కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం

  • కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం
  • ఇసితో భేటీ అయిన టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వినోద్‌, శ్రీ‌నివాసరెడ్డి

కేంద్ర ఎన్నికల సంఘంతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు వినోద్‌ ‌కుమార్‌, శ్రీ‌నివాస్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందించారు. పేరు మార్పును గుర్తించాలని కోరారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వినోద్‌ ‌కుమార్‌ ‌నేతృత్వంలో బృందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయింది. డిప్యూటీ ఎలక్షన్‌ ‌కమిషనర్‌ ‌ధర్మేంద్ర శర్మకు తీర్మానం కాపీ అందించామని వినోద్‌ ‌కుమార్‌ ‌చెప్పారు. చట్టప్రకారం పరిశీలించి అనుమతి ఇస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు.

BRS decision to Central Election Commission
Comments (0)
Add Comment