నిగూఢ కరెన్సీ నిగ్గు తేల్చలేమా?

‘‘అమ్మకం చేపట్టవచ్చు.దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు.అంటే ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ.ఈ కరెన్సీనిక్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌చైన్‌ ‌టెక్నాలజీ నుంచి తయారు చేస్తారు. దీన్ని హ్యాక్‌ ‌చేయలేరు.. ఇది దెబ్బతినదు. సూటిగా చెప్పాలంటే లేని వస్తువు మీద రూపాయలు పెట్టుబడి పెట్టడం లాంటిది. దీనిపై పెట్టిన రూపాయలే భౌతికంగా కనిపిస్తాయి కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం కనబడదు. ఏప్రిల్‌ 2021 ‌నాటికి ప్రపంచంలో సుమారు10,000కి పైగా వివిధ రకాల క్రిప్టోకరెన్సీలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.అయితే వాటిలో కొన్ని కాయిన్స్ ‌కాగా మరికొన్ని టోకెన్లు. ‘బిట్‌కాయిన్‌, ఆల్ట్‌కాయిన్లు’ వంటివి కాయిన్స్ ‌కిందకు వస్తాయి. వివిధ రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నప్పటికీ వాటిల్లో ‘బిట్‌కాయిన్‌’ ‌మాత్రం చాలా ప్రాధాన్యత సాదించుకుంది. ప్రముఖమైనది.ప్రపంచం అంతా డిజిటల్‌ ‌మయం అవుతున్న తరుణంలో ఈ క్రిప్టో కరెన్సీ కి ప్రాధాన్యత పెరిగింది.ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతున్నారు.’’

ద్రవ్యం ఆవిర్భవించడానికి పూర్వం వస్తువుల వినిమయానికి వస్తువులకు బదులు వస్తువులు పొందే వస్తు మార్పిడి అనగా బార్టర్‌ ‌విధానం అమలులో ఉండేది.ఈ వినిమయంలో తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా కాల క్రమంలో బంగారు,వెండి,రాగి నాణెములను చలమణీలోనికి తీసుకు వచ్చారు.ఆ తరువాత కాగితపు కరెన్సీ ఇలా ద్రవ్య అవిర్భావం తరువాత వినిమయంలో ఉండే అనేక సమస్యలు తగ్గిపోయాయి.ఆ తదుపరి పరిశీలిస్తే కాలానుగుణంగా దేశీయ అంతర్జాతీయ కరెన్సీలలో ఎన్నో మార్పులు వచ్చాయి.. వస్తున్నాయి. అలా కొత్త టెక్నాలజీతో రూపుదిద్దుకున్నదే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్‌ ‌కరెన్సీ. వర్చువల్‌ ‌కరెన్సీ ‘పేటీఎం’, ‘గూగుల్‌ ‌పే’ లాగానే ఇది కూడా ఓ వాలెట్‌. ‌దీన్ని ‘క్రిప్టోగ్రఫీ కరెన్సీ’, ‘ఎన్క్రిప్షన్‌ ‌కరెన్సీ’ అని కూడా పిలుస్తారు. అయితే సాధారణ కరెన్సీలా దీనిని చూడడం లేదా తాకడం సాధ్యం కాదు. ఇది కంటికి కనిపించదు.దీనిని ఏ బ్యాంక్‌ ‌జారీ చేయదు.ఇది ఏ దేశానికి చెందినది కూడా కాదు.కాబట్టి దీనిపై పన్ను ఉండదు.ఇది పూర్తిగా రహస్య కరెన్సీ.ప్రపంచంలో ఎక్కడి నుండైన దీనిని కొనుగోలు చేయవచ్చు అమ్మకం చేపట్టవచ్చు.దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు.అంటే ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ.ఈ కరెన్సీని క్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌చైన్‌ ‌టెక్నాలజీ నుంచి తయారు చేస్తారు.

దీన్ని హ్యాక్‌ ‌చేయలేరు.. ఇది దెబ్బతినదు. సూటిగా చెప్పాలంటే లేని వస్తువు మీద రూపాయలు పెట్టుబడి పెట్టడం లాంటిది. దీనిపై పెట్టిన రూపాయలే భౌతికంగా కనిపిస్తాయి కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం కనబడదు. ఏప్రిల్‌ 2021 ‌నాటికి ప్రపంచంలో సుమారు10,000కి పైగా వివిధ రకాల క్రిప్టోకరెన్సీలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.అయితే వాటిలో కొన్ని కాయిన్స్ ‌కాగా మరికొన్ని టోకెన్లు. ‘బిట్‌కాయిన్‌, ఆల్ట్‌కాయిన్లు’ వంటివి కాయిన్స్ ‌కిందకు వస్తాయి. వివిధ రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నప్పటికీ వాటిల్లో ‘బిట్‌కాయిన్‌’ ‌మాత్రం చాలా ప్రాధాన్యత సాదించుకుంది. ప్రముఖమైనది.ప్రపంచం అంతా డిజిటల్‌ ‌మయం అవుతున్న తరుణంలో ఈ క్రిప్టో కరెన్సీ కి ప్రాధాన్యత పెరిగింది.ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతున్నారు. కారణం ప్రభుత్వ నియంత్రణ లేదు.ప్రభుత్వానికి పన్నులు కట్టనక్కర లేదు.పూర్తి గోప్యత ఉంటుంది.ఈ దిశగా ఈ తరహా కరెన్సీ పై ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ‌పెరుగుతూ ఉంది.చైనా ఇండియా లాంటి దేశాలు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికి చాలా దేశాలు దీనిపై నిషేధం విధించినప్పటికి దీని జోరు మాత్రం తగ్గడం లేదు.కొన్ని దేశాలు అయితే దీనిని చట్టబద్ధం చేశాయి. సెంట్రల్‌ అమెరికాలోని ఎల్‌ ‌సాల్వడార్‌ ‌కాంగ్రెస్‌ 20 ‌జూన్‌ 2021 ‌న బిట్‌కాయిన్‌ ‌చట్టాన్ని ఆమోదించింది. పరాగ్వే దేశం కూడా బిట్‌ ‌కాయిన్‌ ‌కు చట్టబద్ధతను కల్పించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే ఆమోదించినున్నట్లు తెలుస్తోంది.

బిల్లుకు ఆమోదం లభిస్తే అధికారికంగా బిట్‌కాయిన్‌ను అంగీకరించే రెండో దేశంగా పరాగ్వే నిలవనుంది.అంతే కాకుండా అనేక దక్షిణ అమెరికా, ఆఫ్రికన్‌ ‌దేశాలు కూడా క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌కు చట్టపరమైన హోదాపై ఆలోచిస్తున్నాయి.అయితే చైనాతో పాటు చాలా దేశాలు క్రిప్టో కరెన్సీ ని నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాయి.ప్రపంచంలోనే ఎక్కువ ముస్లింలు గల ఇండోనేషియా దేశంలో అయితే ఏకంగా మత పెద్దలు తాజాగా క్రిప్టో కరెన్సీ పై నిషేధం విధించాలి అంటూ ఫత్వా కూడా జారీచేశారు. భారత్‌ ‌కు కూడా ఈ కరెన్సీపై ఏ మాత్రం సుముఖత లేదు. 2018లో రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.ఈ నేపథ్యంలో మన దేశంలో దీని గిరాకీ మరింత పెరిగింది. వీటి లావాదేవీలలో ఏదైనా మోసం జరిగితే న్యాయ పోరాటం జరపడానికి ప్రభుత్వ జోక్యం ఉండదు అని తెలిసినప్పటికి దీనిపై వ్యామోహం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.నలువైపుల నుంచి విమర్శలు వెల్లువలా వచ్చి పడుతున్నప్పటికి కూడా ఈ కరెన్సీ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ ‌చేస్తున్న వారిలో భారత్‌ ‌నెంబర్‌ ‌వన్‌గా నిలిచినట్లు ప్రముఖ బ్రోకింగ్‌ అం‌డ్‌ ‌ట్రేడింగ్‌ ‌ఫ్లాట్‌ఫాం బ్రోకర్‌ ‌చూసర్‌ ‌తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో సుమారు 10.07 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ ‌చేస్తున్నట్లు బ్రోకర్‌ ‌చూసర్‌ ‌పేర్కొంది. సాంకేతికతలో పై చేయి సాధించిన అమెరికాలో మాత్రం 2.74 కోట్ల మందే క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ ‌చేస్తున్నారని తెలియచేసింది.ప్రపంచంలోని వివిధ దేశాల జనాభాతో పోలిస్తే మాత్రం భారత్‌ 7.30‌శాతం ఇన్వెస్టర్లతో ఐదో స్థానంలో నిలిచింది. 12.73 శాతం ఇన్వెస్టర్లతో ఉక్రెయిన్‌ ‌మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ తరహా కరెన్సీ పై పెట్టుబడి పెట్టడం చాలా ఆశ్చర్య కరమైన విషయమే.ఎందుకంటే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనం సాంకేతికంగా వెనుకబడి ఉన్నాం.అంతే కాకుండా సాంప్రదాయంగా మనం బంగారం,రియాల్టీ,ఎఫ్‌డీలలోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇష్టత చూపుతాము. అయితే ఈ రహస్య కరెన్సీ విషయానికి వచ్చేసరికి సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఊహలకు అందని విధంగా పెట్టుబడులు పెడుతూ సంపన్న దేశాలకు ధీటుగా దీనిపై పెట్టుబడుల విషయంలో ప్రపంచంలోనే 5 వ స్ధానంలో నిలబడడం అనేది ఆశ్చర్యదాయకమే.దీనిపై ఎన్ని విమర్శలు ఎదురైనా ఇలా కొనసాగడం అనేది ఉహించని పరిణామం.అయితే స్టాక్‌ ‌మార్కెట్‌, ‌మ్యూచుఫల్‌ ‌ఫండ్స్, ‌బంగారం వంటి కంటే ఎక్కువగా డిజిటల్‌ ‌కరెన్సీపై భారీగా లాభాలను గడించవచ్చునని అంచనాలే భారత ఇన్వెస్టర్లు అనుకోవడం ఒక కారణం కావచ్చునని ఆర్ధిక నిపుణుల అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వాల జోక్యం లేకుండా పూర్తిగా బ్లాక్‌ ‌చెయిన్‌ ‌టెక్నాలజీ ఆధారంగా ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి.ఫలితంగా ఈ మార్కెట్‌ను ఎవరూ కృత్రిమంగా ప్రభావితం చేయలేకపోవడం కూడా ఈ కరెన్సీకి మరొక సానుకూల అంశమని నిపుణుల అభిప్రాయం. అయితే ఇది కూడా సైబర్‌ ‌దాడులకు గురయ్యే అవకాశం లేకపోలేదు.అప్పుడే క్రిప్టో కరెన్సీ అని చెప్పి మోసాలు ప్రారంభం అయ్యాయి.ఈ మధ్యనే హైదరాబాద్‌ ‌లో ఒక వ్యక్తిని ఈ పేరుతో 85 లక్షల రూపాయలు మోసం చేసినట్లు పత్రికల్లో రావడం కూడా జరిగింది. బిట్‌ ‌కాయిన్‌ ‌ద్వారా మోసపోయినా.., ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. బిట్‌కాయిన్‌ ‌సహా ఇతర వర్చువల్‌ ‌కరెన్సీలో ట్రేడింగ్‌ ‌చేసే వారు సొంతంగా రిస్క్ ‌తీసుకోవాలి. నగదుకు బదులుగా బిట్‌ ‌కాయిన్లను అంగీకరించే సంస్థలు కూడా మనదేశంలో లేవు. అంత కన్నా ముఖ్యంగా క్రిప్టోకరెన్సీల వినియోగంతో మనీలాండరింగ్‌, ఉ‌గ్రవాదులకు నిధులు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి నియంత్రణ లేని మార్కెట్లకు అనుమతి ఇవ్వకూడదు అని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ మార్కెట్‌ ఒక జూదం వంటిది. అధిక రాబడులు, పారదర్శకత లేని ఇటువంటి వాటి వలన యువత తప్పుదోవ పట్టడం ఖాయం. దీనిని అదుపు చేయాలి అంటే ఒక దేశం తాను మాత్రమే విధాన నిర్ణయాలు తీసుకుంటే సరి పోదు అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంయుక్త వ్యూహాలు చర్చలు ద్వారా కార్యాచరణకు రాగలిగినప్పుడే దీని కట్టడికి ఒక రూపం తీసుకు రాగలం.

ఈ కరెన్సీని అందిపుచ్చుకోవడం, అలవాటు పడడం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మంచిది కాదని ఇంటర్నేషనల్‌ ‌మానిటరీ ఫండ్‌ (ఐ ఎం ఎఫ్‌ ) ‌కూడా వ్యాఖ్యానిస్తోంది. రిస్క్ ‌లు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతోంది. హాకింగ్‌ ‌కు గురికావడం, నాణేల పంపకంలో పారదర్శకత లోపించడం మొదలైనవి జరిగే ప్రమాదాలు ఈ కరెన్సీలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తోంది.బిట్‌ ‌కాయిన్‌ ‌సృష్టించే ప్రక్రియలో మైనింగ్‌ ‌చేయడానికి విపరీతమైన విద్యుత్‌ ‌వినియోగం అవసరం అవుతుంది.దీని కారణంగానే చైనా లో విద్యుత్‌ ‌సంక్షోభం కూడా సంభవించింది.అందుచేతనే చైనా ప్రభుత్వం దీనిపై నిషేధం దిశగా అడుగులు వేయడం జరిగింది.దానితో పాటు ఈ మైనింగ్‌ ‌లోచాలా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. కొత్త బిట్‌ ‌కాయిన్లు సృష్టించడానికి కఠినమైన అల్గారిథమ్స్ ‌పరిష్కరించాల్సి ఉండగా, ఇందుకోసం శక్తిమంతమైన కంప్యూటర్స్ ఉపయోగిస్తారు. వాటి ప్రాసెసర్లను రోజంతా నడుపుతూనే ఉండాల్సి రావడంతో ఇది చాలా వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో బిట్‌ ‌కాయిన్‌ ‌మైనింగ్‌ ‌కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం 1.3 సంవత్సరాలకు పరిమితం అవడంతో పాటు, మైనింగ్‌ ‌కు ఉపయోగించిన తర్వాత కంప్యూటర్లు పనికి రాకుండా పోవడంతో, ఈ ప్రక్రియలో చాలా ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ విధంగా పర్యవరణానికి కూడా పెనుభారంగా క్రిప్టో కరెన్సీ పరిణమించింది.ఈ కరెన్సీ వలన ఇన్ని సమస్యలు మన ముందు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా దీని డిమాండ్‌ ‌రోజు రోజుకూ పెరిగి పోతూ ఉండటం ఆశ్చర్యదాయకం. దీంతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వ పరంగా ఎలా వ్యవహరించాలి, ఇందులో ఇన్వెస్ట్ ‌చేసే వారికి ఏ తరహా సూచనలు ఇవ్వాలనే భారత ప్రభుత్వం ఆర్ధిక నిపుణులతో చర్చలు జరుపుతు ఉంది.

ముందుగా డిజిటల్‌? ‌రూపీని తీసుకొచ్చేందుకు మాత్రం ఆర్బీఐ ఎక్కువ ప్రయత్నాలు చేస్తోంది.దీని కట్టడి విషయంలో తీసుకోవలసిన చర్యలు విషయమై ప్రభుత్వం రిజర్వ్ ‌బ్యాంకుతో సమాలోచనలు జరపడమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక నిపుణలతో చర్చలు ఆరంభించింది. మరికొన్నేళ్లలో భారత్‌ ‌సొంతంగా డిజిటల్‌ ‌రూపాయిని తీసుకొచ్చి బిట్‌కాయిన్‌, ‌డోజ్‌కాయిన్‌, ఎథరమ్‌ ‌వంటి ప్రైవేట్‌ ‌క్రిప్టో కరెన్సీలకు పోటీ ఇవ్వాలని వ్యూహాలను రచిస్తోంది. వీటి అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలలో ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టడానికి కూడా భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.ఏ మేరకు ఈ వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తాయి అనేదానికి వేచి చూడాల్సిందే.
– రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578.
లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్..ఐ.‌పోలవరం.

articles in onlinebreaking newsCM KCRminister harish raopolitical updatesPrajatantraprajatantra epaper
Comments (0)
Add Comment