యం అవుతుంది. అది మాత్రమే పి.వి.రావు గారికి దళిత జాతి అర్పించే నిజమైన నివాళి కాగలదు.
(నేడు మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పి.వి.రావు 15 వ వర్ధంతి సంధర్భంగా)

పిల్లి సుధాకర్‌
‌రాష్ట్ర అధ్యక్షులు, మాలమహానాడు, తెలంగాణ. 9959689494.
Ambedkar and PooleDalit movementideologyintellectualjoint state of Andhra Pradesh
Comments (0)
Add Comment