ముగిసిన రైతుల ఆందోళన

  • ఏడాదిపాటు సాగిన ఉద్యమం
  • రైతులకు హాపత్రం అందించిన కేంద్రం
  • సరిహద్దుల్లో టెంట్లను తొలగించే పనుల్లో రైతులు
  • హాలు నెరవేరకుంటే మరోమారు ఉద్యమిస్తామని వెల్లడి

‌సుదీర్ఘ కాలంపాటు సాగిన రైతుల నిరసనలు ముగిశాయి. రైతులు ప్రభుత్వం ముందు ఉంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఈ ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతుల అన్ని డిమాండ్లను నెరవేర్చేందుకు భారత ప్రభుత్వం నుంచి హా లభించడంతో నిరసనలను విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అయితే హాలను నెరవేర్చ కుంటే తిరిగి ఆందోళనకు వెనకాడబోమని రైతు సంఘాలు హెచ్చరించాయి. కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు, రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించడంపై ప్రభుత్వం ఓ లేఖను రైతు సంఘాలకు అందజేసింది. తాము డిసెంబరు 11 శనివారం తమ నిరసన కార్యక్రమాలను విరమించి, తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటామని రైతు సంఘాలు గురువారం ప్రకటించాయి.

రైతులు వెనక్కి వెళితేనే కేసులు ఎత్తేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో రైతులు కూడా పట్టువిడిచి ముందుకు కదిలారు. శనివారం ఉదయం 9 గంటలకు సింఘు, టిక్రి నిరసన స్థలాల వద్ద విజయోత్సవ కవాతును కూడా నిర్వహించ నున్నట్లు తెలిపాయి. ఈ నెల 13న పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ‌స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించాలని పంజాబ్‌ ‌రైతులు నిర్ణయించారు. ఈ క్రమంలో రైతు సంఘం నేత.. రాకేశ్‌ ‌టికాయత్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు విరమించడం లేదని.. వాయిదా మాత్రమే వేస్తున్నామని రైతు సంఘాల అధికార ప్రతినిధి రాకేశ్‌ ‌టికాయత్‌ ‌వెల్లడించారు. అయితే డిమాండ్లు పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళన లను ఇతర రాష్టాల్ల్రో వివిధ రూపాల్లో కొనసాగిస్తామని స్పష్టంచేశారు. హెలికాప్టర్‌ ‌ప్రమాదంలో చనిపోయిన సైనికుల కుటుంబాలను పరామర్శిస్తామని టికాయత్‌ ‌వెల్లడించారు. దీంతోపాటు జనవరి 11న మరోసారి సమావేశం కావాలని కూడా రైతు సంఘాలు నిర్ణయించాయి. దీంతో 378 రోజుల పాటు ఢిల్లీలో కొనసాగిన రైతు ఆందోళనకు బ్రేక్‌ ‌పడింది. సంయుక్త కిసాన్‌ ‌మోర్చా సమావేశం అనంతరం రైతు నేత గుర్నామ్‌ ‌సింగ్‌ ‌చరుని గురువారం డియాతో మాట్లాడుతూ, మా ఆందోళనను నిలిపివేయాలని నిర్ణయించాం.

జనవరి 15న సక్షా సమావేశం నిర్వహిస్తాం. ప్రభుత్వం తన హాలను నిలబెట్టుకోకపోతే, మా ఆందోళనను పునరుద్ధరిస్తామని చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతు సంఘాలకు పంపించిన ఈ లేఖలో పేర్కొన్న అంశాలు ఏమిటంటే, నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించేందుకు ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌హర్యానా ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి.

అదేవిధంగా ఇటువంటి కేసులను ఉపసంహరించాలని ఇతర రాష్టాల్రను కూడా కేంద్రం కోరనుంది. నిరసన కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంపై ఉత్తర ప్రదేశ్‌, ‌హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు సూతప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఎంఎస్‌పీపై కమిటీలో సంయుక్త కిసాన్‌ ‌మోర్చా సభ్యులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఎంఎస్‌పీపై ప్రస్తుత విధానం కొనసాగుతుంది.

విద్యుత్తు బిల్లుపై సంబంధితు లందరితోనూ, సంయుక్త కిసాన్‌ ‌మోర్చా తోనూ చర్చించిన తర్వాత మాత్రమే పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ ‌చేసిన సంగతి తెలిసిందే. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి, ఈ చట్టాలను రద్దు చేసింది. ఈ ఉద్యమం సుమారు 370 రోజులపాటు జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళన లను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అయితే పూర్తి విరమణ కాదని, తాత్కాలికంగానే విరమించినట్లు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా నేత గురునామ్‌ ‌సింగ్‌ ‌చౌరానీ పేర్కొన్నారు. జనవరి 15న మరోసారి సమావేశమవుతామని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తమకు కొన్ని హాలను ఇచ్చిందని, అందుకే తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హాలను నెరవేర్చని పక్షంలో మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని మరో రైతు నేత బల్వీర్‌ ‌రాజేవాల్‌ ‌కూడా నొక్కి చెప్పారు. ప్రస్తుతానికైతే ఢిల్లీ సరిహద్దుల్లో ని సింఘూ బార్డర్‌లోని టెంట్లను తొలగిస్తున్నామని, తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సన్నద్ధమవు తున్నామని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఈ సింఘూ సరిహద్దు ప్రాంతాలను తాము శుక్రవారం సాయంత్రం నుంచి ఖాళీ చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. ఇక 13 న స్వర్ణ దేవాలయానికి వెళ్తామని, 15 కల్లా పంజాబ్‌లోని రైతులు తమ ఉద్యమానికి తాత్కాలికంగా స్వస్తి పలుకుతారని రైతు అశోక్‌ ‌ధావలే పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిసహద్దుల్లో ఏడాదికిపైగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్‌ 19‌న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న ప్రకటించారు. దీంతోపాటు శీతాకాల సమావేశాలు తొలిరోజున లోక్‌సభలో, రాజ్యసభలో వ్యవసాయ చట్టాల రద్దుపై తీర్మానం కూడా జరిగింది. అయితే.. పంటల కనీస మద్దతు ధరపై స్పష్టతనివ్వాలని.. కేసులు ఉపసంహరించుకోవాలని.. ఉద్యమంలో మరణించిన వారికి పరిహారం చెల్లించాలన్న డిమాండ్లతో రైతు సంఘాలు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. వీటిపై కూడా సానుకూలంగా స్పందిస్తామని ఎంఎస్పీ ధరపై కమిటీ వేస్తామని, ఆందోళన విరమించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. రెండ్రోజుల్లో ధర్నా ప్రాంతాలన్నింటిని ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా ప్రతినిధులు గురువారం వెల్లడించారు. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించడంతో గత 15 మాసాలుగా చేస్తున్న ఆందోళన విరమిస్తునట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే.. తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ శివార్లలోని సింఘు, ఘాజీపూర్లో ఏడాది నుంచి ఆందోళన చేస్తున్న రైతులు తమ టెంట్లను తొలగిస్తున్నారు.

concernFarmersprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment