మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం

  • బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత
  • సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు
  • మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే
  • రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌

రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండల పరిధిలోని పల్లివాడ ఎన్నారం గ్రామాలలో చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు నాయకులు పూలమాలలు శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులను వృద్ధులను చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. రాఖి పౌర్ణమి పురస్కరించుకొని కేక్‌ ‌కట్‌ ‌చేసి మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కు రాఖీలు కట్టారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజల ఉద్దేశించి మాట్లాడారు సృష్టికి మూలం స్త్రీ అని స్త్రీ లేనిదే మనకూడా లేదని అన్నారు. మహిళలకు పార్టీలో పదవులు ఇచ్చిన ఘనత బిజెపి పార్టీ ఒక్కటేనని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని అన్ని రంగాల్లో ముందుకు సాగేలా పూనుకున్న ప్రధాన మోడీకి అందరు రుణపడి ఉంటారని అన్నారు. 8 సంవత్సరాల కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌పాలలో ఐదు సంవత్సరాలు క్యాబినెట్లే మహిళలే లేరని ఎద్దేవా చేశారు. మహిళలకు గర్భిణీలకు పోషకాహారం అందించేందుకు వేలాది కోట్లు వెచ్చించి సరఫరా చేసిన కేంద్రం కిట్టును కేసీఆర్‌ ‌కిట్టుగా మార్చుకొని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు మోడీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.

అనంతరం ఎన్నారం గ్రామ శివారులో కోర్‌ ‌కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ ‌చుగ్‌, అదిలాబాద్‌ ఎం‌పీ సోయం బాబురావు, మాజీ మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి, మాజీ ఎంపీలు పొంగులేటి సుధాకర్‌ ‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి, యాదాద్రి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్‌ ‌రావు, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌, ‌గట్టు శ్రీకాంత్‌ ‌రెడ్డి, బి జే వై ఎన్‌ ‌జిల్లా అధ్యక్షులు ఏలూరి శ్యామ్‌, ‌జిల్లా ఉపాధ్యక్షులు నకిరేకంటి మొగులయ్య, మండల పార్టీ అధ్యక్షులు తాటిపాముల శివకృష్ణ గౌడ్‌,‌జిల్లా నాయకులు కన్నె కంటి వెంకటేశ్వర చారి, డోగి పర్తి సుభాష్‌, ‌కొమ్ము యాదయ్య, యాదాసు లక్ష్మణ్‌, ఏలూరి రవి తదితరులు పాల్గొన్నారు.

పదోరోజు కొనసాగిన బండి పాదయాత్ర
రాఖీ కట్టి కష్టాలు చెప్పుకున్న మహిళలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 10వ రోజు రామన్నపేట మండలంలో సాగింది. అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఉదయమే ఆయన పాదయాత్ర చేపట్టారు.  మండలంలోని పల్లివాడలో పేదల గుడిసెల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. బండి సంజయ్‌ ‌తమ ఇంటికి రావడంతో మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్‌ ‌పాలనలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి మహిళలు బండి సంజయ్‌ ‌కు మొరపెట్టుకున్నారు. తమకు డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇండ్లు కట్టిచ్చి ఇస్తామని బండి సంజయ్‌ ‌భరోసా ఇచ్చారు. అనంతరం పల్లీవాడలో బీజేపీ జెండా ఆవిష్కరించారు.

డ్వాక్రా నిధులు విడుదల చేయండి
సిఎం కెసిఆర్‌కు బండి లేఖ

హైదరాబాద్‌: ‌డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు కేటాయించిన నిధులను రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. సెర్ఫ్, ‌మెప్మా, ఎస్‌జీహెచ్‌లకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. తెరాస ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 2 021-22 బడ్జెట్‌లో మహిళా గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ.3 వేల కోట్లు కేటాయించారని బండి సంజయ్‌ ‌తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదన్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందనే ఆశతో మహిళలు ఎదురుచూస్తున్నారని.. ప్రభుత్వ నిర్వాకంతో రుణాలు తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు.

bjp aimentrepreneursfb telugu newsprajatantra newsTelugu News Headlines Breaking News NowToday Hilightswomen as entrepreneursతెలుగు వార్తలు
Comments (0)
Add Comment