ఆరుతడి పంటలే వేయండి

  • దీంతో రాజకీయ చీడా వదులుతుంది
  • రైతులతో మాటామంతీలో సిఎం కెసిఆర్‌ ‌సూచన
  • గద్వాల నుంచి తిరిగి వొస్తూ పొలాల పరిశీలన

ఆరుతడి పంటలే వేయాలని సిఎం కేసీఆర్‌ ‌రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందని కేసీఆర్‌ అన్నారు. ఆరుతడి పంటల వల్ల భూసారం కూడా పెరగడంతో పాటు అధిక దిగుబడి వొస్తుందన్నారు. పంటలకు డిమాండ్‌ ఉం‌దని, పంట అమ్ముకోవడం కూడా సులువని అన్నారు. వానాకాలంలో వరిపంట వేసుకుని, యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు కేసీఆర్‌ ‌సూచించారు. పంటల సాగుపై కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు..

యుద్ధాలే జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. గద్వాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హైదరాబాద్‌కు తిరిగి వొస్తుండగా..పెబ్బేర్‌ ‌మండలం రంగాపూర్‌లో కాసేపు ఆగారు. జాతీయ రహదారి 44 పక్కన ఉన్న పంట పొలాలను సీఎం పరిశీలించారు. మినుము పంట సాగు చేస్తున్న మహేశ్వర్‌ ‌రెడ్డి, వేరుశనగ వేసిన రాములుతో కేసీఆర్‌ ‌మాట్లాడుతూ పలు విషయాలను చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గర వరి కొనుగోలు చేయనందున రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రైతులతో అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌వెంట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. అంతకు ముందు గద్వాల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ ‌పరామర్శించారు. కృష్ణమోహన్‌ ‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మరణించగా పెద్దకర్మలో సిఎం పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి కేసీఆర్‌ ‌పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణమోహన్‌ ‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌యాస్మిన్‌ ‌బాష, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

CM KCR conversationFarmersGadwalprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment