వాసాలమర్రి దళితులకు రూ.7.60 కోట్లు విడుదల
తెలంగాణలో దళిత బంధు అమలు మొదలయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామం నుంచి ఈ పథకం ప్రారంభించారు. దీనికి సంబంధించి గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాసాలమర్రిలో అర్హులైన 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేశారు.
బుధవారం వాసాలమర్రి పర్యటనకు వొచ్చిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇవాళ ఆ నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకానుంది.