రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 647 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 647 కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 749 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 81 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 76 కేసులు, ఖమ్మం జిల్లాలో 58 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,40,659 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,780కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,27,254 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 9,625గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

andhrapradeshCorona new casesprajatantra newstelanganatelugu articlestelugu facts
Comments (0)
Add Comment