‌క్రిమినల్‌ ‌మైండ్‌తోనే ఎంపీ కార్యాలయంపై దాడి

  • పోలీసులు పింక్‌ ‌డ్రెస్‌ ‌వేసుకుంటే మంచిది
  • అన్నింటికి తగిన జవాబు చెబుతామన్న బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌చుగ్‌
  • ‌కరీంనగర్‌ ‌జైలులో బిజెపి నేతలకు పరామర్శ

ప్రజాతంత్ర, కరీంనగర్‌ : ‌తెలంగాణ పోలీసులు పింక్‌‌డ్రెస్‌ ‌వేసుకోవాలని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ఎద్దేవా చేశారు.  సీఎం కేసీఆర్‌ ‌సూచనలతోనే కరీంనగర్‌ ‌వ్యవహారం అంతా జరిగిందన్నారు. మనసులో ద్వేషంతో క్రిమినల్‌ ‌మైండ్‌తోనే ఎంపీ కార్యాలయంపై దాడి చేసారని తరుణ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ తీసుకొస్తమనిమాట తప్పారన్నారు. ద్రౌపది వస్త్రాపహరణంతో మహాభారత యుద్ధం వొచ్చిందని, కరీంనగర్‌లో కూడా  కొందరు పోలీసులు దుర్యోధనుడు దుశ్శాసనునిలా మారి తమ కార్యకర్తలను అవమానించారన్నారు. వీటన్నింటికీ కచ్చితంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సమాధానం చెప్పి తీరుతామన్నారు.

బండి సంజయ్‌ ‌కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామన్నారు. జాగరణ దీక్షను జలియన్‌ ‌వాలాబాగ్‌లా మార్చారని తరుణ్‌ ‌చుగ్‌ ‌మండిపడ్డారు. ఒక్కో మహిళా కార్యకర్త వి•ద జరిగిన దాడికి సమాధానం చెబుతామన్నారు. ప్రశాంతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను కోవిద్‌ ‌నిబంధనల పేరుతో అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీసులు పింక్‌ ‌కలర్‌ ‌బార్బీ డాల్స్‌లా మారారన్నారు. వాళ్లంతా కేసీఆర్‌ ఆడించినట్లు  ఆడుతున్నారన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. తాము ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతుంటే కాంగ్రెస్‌ ‌వాళ్ళు ఏసీ రూంలలో ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల్ని రక్షించాల్సిన కరీంనగర్‌ ‌సీపీ భక్షిస్తున్నాడని విమర్శించారు. కరీంనగర్‌లో పోలీసులు గూండాగిరి చేస్తున్నారన్నారు.

జనరల్‌ ‌డయ్యర్‌ ‌వ్యవహరించినట్లు కరీంనగర్‌ ‌సీపీ వ్యవహరించారని విమర్శలు చేశారు. గవర్నర్‌తో పాటు.. కేంద్ర హోశాఖకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కరీంనగర్‌ ‌దౌర్జన్య కాండపై ఫిర్యాదు చేస్తామన్నారు. మహిళా కార్యకర్తలపై దౌర్జన్యంగా వ్యవహరించారని తరుణ్‌ ‌చుగ్‌ ‌మండిపడ్డారు. బీజేపీ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. బీజేపీ కార్యకర్తలపై జరిగిన ప్రతీ దాడిని గుర్తించుకుంటామన్నారు. గురువారం మాజీ సీఎం రమణ్‌ ‌సింగ్‌ ‌హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ఆయనతో కలసి కరీంనగర్‌ ‌వెళ్లే ముందు ఆయన మాట్లాడుతూ..మధ్యప్రదేశ్‌ ‌సీఎం శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కూడా కరీంనగర్‌కు వొస్తారన్నారు. అంతకుముందు ఆయన జైలులో ఉన్న బీజేపీ నేతల్ని పరామర్శించారు.

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment