దేశంలో నిలకడగా కోవిడ్‌ ‌కొత్త కేసులు

  • తాజాగా కొత్తగా 31,382 మందికి పాజిటివ్‌..318 ‌మంది మృతి
  • 84.15 కోట్ల డోసుల టీకా డోసుల పంపిణీ

దేశంలో రోజువారీ కోవిడ్‌ ‌కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. తాజాగా కొత్తగా 24 గంటల్లో 31,382 మందికి కోవిడ్‌ ‌పాజిటివ్‌గా నమోదు కాగా 318 మంది మహమ్మారికి బలయ్యారు. శుక్రవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా 84.15 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. కాగా దేశవ్యాప్త రికవరీ రేటు 97.78 శాతానికి చేరింది. కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 90వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుత యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,00,162 కాగా దేశంలోని మొత్తం పాజిటివ్‌ ‌కేసుల్లో ఇది 0.89 శాతం. దేశవ్యాప్తంగా కొరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. 24 గంటల్లో 32,542 మంది రోగులు కోలుకోగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,28,48,273 కు పెరిగింది. తాజాగా 24 గంటల్లో మొత్తం 15,65,696 పరీక్షలు నిర్వహించగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 55,99,32,709 పరీక్షలు నిర్వహించారు. వారపు పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉంది.

గత 91 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 23 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 108 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతుంది.

Comments (0)
Add Comment