రాష్ట్రంలో నిలకడగా రోజువారీ కొరోనా కొత్త కేసులు

తాజాగా 189 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. క్రితం రోజు 193 కేసులు నమోదవగా తాజాగా గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 189 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 137 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 77 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో12, భదాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌, ‌వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలలో 10 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,76,376 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,995కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,68,701 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,680గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

prajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment