23 న మెదక్ జిల్లా కు సి ఎం కేసీఆర్ ..

సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ప్రారంభం
 విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సహా సహా, జిల్లా ప్రజలందరికి  మంత్రి హరీష్ రావు పిలుపు
మెదక్,ప్రజాతంత్ర,ఆగస్ట్19: 23 న సీఎం కేసీఆర్  మెదక్ జిల్లాలో  సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి హరీష్ రావు తెలిపారు.మెదక్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సీఎం  ఇక్కడికి రావడం సంతోషకరం అని పేర్కొంటూ జిల్లా ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన సీఎం కి కృతజ్ఞతలు తెలిపే సందర్భం ఇది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్ లోకారుణ్య నియామకాల ఉత్తర్వులు పంపిణి ,జూనియర్ పంచాయతీ కార్యదర్శల నియామక ఉత్తర్వులు పంపిణీ , మరియు మైనారిటీ బంధు పథకం లబ్ధిదారులకు ఆర్థిక  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి,
జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ  ఒక పండుగలాగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సహా సహా, జిల్లా ప్రజలందరికి పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్  33 జిల్లాలు ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్లను అద్భుతంగా నిర్మించారు.. మా రాష్ట్రాల్లో సచివాలయం కంటే మీ కలెక్టరేట్లు బాగున్నాయి అని ఇతర రాష్ట్రాల నాయకులు అంటున్నారు అని పేర్కొంటూ జిల్లాలు కావడం వల్ల జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ఏర్పడడం వల్ల ప్రజలకు మరింత సేవలు చేరువైనాయి.. కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండటం వల్ల వేగంగా సేవలు అందుతాయి..ఉమ్మడి పాలనలో కలెక్టరేట్ల పరిస్థితి దారుణంగా ఉండేది..అని మంత్రి హరీష్ రావు అన్నారు.
మెదక్ జిల్లా ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. మెదక్ రైలు తేవడం ఎన్నో ఏళ్ల కల. .ఎంతోమంది హామీలు ఇచ్చారు గాని ఎవరూ నెరవేర్చలేదు. ప్రధానమంత్రిగా, మెదక్ ఎంపీగా ఉండి కూడా ఇందిరా గాంధీ గారు ఉండి నెరవేర్చలేకపోయారు. .కాంగ్రెస్ మాట తప్పినా, మెదక్ జిల్లా ప్రజల కలలు సీఎం కేసీఆర్  నెరవేర్చారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే కలలు కలలుగా గానే ఉంటాయి.కలలు కనడం సాకారం చేసే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్..ఇది  కలనా నిజమా అన్న రీతిలో పనులు జరుగుతున్నాయి..ఇక్కడి పథకాలు చూసి ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు ఆశ్చర్యపోతున్నారన్నారు.
మెదక్ మెడికల్ కాలేజీ కలను సహకారం చేశారు ముఖ్యమంత్రి .
వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయబోతున్నాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపిలది మేకపోతు గాంభీర్యం ప్రజల్లో బలం లేదు.. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు బిజెపి పార్టీకి క్యాడర్ లేదు. కెసిఆర్ కు బిఆర్ఎస్ కు తిరుగులేదు. మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్..టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ లో  ఉంది. లీడర్లు లేకనే దరఖాస్తులు తీసుకుంటున్నారు. .35 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వారికి నాయకులే లేరు. .అని మంత్రి హరీష్ రావు అన్నారు.ఫీజులు వసూలు చేస్తూ దరఖాస్తులు అమ్ముకుంటున్నరు. అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముకున్న పార్టీ రేపు రాష్ట్రాన్ని కూడా అమ్ముతుంది.. కర్ణాటకలో చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అక్కడ ప్రజలు ఎంతో  ఇబ్బంది పడుతున్నారు..అని మంత్రి హరీష్ రావు అన్నారు.
CM KCR to Medak district on 23.prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment