దర్యాప్తుకు సుప్రీమ్‌ ‌కోర్టులో కేసు

  • పిటిషన్‌పై నేడు విచారిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం
  • ద్విసభ్య కమిటీ వేసిన పంజాబ్‌ ‌ప్రభుత్వం..గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పంజాబ్‌ ‌బిజెపి
  • పంజాబ్‌ ‌ఘటన వెనక టెర్రరిస్ట్ ‌చర్యలు : హెచ్చరికలు చేసిన ఖలిస్తాన్‌ ‌టెర్రర్‌ ‌గ్రూపు
  • ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు : ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్రపతి కోవింద్‌

న్యూ దిల్లీ, జనవరి 6 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్‌ ‌పర్యటనను ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీమ్‌ ‌కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీమ్‌ ‌కోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ ‌మనిందర్‌ ‌సింగ్‌ ‌పిటిషన్‌ ‌వేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ప్రధాని పర్యటనల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా.. పిటిషన్‌ ‌కాపీలను కేంద్రంతో పాటు పంజాబ్‌ ‌ప్రభుత్వాలకు గురువారమే పంపించాలని న్యాయవాదికి సుప్రీమ్‌ ‌కోర్టు  సూచించింది. పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఇదిలావుంటే ప్రధాని నరేంద్రమోదీ ఫిరోజ్‌పుర్‌ ‌పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై పంజాబ్‌ ‌ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ‌మెహ్‌తాబ్‌, ‌న్యాయ, హోంశాఖల ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి అనురాగ్‌వర్మ ఈ దర్యాప్తు బృందంలో ఉన్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ కమిటీ 3రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ హజరయ్యే సభకు కార్యకర్తలు హాజరవకుండా అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారని  భాజపా పంజాబ్‌ అధ్యక్షుడు అశ్వినీ శర్మ ఆరోపించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్న బస్సులు, ఇతర వాహనాలను సభాస్థలికి చేరకుండా అడ్డుకున్నారని తెలిపారు. మరోవైపు.. ఫిరోజ్‌పుర్‌, ‌కతునంగల్‌, ‌హారికే, కోట్కాపురా, తల్వాండి వంటి 21ప్రాంతాల్లో ఆందోళనకారులు భాజపా కార్యకర్తల వాహనాలకు అడ్డుపడి నట్లు చెప్పారు.

వారు ప్రభుత్వ మద్దతుతోనే ఇలా చేశారని ఆరోపించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాలోపాలపై అశ్వినీ శర్మ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల భాజపా బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.  ఇదిలావుంటే ప్రధానమంత్రి భద్రత విషయంపై వివాదం చెలరేగటం చాలా దురదృష్టకరమని మాజీ ప్రధాని, జేడీఎస్‌ ‌నేత హెచ్‌డీ దేవే గౌడ అన్నారు.. దేశ అత్యున్నత వ్యక్తుల భద్రత అంశంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అంశాల నుంచి నేర్చుకోవాలని సూచించారు.

పంజాబ్‌ ‌ఘటన వెనక టెర్రరిస్ట్ ‌చర్యలు : హెచ్చరికలు చేసిన ఖలిస్తాన్‌ ‌టెర్రర్‌ ‌గ్రూపు
ప్రధాని నరేంద్ర మోడీకి ఖలిస్తాన్‌ ‌టెర్రర్‌ ‌గ్రూప్‌ ‌బహిరంగ హెచ్చరిక చేసింది.  నరేంద్ర మోడీని చంపుతామంటూ సంకేతాలు ఇచ్చాయి ఖలిస్తాన్‌ ‌టెర్రర్‌ ‌గ్రూప్‌. ఇం‌దిరా గాంధీకి పట్టిన గతే నరేంద్ర మోడీకి అంటూ పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. పంజాబ్‌లో జరిగిన ఘటన తమ మొదటి అడుగు అంటూ పేర్కొంది. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగానే ఈ కుట్ర వెనక ఆల్‌ఖైదా హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. నిరసన తెలిపిన వారిలో..ఉగ్రవాద సంస్థలకు చెందినవారెవరైనా ఉన్నారా? అని దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు : ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్రపతి కోవింద్‌
‌ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ సందర్భంగా పంజాబ్‌ ‌పర్యటనలో భద్రతా లోపాలపై మాట్లాడారు. ఈ విషయంపై రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోదీ పంజాబ్‌ ‌పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై మోదీతో ఫోన్‌లో మాట్లాడినట్లు ట్విట్టర్‌ ‌వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా చర్యలపై పఠిష్ఠ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతితో సమావేశం అనంతరం మోదీ ట్విటర్‌ ‌వేదికగా రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు ధన్యవాదాలు తెలిపారు.

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment