విలవిల్లాడుతున్న అగ్రరాజ్యం అమెరికా

  • దేశం మొత్తం లాక్‌డౌన్‌ అసాధ్యమంటున్న ట్రంప్‌
  • న్యూయార్క్‌లో రోగులకు చికిత్సకు వైద్యుల కొరత

‌కరోనా రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌హెచ్చరించారు. వచ్చే కొద్ది వారాల్లో కోవిడ్‌ 19 ‌మృతులు భయంకరంగా నమోదవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశాన్ని లాక్‌డౌన్‌ ‌చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అమెరికాని లాక్‌డౌన్‌ ‌చేయడం వల్ల కరోనా వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రతను అరికట్టవచ్చు, దేశాన్ని నాశనం చేయలేమన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకి చికిత్స చెయ్యాలే తప్ప నివారణ మార్గాల వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఉండదని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. కరోనా విశ్వరూపం చూస్తున్న న్యూయార్క్‌లో రోగులకు చికిత్స అందించడానికి వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో లైసెన్స్ ‌కలిగిన వైద్య సిబ్బంది సాయానికి రావాలంటూ నగర మేయర్‌ ‌బిల్‌ ‌పిలుపునిచ్చారు. ఏప్రిల్‌, ‌మే నెలల్లో 45 వేల మంది వైద్య సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. మిలటరీలో పనిచేసే వైద్య సిబ్బందిలో వెయ్యి మందిని అత్యవసర సేవల కోసం న్యూయార్క్‌కు పంపించారు. వెంటి లేటర్లకు కొరత ఏర్పడడంతో న్యూయార్క్ ‌నగరానికి చైనా వెయ్యి వెంటిలేటర్లను పంపింది. మొత్తం 17 వేల వెంటిలేటర్లు అవసరం ఉందని మేయర్‌ అం‌టున్నారు. ఇకపోతే ఇప్పటికే వివిధ దేశాల్లో రోగులకు చికిత్స అందించడానికి ఆస్పత్రులు సరిపోవడం లేదు. రేయింబగళ్లు పనిచేయలేక వైద్యులు అలిసిపోతున్నారు.

ప్రపంచ దేశాల్లో ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మృతులు స్పెయిన్‌లో నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే 674 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 13 వేలకు చేరువలో ఉంది. కేసులు లక్షా 40 వేలు దాటేశాయి. ప్రపంచానికి కంటిద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌పై యుద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని అమెరికా, భారత్‌ ‌నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌, ‌భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్‌ ‌సంభాషణలో పలు అంశాలపై చర్చించుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేద వైద్యవిధానం ప్రాముఖ్యతపైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్‌19 ‌రోగులకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ‌మందుల్ని పంపించాలని ట్రంప్‌ ‌కోరారు.మలేరియా వ్యాధిని అరికట్టే క్లోరోక్విన్‌ ‌టా•-లబెట్లు కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తూ ఉండడంతో అమెరికా కొన్నాళ్ల క్రితమే భారత్‌కి ఆర్డర్‌ ‌పెట్టుకుంది. భారత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్లోరోక్విన్‌ ఎగుమతుల్ని ఈ నెల 4న భారత్‌ ‌నిషేధించింది. దీంతో ట్రంప్‌ ‌ఫోన్‌ ‌చేసి మోదీతో మాట్లాడారు. తమ కంపెనీలు ఆర్డర్‌ ‌చేసిన క్లోరోక్విన్‌ ‌మాత్రల్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌ ‌క్లోరోక్విన్‌ ‌మాత్రలను భారీ స్థాయిలో తయారు చేస్తోంది. నా విజ్ఞప్తిపై భారత్‌ ‌సీరియస్‌గానే ఆలోచిస్తోందని అన్నారు.

america corona virusdonald trumph
Comments (0)
Add Comment