‌ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

  • వర్షాలపై సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌తో సిఎం కెసిఆర్‌ ‌సమిక్ష
  • జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ ‌టెలీ కాన్ఫరెన్స్

గులాబ్‌ ‌తూఫాన్‌ ‌ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్‌ను సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్‌ ‌పేర్కొన్నారు. భారీ వర్షాలపై కెసిఆర్‌ ‌సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌తో సోమవారం సమిక్ష చేశారు. పోలీస్‌, ‌రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని కెసిఆర్‌ ‌సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో సిఎస్‌తో పాటు డిజిపి మహేందర్‌ ‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్‌ ‌సిఎస్‌ ‌సునీల్‌ ‌శర్మ, పంచాయతీ రాజ్‌ ‌శాఖ కార్యదర్శి సందీప్‌ ‌సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ ‌బొజ్జ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశిం చారు. జిల్లాలో రెవిన్యూ, పోలీస్‌, ‌పంచాయితీ రాజ్‌, ‌నీటిపారుదల, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగ కుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్‌ ‌కుమార్‌ ‌స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్‌, ‌కొత్తగూడెం, వరంగల్‌ ‌లలో ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసి, ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ ‌రూమ్‌కు అందించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు,చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికకారులను నియమించి పరిస్థితులను సమిక్షించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. డిజిపి ఎమ్‌. ‌మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్‌ ‌కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల పోలీస్‌ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ‌నిర్వహించడం జరిగిందని మహేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Bharat Bandh live updatesCS‌ Tele Conference with District Collectorsprajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment