దేశంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

తాజాగా 12,729 మందికి పాజిటివ్‌..221 ‌మంది మృతి
దేశంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో 12,729 మందికి కొరోనా పాజిటివ్‌ ‌గా నమోదయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో 221 మంది మరణించగా ఇప్పటి వరకు మొత్తం 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కొరోనా నుంచి కోలుకున్నారు.

కాగా, 2020, మార్చి తర్వాత యాక్టివ్‌ ‌కేసుల రేటు కనిష్టానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ ‌కేసులు 0.43 శాతంగా ఉండగా, కొరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగింది. తాజాగా 12,165 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,70,46,116 కొరోనా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

prajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment