అరకొర ఆంగ్ల మీడియం

సర్కారు బడిలల్లో
ఆంగ్లమీడియాలంట
ఆరంభశూరత్వంకూడా లేని
ప్రారంభమంట

దొర మాటిస్తే
ఉత్తదేనంట
బడిబాటలో ప్రగల్భాలు
బీదోళ్ళ పిల్లల
బతుకుబాటది
దారిపడాలంటే కాస్త కష్టమేనట

ఆంగ్లక్షరాలను తిలకిద్దామంటే
పుస్తకాలసలే ఉండవంట
వసతుల కల్పన కలనేనంట
బ్రష్టుపట్టించుటే ద్యేయమంట

పుస్తకాలు లేని బడిబాటలో
బ్రిడ్జి కోర్సుతో కాలయాపన
దీనుల దీనావస్థ
శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న
బడిగోడలను తలపిస్తున్నది

నిర్భాగ్యులకిక్కడ పొందాల్సిందేదైనా
నింగి నేలకున్నంత దూరం
విద్యావ్యాపారమిక్కడ
సామాన్యులకు అందనిద్రాక్షే

మాటల్లోకాదు కనిపించాల్సింది
చేతల్లో
తలరాతమారేది
దేశ భవిత మర్చేది

కార్పొరేట్‌ ‌ధీటుగా
తీర్చిదిద్దుతామని
ఘాటుగా పలికినా
చాటుమాటుభేరాలిక్కడ
అందరినీ అలవోకగా దోచే
మార్గమిదొక్కటే
బడావ్యాపారమిక్కడ విద్య

సి. శేఖర్‌(‌సియస్సార్‌),
‌పాలమూరు, 9010480557.

Comments (0)
Add Comment