ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మల్టి లెవల్ లో అడ్డంకులు ..

  • ఇబ్బందులు పెడుతున్నది: టీఆర్ఎస్ ఎంపీలు
  • లోక్ సభ, రాజ్య సభలో వాకౌట్
  • లోక్ సభలో బిజేపి, టీఆర్ఎస్ ఎంపీల మధ్య అమీతుమీ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,డిసెంబర్ 2: వానా కాలం పంటలో రాష్ట్ర అవసరాలకు పోను, మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రులు పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్రాన్ని కోరారు. ధాన్యం కొనుగోళ్లపై స్పందించాలని గత నాలుగు రోజులుగా పార్లమెంట్ లో ఆందోళన చేస్తోన్న కేంద్ర పట్టించుకోవడం లేదన్నారు. ఉభయ సభల్లో కావాలని వెల్ లోకి వెళ్లడం లేదని, బాధతోనే ఆందోళన చేస్తున్నామన్నారు. కానీ, బిజేపి రాష్ట్ర ఎంపిలు అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా, తెలంగాణ రైతుల కోసం, ప్రజలకోసం అవన్నీ భరిస్తున్నామన్నారు. గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్ లోని గురజాడ హాల్ లో టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. గత యేడాదికి సంబంధించి రాష్ట్ర దగ్గర ఉన్న బాయిల్డ్ రైస్ తో పాటూ, ఈ వానాకాలం లో రాష్ట్ర అవసరాలకు పోను మిగిలింది కేంద్రం కొనుగోలు చేయాలని కేశవరావు అన్నారు. అలాగే, పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు కనీసం మూడేళ్లు పడుతుందని అంతవరకు సమయం ఇవ్వాలన్నారు. తమ నాలుగు రోజుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలనే డిమాండ్ కు సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహంతో రాజ్యసభ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం మల్లిలెవల్స్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని టీఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో రైస్ మిల్లులకు నెలకు 8 లక్షల మెట్రి టన్నుల కెపాసిటీ ఉంటే కేవలం 4, 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికే అనుమతి ఇస్తున్నారని చెప్పారు. ఈ మిల్స్ నుంచి వచ్చిన బియ్యాన్ని ఎఫ్ సిఐ సకాలంలో సేకరించడం లేదని. ఈ బియ్యాన్ని తరలించేందుకు రైల్వే ర్యాకులు అందుబాటులో లేవన్నారు. దీనిపై కల్లాల్లో పంట కొంటామని చెప్పిన ఎంపి సంజయ్ పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ ఎంపీల ద్వంద వైఖరిపై ఫైర్ రైతాంగానికి ప్రయోజనాలిచ్చే అంశంపై రాజకీయామోద్దన్నారు. రైతాంగం సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటంతో రాష్ట్ర బీజేపీ నేతలు కలిసి రావాలని సూచించారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు గురువారం అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మైక్ కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస బాధ్యతగా తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సమావేశం పెడితే అందులో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. లేదా కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పార్లమెంట్లో సంబంధిత మంత్రి ద్వారా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్, బిజేపి కొట్టుకునే దాకా…
ధాన్యం కొనుగోలుపై మాట్లాడేందుకు స్పీకర్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామాకు అనుమతి ఇచ్చారు. ఈ స్పీచ్ కొనసాగుతోన్న సమయంలోనే స్పీకర్ మైక్ కట్ చేశారు. ఇదే సందర్బంలో వారి వెనకాల సీట్లలో కూర్చొన్న బండి సంజయ్ టీఆర్ఎస్ ఎంపీలు, వారి ఆందోళనపై విమర్శలు చేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైందని, యాసంగి పంటను కొనమని ఎవరు చెప్పారంటూ నిలదీశారు. పార్లమెంట్ లోని క్యాంటీన్ లో ఫోటోలు దిగి, ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నామని మీడియాకు పోజులిస్తున్నారన్నారు. ఈ డ్రామాలను ఆపాలని ఎంపి సోయంబాపు రావుతో కలిసి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తీరు, మైక్ కట్ చేయడం, సంజయ్ విమర్శలపై టీఆర్ఎస్ ఎంపీలు అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్ది సేపు లోక్ సభలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్రానికి చెందిన బిజేపి ఎంపీల మధ్య తిట్ల పురాణం సాగింది. టీఆర్ఎస్ ఎంపీలు వారితో తెచ్చుకున్న ప్లకార్డులను చించి వెల్ లో విసిరారు. అనంతరం లోక్ సభ నుంచి వాకౌట్ చేస్తూ బయటకు వచ్చారు.

Central multi-level barriersgrain procurementprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment