పైసా వసూల్ ..!

ఇక కొరోనా విపత్తు ముంగిట మానవాళి నిలబడి ఉన్న ఈ సమయంలో కరోనా చికిత్సకు కీలకమైన మందు రెమిడెసివర్‌ను బ్లాక్‌ ‌మార్కెట్‌లో అమ్ముకుంటున్న తీరు బాధ కలిగిస్తుంది. రోగికి రెమిడెసివర్‌ ఇం‌జక్షన్‌ ఇస్తే గాని ప్రాణాలు దక్కవు అని బంధువులకు భయాందోళనలకు గురి చేసి…తీరా వారు తలతాకట్టుపెట్టి తీసుకువచ్చిన ఇంజక్షన్‌ను రెట్టింపు ధరకు బ్లాక్‌లో అమ్ముకుంటున్న వైనం విశాఖలో బయటపడింది. విజిలెన్స్ అధికారుల దాడుల్లో కొంత మంది వైద్య సిబ్బంది రెడ్‌ ‌హ్యాండెడ్‌గా దొరకటంతో నిర్ఘాంత పోవాల్సి వచ్చింది.

కొరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచి విజృంభిస్తోంది. దేశంలో కొరోనా కేసులు రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతున్నాయి. ప్రస్తుతం మూడు లక్షల మార్క్ ‌దగ్గర ఉన్నాం. మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నా…మరణాల రేటు గతంతో పోల్చితే తక్కువగానే ఉన్నాయని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే. ఒక వైపు గత కొంత కాలం నుంచి వ్యాక్సినేషన్‌ ‌ప్రక్రియ కొనసాగుతూనే ఉంది…అయినా కరోనా సెకెండ్‌ ‌వేవ్‌ ‌దూకుడు ఎక్కడా తగ్గటం లేదు. హాస్పటళ్ళల్లో బెడ్లు, ఆక్సిజన్‌, ‌వెంటిలేటర్ల తీవ్ర కొరత ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్‌ ‌కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని ప్రైవేటు హాస్పటళ్ళు దోపిడికి  ద్వారా తెరవటం అమానవీయం.

గత ఏడాది కొరోనా కోరల్లో చిక్కుకుని యావత్‌ ‌మానవళి విలవిల్లాడింది. మన దేశంలో మార్చి నెల నుంచి మొదలై మే, జూన్‌, ‌జులై నెలల్లో పతాక స్థాయికి చేరి  ఆ తర్వాత నెమ్మదించింది. తక్కువ కేసులు నమోదవుతూ ఉండటంతో లాక్‌డౌన్‌ ‌బంధనాల నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటకు తెచ్చాయి ప్రభుత్వాలు. నెమ్మదిగా ప్రజలు కూడా కొరోనాతో సహజీవనం తప్పదు అనే ధోరణికి అలవాటు పడ్డారు. సరే క్యాలెండర్‌ ‌మారింది. పరిస్థితి మారుతుంది అనుకుంటున్న సమయంలో కొరోనా 2.0 లాగా మరోసారి విరుచుకుపడుతోంది. కొరోనా వైరస్‌ ‌జన్యు పదార్ధంలో పరివర్తనాల (మ్యూటేషన్స్) ‌వల్ల అనేక కొత్త వేరియంట్స్ ఇప్పుడు రాజ్యం ఏలుతున్నాయి. మ్యుటేషన్‌ అయిన కొరోనా వైరస్‌ ‌వల్ల ఏమో ఈసారి కొరోనా బారిన పడిన రోగుల లక్షణాలు గతంలో కంటే వేరుగా ఉంటున్నాయి. ఆరోగ్యం పై చూపిస్తున్న తీవ్రత కూడా ఎక్కువగానే  ఉంటోంది. వైరస్‌ ‌వేగంగా విస్తరిస్తోంది. దీనితో హాస్పటళ్ళ పై ఒత్తిడి పెరుగుతోంది. ఉన్న మౌలిక సదుపాయాలు సరిపోవటం లేదు. ఊపిరితిత్తుల పై తీవ్ర ప్రభావం పడుతుండటం, త్వరగా ఇన్ఫెక్షన్‌ ‌విస్తరిస్తుండటంతో ఆక్సిజన్‌కు డిమాండ్‌ ‌పెరుగుతోంది. అయితే ఐసీయూ, వెంటిలేటర్‌ ‌వంటి సదుపాయాలు అవసరానికి తగినంతగా లేవు. ఇవన్నీ వాస్తవాలే. ఇటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఏ దేశంలో అయినా ప్రభుత్వాలు ఒక్కటే విపత్తును ఎదుర్కోలేవు. వ్యక్తులు, సంస్థలు ఒక్క మాటలో చెప్పాలంటే యావత్‌ ‌సమాజం ముందుకు రావాలి. సహాయం చేయకపోవటం అటు ఉంచి…వ్యక్తుల నిస్సహాయతను కాసుల రూపంలో మలుచుకోవాలనే ప్రయత్నం ఆక్షేపణీయం. కొన్ని ప్రైవేటు హాస్పటళ్ళు ఇదే  చేస్తున్నాయి.

ప్రాణం కంటే పైసలే ముఖ్యమా

కొరోనా బారిన పడి ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లి చికిత్స పొందాలంటే లక్షల రూపాయలు చేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి ఇవాళ దాదాపు అన్ని చోట్ల కనిపిస్తోంది. లక్ష రూపాయలు కడితే కాని కొన్ని ప్రైవేటు హాస్పటళ్ళల్లో బెడ్‌ ‌కూడా దొరకని దుస్థితి ఇవాళ కనిపిస్తోంది.  ఐదు రోజుల చికిత్సకు రెండున్నర లక్షలు, మూడున్నర లక్షల చొప్పున వసూలు చేస్తున్నాయి. కొన్ని హాస్పటల్స్ ‌జలగలకు మాకు తేడా లేదు అన్నట్లు ఒక రోజుకే లక్షకు పైగా వసూలు చేస్తున్నాయి. మరో అంశం కూడా కొంత మంది బాధితుల నుంచి వినిపించింది. ఇలా కట్టించుకున్న డబ్బులకు చాలా సందర్బాల్లో బిల్స్ ‌కూడా ఇవ్వటం లేదు.  వెంటిలేటర్‌ అవసరం ఉన్న పేషెంట్‌, 60, 70 ఏళ్లు పై బడిన వారైతే ఆసలు వదులుకోవాల్సిందే అన్నట్లు ఉంటోంది వీళ్ళ ధోరణి. చాలా హాస్పటల్స్ ‌కరోనా ప్రమాణాలు పాటించటం లేదు. ఓపీల్లో కొరోనా పాజివ్‌ ‌పేషెంట్లకు, సాధారణ వ్యక్తుల మధ్య ఏ మాత్రం తేడా చూపని వైఖరి. శానిటైజేషన్‌ ‌కూడా కొన్ని హాస్పటళ్ళల్లో నామ మాత్రంగానే ఉంటోంది. ఇక కొరోనా విపత్తు ముంగిట మానవాళి నిలబడి ఉన్న ఈ సమయంలో కరోనా చికిత్సకు కీలకమైన మందు రెమిడెసివర్‌ను బ్లాక్‌ ‌మార్కెట్‌లో అమ్ముకుంటున్న తీరు బాధ కలిగిస్తుంది. రోగికి రెమిడెసివర్‌ ఇం‌జక్షన్‌ ఇస్తే గాని ప్రాణాలు దక్కవు అని బంధువులకు భయాందోళనలకు గురి చేసి…తీరా వారు తలతాకట్టుపెట్టి తీసుకువచ్చిన ఇంజక్షన్‌ను రెట్టింపు ధరకు బ్లాక్‌లో అమ్ముకుంటున్న వైనం విశాఖలో బయటపడింది. విజిలెన్స్ అధికారుల దాడుల్లో కొంత మంది వైద్య సిబ్బంది రెడ్‌ ‌హ్యాండెడ్‌గా దొరకటంతో నిర్ఘాంత పోవాల్సి వచ్చింది.

ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించాల్సి వచ్చినప్పుడు ఆ మాత్రం డబ్బులు డిమాండ్‌ ‌చేయటం తప్పెలా అవుతుంది అని. ప్రభుత్వాలు అన్ని కోణాల్లోనూ, అన్ని రకాల రిస్కులు పరిగణలోకి తీసుకునే ధరలు నిర్ణయిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే పది శాతమో, 20 శాతమో ఎక్కువ వేసుకుని ప్రైవేటు హాస్పటళ్లు వసూలు చేసుకుంటే పర్వాలేదు. కాని 400 వందల రెట్లు, ఐదు వందల రెట్లు, కొంత మంది ఇంకా ఎక్కువ ఛార్జ్ ‌వేస్తే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఏమవుతాయి? కరోనా నుంచి కోలుకున్నా…ఆర్ధికంగా కోలుకోగలగుతారా? వాళ్ళను ఆదుకునేదెవరు? మనుషులుగా ఇవన్నీ ఆలోచించాలి. విపత్తువేళ బాధ్యత పంచుకోవాలి.

Comments (0)
Add Comment