ఖమ్మంలో కెజిబివి పాఠశాల భవనం ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం రూరల్‌ ‌మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఎస్‌ఎస్‌ఎ ‌నిధులు రూ. 2.05 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స ర్కారు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. కార్పోరేట్‌ ‌విద్యకు ధీటుగా ప్రభుత్వ బడులు ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. కెజిబివిల్లో మౌలిక వసతుల కల్పించి మరింత మెరుగైన పలితాల సాధనకు కృషిచేస్తామని చెప్పారు.

తల్లిదండ్రులు కూడా చదువుపట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న ఆడపిల్లలను తప్పక ప్రోత్సహించాలన్నారు. బాలిక విద్యను లోపేతం చేసేందుకే కెజిబివిలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కెజిబివిల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకురావటం అభినందనీయమ న్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్‌రెడ్డి, ఖమ్మం నగర మేయర్‌ ‌డాక్టర్‌ ‌గుగులోతు పాపాలాల్‌, ‌జిల్లా పరిషత్‌ ‌సిఇఓ ప్రియాంక, సర్పంచ్‌లు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Tags: Commencement, KGBV, school building, Khammam, satyanarayanapuram

CommencementKGBVKhammamsatyanarayanapuramschool building
Comments (0)
Add Comment