‘ఆయుష్మాన్‌ ‘‌కశ్మీర్‌ ..!

“తిరుగుబాటు శక్తుల కార్యకలాపాల కారణంగా జమ్ముకశ్మీర్‌ అం‌తటిలోనూ దక్షిణ కశ్మీర్‌ అత్యంత కల్లోలిత ప్రాంతం అయినప్పటికీ ఈ స్కీమ్‌ అమలు మాత్రం మొత్తం కేంద్రపాలిత ప్రాంతం అంతటిలోనూ ఒకేలా ఉంది. హృదయం ద్రవింపచేసే కొందరు లబ్ధిదారులకు చెందిన కథనాలు ఈ స్కీమ్‌ ‌ను ఒక ఆశాజ్యోతిగా భావించి అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానించారనేందుకు నిదర్శనంగా నిలిచాయి..”

‌జమ్ము, కశ్మీర్‌, ‌లదాఖ్‌ ‌లలో భరోసానిస్తున్న  ఎబి పిఎం – జెఏవై  
రాజకీయ సంక్షోభానికి కేంద్ర స్థానంగా ఉన్నప్పటికీ కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము, కశ్మీర్‌, ‌లదాఖ్‌ ‌లలో ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఎబి పిఎం-జెఏవై) చీకటి సొరంగం చివరన కనిపిస్తున్న ఆశాకిరణంగా ఉంది. ఎంతో ఆశావహమైన ఈ ఆరోగ్య భరోసా పథకం పాత జమ్ము కశ్మీర్‌ ‌రాష్ట్రంలో 2108 డిసెంబర్‌ 1‌వ తేదీన ప్రారంభించారు. ఈ పథకం కింద ఏదైనా అనారోగ్యానికి గురైన వారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పొందే వీలుంటుంది. జమ్ము కశ్మీర్‌ (‌లదాఖ్‌ ‌సహా) 6.13 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. అంటే  ఎస్‌ఇసిసి గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30% కుటుంబాలు లాభం పొందుతున్నాయన్న మాట.

ఎబి పిఎం-జెఏవై ప్రవేశపెట్టడానికి ముందు జమ్ము కశ్మీర్‌ ‌లో అలాంటి ఆరోగ్య సంరక్షణ పథకం ఏదీ అందుబాటులో లేదు. దీంతో ఈ పథకం అక్కడ అద్భుతమైన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.  జమ్ముకశ్మీర్‌ ‌లో ఈ పథకం నమ్మశక్యం కానంతటి విజయం సాధించడమే కాకుండా ప్రజల జీవితానికి చక్కని భరోసా ఇచ్చింది. ఈ పథకం అమలులోకి తెచ్చిన రెండు సంవత్సరాల లోగానే జమ్ము కశ్మీర్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌పేరిట మరో స్కీమ్‌ ‌ను కూడా ఎబి పిఎం-జెఏవైకి అనుసంధానంగా స్థానిక   ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ఎబి పిఎం-జెఏవై తరహాలోనే జమ్ము కశ్మీర్‌ ‌ప్రభుత్వ ఉద్యోగులు/  పెన్షనర్లు, వారి కుటుంబాలు సహా మొత్తం ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కవరేజి అందిస్తోంది.

అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక స్వభావం, శీతాకాలంలో తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర సమస్యలు అన్నింటినీ అధిగమించి ఈ పథకంపై పాలనా యంత్రాంగం చూపిన కట్టుబాటు, ప్రజల్లో ఆసక్తి కారణంగా ఇది కనివిని ఎరుగని విజయం సాధించింది. పథకం ప్రవేశపెట్టిన 90 రోజుల గడువులోనే 10 లక్షలకు పైబడిన ఇ-కార్డులు జారీ కావడమే ఈ విజయానికి  నిదర్శనం. పథకం ప్రవేశపెట్టిన 6 నెలల గడువు లోగానే 57 శాతం కుటుంబాలకు ఇ-కార్డులు జారీ అయ్యాయి. ఇది ఇ-కార్డుల జారీ విషయంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌, ‌మొబైల్‌ ‌కనెక్టివిటీ సవాళ్లున్నప్పటికీ 81 శాతం ఇ-కార్డులను రియల్‌ ‌టైమ్‌ ‌లో ఆధార్‌ ‌నంబర్‌ ‌తో అనుసంధానించి పరీక్షించడం కూడా ఒక రికార్డు.

జిల్లా యంత్రాంగం కామన్‌ ‌సర్వీస్‌ ‌సెంటర్ల మద్దతుతో నిర్వహించిన సమగ్ర ప్రజా చైతన్య, ఔట్‌ ‌రీచ్‌ ‌కార్యక్రమాలు, ఇంటింటికీ వెళ్లి అర్హత గల వారిని నమోదు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు కావడానికి వీలు కలిగింది. తద్వారా లబ్ధిదారుల నమోదు కార్యక్రమం జోరుగా సాగింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ కలిపి 231 ఆస్పత్రులను (34 ప్రైవేటు) ప్యానెల్‌ ‌లో చేర్చారు. ఐఇసి కార్యకలాపాల ప్రత్యక్ష అనుసంధానంతో పథకం అమలు, వినియోగం కూడా గణనీయంగా బలం పుంజుకున్నాయి. రెండు యుటిల్లోనూ 85,689 మంది వివిధ చికిత్సల కోసం ఆస్పత్రుల్లో చేరగా రూ.48 కోట్ల విలువ గల (25-07-2020 నాటికి) వైద్యచికిత్సలు లబ్ధిదారులు ఉపయోగించుకున్నారు. ప్రతీ హాస్పిటలైజేషన్‌ ‌పై (75వ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ‌గణాంకాల ప్రకారం) రాష్ట్రంలో సగటున రూ.8789 – ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5714, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.43,098 – వ్యయం అయ్యేది. ఆ వ్యయాల నుంచి ప్రజలకు పెద్ద ఊరట లభించింది.

ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల పట్ల చూపే ఆసక్తి, వినియోగం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. యుటిల్లో మొత్తం 85,689 మందిలో 65 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందారు. ఇవి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులు సాంప్రదాయికంగా ఈ ప్రాంతంలోని 90 శాతం మంది ఇన్‌ ‌పేషెంట్లకు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులతో పోల్చితే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇన్‌ ‌పేషెంట్‌ ‌సర్వీసులకు డిమాండు ఎక్కువగా ఉండడం వల్ల ప్రైవేటు రంగం విస్తరణ కూడా బలోపేతం అయింది. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు క్లెయిమ్‌ ‌గా అందిన మొత్తాలతో అవి మౌలిక వసతులు పటిష్ఠం చేసుకోగలిగాయి. ఫలితంగా అందరు పౌరులకు విస్తృత ప్రయోజనం చేకూరింది. వినియోగించిన సొమ్ము రూ.48 కోట్లలో 60 శాతం  ప్రభుత్వ ఆస్పత్రులపై ఖర్చు చేయడం కూడా ఆసక్తికరం. పుల్వామా జిల్లా ఆస్పత్రి, శ్రీనగర్‌ ‌లోని షేర్‌ ఇ ‌కశ్మీర్‌ ఇన్‌ ‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ (‌స్కిమ్స్) ‌సమర్థత, ప్రభావశీలత, వనరుల వినియోగంలో నవ్యధోరణులకు పట్టం కట్టడంలోను, ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిలో సేవలందించడంలోను అసమానమైనవిగా నిలిచాయి.

పైగా ఈ స్కీమ్‌ ‌కే ప్రత్యేకంగా చెప్పదగిన పోర్టబులిటీ ప్రయోజనంతో లబ్ధిదారులకు మరింత సాధికారత ఏర్పడింది. వారు దేశంలో ఎక్కడైనా ఈ స్కీమ్‌ ‌కింద నమోదైన ప్యానెల్‌ ఆస్పత్రుల్లో ఎందులోనైనా చికిత్స పొందే సౌకర్యం లభించింది. 864 మంది ఈ ప్రయోజనం వినియోగించుకుని ఈ రెండు యుటిలకు వెలుపల ఢిల్లీ, చండీగఢ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్యానెల్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు.

ఇంటర్నెట్‌ ‌కనెక్టివిటీ లేకపోవడం లేదా ఇతర ఆంక్షల సమయంలో కూడా జాతీయ ఆరోగ్య సంస్థ క్రియాశీల మద్దతుతో జమ్ముకశ్మీర్‌ ‌కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్ర ఆరోగ్య సంస్థ లబ్ధిదారులకు చికిత్సలో ఎలాంటి అంతరాయాలు లేకుండా వినూత్న పంథాలో ఎబి పిఎం-జెఏవైని సమర్థవంతంగా అమలుపరిచింది. జమ్ము కశ్మీర్‌ ‌పునర్‌ ‌వ్యవస్థీకరణ చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనూ జరిగిన రోజువారీ అడ్మిషన్లు అంతకు ముందు నమోదైన రోజువారీ అడ్మిషన్ల సంఖ్య కన్నా అధికంగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా జమ్ముకశ్మీర్‌ ‌ప్రజల సంకల్పశుద్ధి ఇందులో ప్రతిబింబించింది.

తిరుగుబాటు శక్తుల కార్యకలాపాల కారణంగా జమ్ముకశ్మీర్‌ అం‌తటిలోనూ దక్షిణ కశ్మీర్‌ అత్యంత కల్లోలిత ప్రాంతం అయినప్పటికీ ఈ స్కీమ్‌ అమలు మాత్రం మొత్తం కేంద్రపాలిత ప్రాంతం అంతటిలోనూ ఒకేలా ఉంది. హృదయం ద్రవింపచేసే కొందరు లబ్ధిదారులకు చెందిన కథనాలు ఈ స్కీమ్‌ ‌ను ఒక ఆశాజ్యోతిగా భావించి అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానించారనేందుకు నిదర్శనంగా నిలిచాయి.

లదాఖ్‌ అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక స్వభావం ఉన్న ప్రదేశం అయినప్పటికీ ఇప్పుడు లదాఖ్‌ ‌యుటిలో భాగంగా ఉన్న కార్గిల్‌, ‌లే జిల్లాల్లో స్కీమ్‌ అమలు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంది. 70 శాతం కుటుంబాలకు ఇ-కార్డులు జారీ అయ్యాయి. లదాఖ్‌ ‌యుటిలో 10 ప్రభుత్వ ఆస్పత్రులను ఈ స్కీమ్‌ ‌కు చెందిన ప్యానెల్‌ ‌లో చేర్చారు. లదాఖ్‌ ‌కు చెందిన లబ్ధిదారుల వివిధ చికిత్సల కోసం రూ.65 లక్షల విలువ గల 750 ఆస్పత్రి అడ్మిషన్లు (25-07-2020 నాటికి) నమోదయ్యాయి. పోర్టబులిటీ ప్రయోజనంతో 30 శాతం చికిత్సలు జమ్ము కశ్మీర్‌, ‌ఢిల్లీ, చండీగఢ్‌ ‌లలో జరిగాయి. లదాఖ్‌ ‌లో లబ్ధిదారుల చికిత్స సగటు వ్యయం జమ్ము కశ్మీర్‌ ‌లో చికిత్సల సగటు వ్యయం కన్నా 150 శాతం అధికంగా ఉండడం లదాఖ్‌ ‌ప్రజలు మరింత మెరుగైన స్థాయి వైద్య చికిత్సల పట్ల చూపిన మక్కువకు నిదర్శనంగా నిలిచింది. క్లెయిమ్‌ ‌సొమ్ములో అధిక శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు అందడం వల్ల వాటిలో మౌలిక వసతులు, సేవల మెరుగుదలకు ఉత్తేజం ఏర్పడింది. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన జమ్ముకశ్మీర్‌, ‌లదాఖ్‌ ‌ప్రజల జీవనంలోకి రావడం వారికి చక్కని భరోసాగా నిలవడమే కాకుండా వాకి ఆరోగ్య వ్యయాలకు చక్కని ఆర్థిక రక్షణ కల్పించింది.

జమ్ము కశ్మీర్‌ ‌రాష్ట్ర ఆరోగ్య ఏజెన్సీ కృషికి విస్తృతమైన ప్రశంసలు వచ్చాయి. ఎబి పిఎం-జెఏవై అమలుకు చక్కని నమూనాగా కూడా ఇది ప్రశంసలందుకుంది. ఈ విజయం అందించిన స్ఫూర్తితో జమ్ము కశ్మీర్‌ ఆరోగ్య పథకం (ఎబి పిఎం-జెఏవై అనుసంధానతతో) టీమ్‌ ‌కూడా అదే కట్టుబాటు, ఉత్సాహంతో  పని చేసి దాన్ని విజయవంతం చేస్తుందనడంలో సందేహం లేదు.

ఆశాకిరణం
శ్రీనగర్‌ ‌లోని జకురా ప్రాంతానికి చెందిన అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వనిత మిస్రా బేగం (57). కొద్ది సంవత్సరాల క్రితం ఆమె భర్త మరణించాడు. ఆమె ప్రస్తుతం తన ఇద్దరు కుమారులతో కలిసి నివశిస్తోంది. చిన్న కుమారుడు చదువుకుంటుండగా పెద్ద కుమారుడు మాత్రం కూలీ పనులకు వెళ్తూ ఉంటాడు. అతను సంపాదించే అతి తక్కువ ఆదాయమే వారి కుటుంబానికి జీవనాధారం. మిస్రా  బేగంకు గుండె జబ్బున్నట్టు చాలా కాలం క్రితమే వైద్యులు నిర్ధారించారు. ఆమె సర్జరీ చేయించుకోవాలని కూడా వారు సూచించారు. కాని పేదరికం కారణంగా సర్జరీకి అయ్యే అంత వ్యయం భరించలేని స్థితిలో ఆమె కుటుంబం ఉంది.

పొరుగువారు ఎబి పిఎం-జెఏవై పథకం గురించి తెలియచేయడంతో ఆమె తక్షణం తన కుమారునితో కలిసి సమీపంలోని ప్యానెల్‌ ఆస్పత్రికి వెళ్లి పథకం గురించి వాకబు చేసింది. ఆమెకి అర్హత ఉన్నట్టు నిర్ధారించడంతో ప్రధానమంత్రి ఆరోగ్య మిత్ర ఆమె వివరాలన్నింటినీ పరిశీలించి తక్షణం ఇ-కార్డు జారీ చేసింది.

ఇ-కార్డు జారీ అనంతరం మిస్రా బేగం గుండె శస్త్రచికిత్స కోసం శ్రీనగర్‌ ‌లో మంచి పేరున్న ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి డబుల్‌ ‌చాంబర్‌ ‌పేస్‌ ‌మేకర్‌ అమర్చారు. సుమారు రూ.65 వేల ఆమె శస్త్రచికిత్స, వైద్యం ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించింది. సొంతంగా అంత ఖర్చు భరించుకోలేని మిస్రా బేగం కుటుంబానికి ఇది ఎంతో ఊరట కల్పించింది.
డాక్టర్‌ ఎ ‌జి అహాంగర్‌, ‌డైరెక్టర్‌, ‌స్కిమ్స్ 

Assuring AB PM in JammuAyushman KashmirKashmir and Jhaladakh - JAY
Comments (0)
Add Comment