ఫూలేకు సిఎం జగన్‌ ‌నివాళి

మహాత్మా జ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా…తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పూలే సేవలను కొనియాడారు. మహిళా విద్యకు చేసిన కృషి జాతి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయి రెడ్డి, ఎంపి మార్గాని భరత్‌ ‌రామ్‌ ‌పాల్గొన్నారు.

మరోవైపు … జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్‌ ‌నివాళులర్పించారు.

Comments (0)
Add Comment