హవాలా ముసుగులో నకిలీ కరెన్సీ చలామణి

ముఠాను పట్టుకుని సొమ్ము స్వాధీనం

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 2 : హవాలా ముసుగులో నకిలీ కరెన్సీని అంటగట్టి రూ. 80 లక్షలతో ఉడాయించిన అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు నిందితులను కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి రూ. 72.50 లక్షల నగదుతో పాటు, నకిలీ కరెన్సీని సీజ్‌ ‌చేశారు. హైదరాబాద్‌ అడిషనల్‌ ‌సీపీ ఏఆర్‌ శ్రీ‌నివాస్‌, ‌టాస్క్‌ఫోర్స్ ‌డీసీపీ  రాధాకిషన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెం దిన కన్హయ్య అలియాస్‌ ‌జతిన్‌ ‌హౌరాహలో స్లైడింగ్‌ ‌విం డోస్‌ ‌తయారీ యూనిట్‌ ‌నడుపుతున్నాడు.

సంపాదన సరిపోకపోవడంతో కషన్‌ ‌పద్ధతిలో హవాలా డబ్బు బదలాయింపు మొదలు పెట్టాడు. హవాలా మార్గంలో పంపడానికి నగరానికి చెందిన మహ్మద్‌ ‌యూ నస్‌ ‌రూ. 30 లక్షలు, మాదాపూర్‌ ఐకాన్‌ ‌టెక్నాలజీస్‌ ఇం‌డియా ప్రై. లిమిటెడ్‌ ‌రూ. 50 లక్షలు కషన్‌పై జతిన్‌కు అప్పగించారు. ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని జతిన్‌ ‌పథకం వేశాడు. రూ. 80 లక్షలు కొట్టేయడానికి తన కంపెనీలో పని చేస్తున్న రావామావత్‌ ‌శర్మ అలియాస్‌ ‌మోహన్‌, ‌భరత్‌కుమార్‌, ‌రామకిషన్‌ ‌శర్మతో జతిన్‌ ‌ముఠాగా ఏర్పడ్డాడు. రాజస్థాన్‌లో నకిలీ కరెన్సీని ముద్రించి, ప్రతీ బండిల్‌లో పైన, కింద ఒరిజినల్‌ ‌నోట్లు పెట్టి, లోపల అంతా తెల్ల నోట్లు కేవలం అంచుల్లో మాత్రమే ప్రింటింగ్‌ ‌కనిపించేలా చేశారు.

అలా రూ. 50 లక్షల నకిలీ నోట్ల బండిళ్లను డిసెంబర్‌-28‌న ఐకాన్‌ ‌టెక్నాలజీస్‌ ‌ప్రతినిధులకు, మరో రూ. 30 లక్షల బండిళ్లను పాలిథిన్‌ ‌కవర్‌లో పెట్టి జనవరి ఒకటిన యూనస్‌ ‌ప్రతినిధులకు ఇచ్చా రు. ఆ తర్వాత ఆ ముఠా అక్కడి నుంచి జారుకుంది. ఐకాన్‌, ‌యూనస్‌ ‌ప్రతినిధులు డబ్బు సరిచూసుకునే క్రమంలో నకిలీ నోట్లు, తెల్ల కాగితాలు ఉండటంతో అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్త్‌జోన్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌బృందం రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలు సేకరించి రాజస్థాన్‌ ‌ముఠాను అరెస్ట్ ‌చేసింది. ఆ బృందాన్ని సీపీ అభినందించారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment