రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 315 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 315 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 340 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 83 కేసులు నమోదవగా, వరంగల్‌ అర్బన్‌, ‌నల్లగొండ జిల్లాలలో 21 కేసులు, కరీంనగర్‌ ‌జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,60,786 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,891కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,51,425 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 5,470గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ap updatesCorona Updates In TelanganaPrajatantratelangana updatestelugu articlestelugu cartoonstelugu epaper read
Comments (0)
Add Comment