సిద్దిపేట కలెక్టరేట్, జూలై 24 (ప్రజాతంత్ర విలేఖరి): జగదేవపూర్ మండలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త నర్ర కనకయ్య రోడ్డు ప్రమాదంలో కాలుకొల్పొయ్యాడు. ఈమేరకు కృత్రిమ కాలు కోసం సియం సహాయనిది నుండి 2 లక్షల చెక్కును శనివారం మంత్రి హరీష్‌రావు కనకయ్యకు అందజేవారు. ఈకార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మెన్ గుండా రంగారెడ్డి, సర్పంచ్ రాజేశ్వరి రవి, గ్రామ శాఖ అధ్యక్షుడు అంజయ్య, మందాపూర్ ఉప సర్పంచ్ ముత్యం, గ్రామ కో అప్షన్ సభ్యుడు కనకయ్య పాల్గొన్నారు.