పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు

  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు
  • వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చాం – అసెంబ్లీలో సిఎం జగన్‌ ‌వెల్లడి

అమరావతి ,నవంబర్‌ 25 : ‌మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని తెలిపారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు చేశామని అన్నారు. ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించామని పేర్కొన్నారు. పొరుగు రాష్టాల్లో్ర కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందింస్తున్నామని చెప్పారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం జగన్‌ ఆరోగ్య అంశంపై ప్రసంగించారు. ఇతర రాష్టాల్లో 130 సూపర్‌ ‌స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై ఎన్నో మెలికలు పెట్టిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రూ. 10 లక్షల ఆపరేషన్‌ను కూడా తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో గుండె మార్పిడి బైకాక్లియర్‌, ‌స్టెమ్‌ ‌సెల్స్ ‌చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.

29 నెలలుగా ఆరోగ్యశ్రీపై రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వ బకాయిలు రూ. 600 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ ‌చెప్పారు. 21 రోజుల్లో నెట్‌వర్క్ ఆస్సత్రులకు బిల్లుల చెల్లిస్తున్నామని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్య దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపును తీసుకొచ్చామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 2,446 చికిత్స అందించామని సీఎం పేర్కొన్నారు. గతంతో పోలిస్తే చికిత్పలు రెట్టింపు చేశామని వివరించారు. ఇంకా అవసరమైనవి కూడా కొత్తగా చేరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని సీఎం తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో 14వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ప్రతీ పార్లమెంట్‌ ‌నియోజకవర్గంలో ఒక మెడికల్‌ ‌కాలేజీ, నర్సింగ్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారనున్నాయి. విలేజ్‌ ‌హెల్త్ ‌క్లినిక్‌తో ప్రజల దగ్గరకే వైద్య సేవలు అందిస్తున్నాం. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

Arogyasree servicescm Jaganprajatantra newstelangana updatestelugu kavithalu
Comments (0)
Add Comment