11మంది ఆ‌ఫ్రికా ప్రయాణికులకు కొరోనా పాజిటివ్‌

ఆం‌దోళనలో అధికారులు
హైదరాబాద్‌,‌నవంబర్‌29: ‌సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు. నవంబర్‌ 25,26,27 ‌తేదీల్లో హైదరాబాద్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. దీంతో చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా కొరోనా కొత్త వేరియెంట్‌ ‌కేసులున్న 12 దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన వారందరికీ ప్రత్యేక వైద్య బృందాలు ఆర్టీపిఎస్‌  ‌టెస్టులు చేశాయి. ఇందులో ఇప్పటికైతే 11 మందికి పాజిటివ్‌ అని తేలడంతో మరింత భయాందోళన నెలకొంది. కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌యావత్తు  ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్‌ ‌నెమ్మదిగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది.

బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్‌, ఇ‌జ్రాయెల్‌, ఆస్టేల్రియా, నెదర్లాండ్స్ ‌సహా మరికొన్ని దేశాల్లో ఇప్పటికే కలకలం సృష్టిస్తోంది. దీంతో అన్ని దేశాలు  అలర్టయ్యారు. కొన్ని దేశాలైతే విదేశీ రాకపోకలను నిషేధించాయి. మరికొన్ని దేశాలు పలు ఆంక్షలు విధించాయి. డిసెంబర్‌ 15 ‌నుంచి విదేశీ విమానాలను అనుమతిస్తామని ప్రకటించిన ఇండియా కూడా నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం హైదరాబాద్‌  ‌చేరుకున్న వారికి పాజిటివ్‌ అని తేలడంతో మరింత భయం ఏర్పడింది. వీరి నమూనాలను సిసిఎంబికి పంపారు.

11 African travelersCorona positiveOmicron virusOmikren virus updatedPrajatantra news paper
Comments (0)
Add Comment