కాంగ్రెస్‌ ‌ఖాళీ కావడం ఖాయం

టిఆర్‌ఎస్‌ ‌నుంచి కూడా భారీగా చేరికలు
21న అమిత్‌ ‌షా సమక్షంలో రాజగోపాల్‌, ‌దాసోజుల చేరిక
వి•డియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 5 : ఈనెల 21న మునుగోడు సభలో రాజగోపాల్‌ ‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ ‌సహా పలువురు నాయకులు బీజేపీలో చేరతారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. సిద్దిపేట మురళీయాదవ్‌, ‌రాజయ్య యాదవ్‌, ఎ‌ర్రబెల్లి ప్రదీప్‌ ‌రావులు కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌కనుమరుగవుతోందని.. త్వరలోనే టీఆర్‌ఎస్‌ ‌కూడా ఖాళీ అవుతుందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ ఇనుప కంచె వేశాడని ఆరోపించారు. పెన్షన్‌ ‌కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రులు ఉన్నారన్నారు.

హుజురాబాద్‌లో ఓ టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు చిల్లర వేషాలు వేస్తున్నాడని.. ప్రజలే అతడికి తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. గురుకులాలతో పాటు కస్తూర్బ బాలిక విద్యాలయాలు సహా బాసర ట్రిపుల్‌ ఐటీలో నాణ్యమైన ఫుడ్‌ ‌పెట్టడం లేదని ఈటల ఆరోపించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫుడ్‌ ‌పాయిజన్‌ అనే వార్తలు ఎప్పుడు వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ ‌మనవడు తిన్న ఫుడ్‌ ‌గురుకులాల్లో పెడుతున్నామని చెప్తున్నారని..కేసీఆర్‌ ‌మనవడిని కొన్ని రోజులు గురుకులాలకు పంపాలని అన్నారు.

గురుకులాల్లో పెట్టే ఫుడ్‌ ‌తో బావితరాలు ఎలా ఆరోగ్యంగా ఉంటారని ప్రశ్నించారు. గురుకులాల టీచర్లతో కేసీఆర్‌ ‌వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఈటల ఆరోపించారు. గురుకులాలు, బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళదామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. అయినా కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో చలనం లేదని విమర్వించారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment